Home / తెలుగు (page 12)

తెలుగు

తెలంగాణ ఆకాంక్షలను సాకారం చేసేందుకు కేసీఆర్ నెల రోజుల పాలన సాగింది ఇలా…

-కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీకాలాన్ని పొడిగిస్తూ జీవో జారీ -టాటా కంపెనీతో విమాన విడిభాగాల తయారీకి ఒప్పందం. ఆదిభట్లలో శంకుస్ధాపన -గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి మండలి ఏర్పాటు -ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజులు అందజేయాలని నిర్ణయం -తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట.. రాష్ట్ర పండుగలుగా బతుకమ్మ, బోనాలు -తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై చర్యలకు అసెంబ్లీ తీర్మానం -గురుకుల్ ట్రస్టు భూముల ఆక్రమణదారులపై చర్యలు. కట్టడాల కూల్చివేత.  -చెరువులు కుంటలు ఆక్రమణపై కొరడా వక్ఫ్ భూములు సహా ప్రభుత్వ భూములను ఆక్రమించిన కబ్జాకోరులపై తీవ్ర చర్యలు  -రైతులకు ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువుల ముందస్తు పంపిణీ  -ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు. డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు ఏర్పాట్లు. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన -తండాలను పంచాయితీలుగా చేసేందుకు సర్వే -పాలన మీద ప్రతి అంగుళమూ తెలంగాణ ముద్ర -మానవీయ విలువలు, మేధావుల భాగస్వామ్యం -హైదరాబాద్‌లో ఇటు ఆధునీకరణ, అటు వారసత్వ పరిరక్షణ  -తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన కేసీఆర్ నెల ...

Read More »

నెల రోజుల స్వయంపాలన అస్తిత్వ పతాక

KCR_Telangana CM

ఏలే వాలకం తొలి అడుగుల్లోనే తెలిసిపోతుందంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఈ నెల రోజుల తొలి అడుగులు మంచిమార్కులు సాధించి పెట్టాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటివరకు చూసిన ముఖ్యమంత్రులకంటే ఎలా భిన్నమైనవారో, ఒక కొత్త రాష్ట్ర నాయకునిగా ఏమి చేయగలడో ఈ నెలరోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఎరుకపరిచారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి సమావేశాల్లో కేసీఆర్ చేసిన ప్రసంగం అధికార ప్రతిపక్షాలను సైతం మంత్రముగ్ధులను చేసింది. తెలంగాణ రాష్ట్ర చారిత్రతక అవసరాన్ని, అస్తిత్వకాంక్ష మూలాలను, సమస్యల లోతులను తడిమి, తాను ఏమి చేయదల్చుకుంటు న్నారో చెప్పినప్పుడు సభ యావత్తూ ఏకీభావంతో గొంతుకలిపింది. తెలంగాణ నాయకత్వంపై మనలో మనకే బలపడిపోయిన ఒక చిన్నచూపును, సందేహ దష్టిని కేసీఆర్ పటాపంచలు చేశారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ వడివడిగా అడుగులువేస్తూ అనతికాలంలోనే ఆయన రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగారు. సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం, సమస్యలకు సంబంధించిన లోతైన అవగాహన, వేగంగా నిర్ణయాలు చేయగల ైస్థెర్యం కేసీఆర్‌ను ఒక బలమైన, దక్షత కలిగిన ముఖ్యమంత్రిగా ప్రజల ముందు నిలిపాయి. పోలవరం వివాదం, విద్యుత్ ఒప్పందాల రద్దు, కష్ణా జలాల విడుదల, గురుకుల ...

Read More »

మేధావుల అంచనాలు నిజమవుతాయా లేక సామాన్య జనం కలలు ఫలిస్తాయా?

