Home / తెలుగు

తెలుగు

తెలంగాణ సినిమా ఇరాన్ మార్గం

మానవజాతి చరిత్రలో జరిగిన విముక్తి పోరాటాలన్నింటికీ కారణాలు రెండే రెండు. ఒకటి అస్తిత్వ కాంక్ష! రెండోది ఆత్మగౌరవ ఆకాంక్ష. ఈ రెండు కారణాలే స్వాతంత్యోద్యమానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మార్గాల్ని వేసాయనేది వాస్తవం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాజకీయంగా, భౌగోళికంగా తెలంగాణ ప్రజలు విముక్తులయ్యారు. కానీ సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, సినిమాల పరంగా ఆ విముక్తి ఇంకా జరగాల్సివుంది. సాంస్కృతిక కళారూపలన్నిట్లోనూ సినిమాది అగ్ర ప్రాధాన్యత అనడంలో సందేహంలేదు. అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని , ఆత్మగౌరవాన్ని గత ఆరు దశాబ్దాలుగా తృణీకరిస్తూ వలస పాలకుల ఆధితప్య ధోరణిని తెలంగాణ నేలమీద సైతం బలోపేతం చేసిన కారకాలలో తెలుగు సినిమా చూపించిన ప్రభావం, పోషించిన పాత్ర అనన్యసామాన్యం. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా నుంచి తెలంగాణ సినిమాని విముక్తం చేయాలనే ప్రయత్నాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే తెలుగు సినీ పరిశ్రమ పేరిట బలంగా పాతుకుపోయిన వలస సంస్కృతుల బారి నుండి తెలంగాణ సినిమాకు సొంత గ్రామర్