తెలంగాణ వస్తే ఏం ఒరుగుతుం ది. ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పులేమీరావు. కాకపోతే సీమాంధ్ర పాలకుల బదులు తెలంగాణ పాలకులు వస్తారని కొంత మండి చెబుతున్నా రు.అలాగే..పథకాల పేర్లు మారతా యి. కానీ ప్రజల జీవితాలు మారవు. ఒకసారి తెలంగాణ కావాలనే డిమాం డ్ వచ్చింది కాబట్టి, రాష్ట్రం సాధించుకోవాలనే పట్టుదల అందరిలో కనిపి స్తుంది. ఆకల రేపోమాపో నిజం అవుతుంది. కానీ రాష్ట్ర సాధన అనేది తెలంగాణ ప్రజల కష్టాలను తొలగించే, సమస్యలు పరిష్కరించే సర్వరోగనివారిణి మాత్రం కాదని తెలంగాణ ఉద్యమం ఉధతంగా నడుస్తున్న సమయంలో చాలామంది మేధావులు చేసిన విశ్లేష ణ ఇది. ఈమాటలన్నది ఏసీమాంధ్ర వ్యక్తులో కాదు. తెలంగాణ మేధావులే సూత్రీకరించిన విషయం. కానీ, సామాన్యజనం మాత్రం అలా అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా తమ బతుకులు మారతాయని భావించారు. అందుకే ఉద్యమంలో మమేకం అయ్యారు. ఉద్యమం సందర్భంలోనే కాదు, ఎన్నికల సమయంలో కూడా ప్రజలు తెలం గాణ రాష్ట్రంలో తమకేదో మేలు జరగాలని కోరుకున్నారు. పాత కాంగ్రెస్ పాలనే వస్తే మార్పు జరగదని, ఉద్యమానికి నేతత్వం వహించిన వారే, రేపు రాష్ర్టాన్ని పునర్నిర్మించాలని కోరుకున్నారు. అందుకే ...

Read More »

తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

                                                                                                         -అన్-అలాటెడ్ విద్యుత్ కోటాలోనూ అన్యాయం -ఆంధ్రాకు 177 మెగావాట్లు, తెలంగాణకు 100 మెగావాట్లు -కోతలతో అల్లాడుతున్న మన రాష్ట్రంపై కరుణ చూపని వైనం విద్యుత్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతోంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కడలేని ప్రేమ ప్రదర్శిస్తున్న కేంద్రం కోతలతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోంది. ఇప్పటికే ఏపీ సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) రద్దు చేస్తామంటూ రాద్ధాంతం సష్టించినా అందుకు మోడీ సర్కార్ సానుకూలత వ్యక్తంచేసింది. తాజాగా సోమవారం జరిపిన అన్ అలాటెడ్ విద్యుత్ కోటాల్లోనూ తెలంగాణ పట్ల వివక్షను చాటుకుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల (సీజీఎస్) ...

Read More »

ఒక్క ఇటుక పేర్చినా కూల్చుడే!

నగరంలోని ప్రభుత్వ భూముల్లో ఒక్క ఇటుక పేర్చినా కూల్చివేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు కమిషనర్ సోమేష్‌కూమర్ ప్రత్యేక కార్యచరణ సిద్ధంచేశారు. ఉద్యోగులకు లంచాలిచ్చి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం, అనంతరం కోర్టు స్టేల మాటున వాటిని కొనసాగించడం నగరంలో మామూలైపోయింది. ఇటువంటి అక్రమ నిర్మాణాలు అటు ప్రభుత్వానికి, ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులకు తలనొప్పిగా తయారవుతున్నాయి. అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే తుంచివేస్తే ఈ సమస్య ఉండదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఓ నిర్ణయానికొచ్చారు. అందుకే మాన్‌సూన్ ఎమర్జెన్సీ బందాల తరహాలోనే సర్కిల్‌కు ఒకటి చొప్పున ఎన్‌ఫోర్స్‌మెంట్ బందాలను రంగంలోకి దింపాలని నిశ్చయించారు. నగరంలో ఏటా అక్రమ నిర్మాణాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీకి పది నుంచి 12వేలవరకు ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే ప్రతినెలా పదుల సంఖ్యలో కూల్చివేతలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంటు బందాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా పనిచేయడంలేదు. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకాని(బిపిఎస్)కి రెండు లక్షలకు పైగా దరఖాస్తులు రావడం, గురుకుల్ ట్రస్టు భూముల్లో వందల సంఖ్యలో ఏర్పడిన ఇళ్లే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాకుండా బీపీఎస్ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 40వేలు చెరువులు, కుంటల్లోని ఇళ్లకు సంబంధించినవి ...

Read More »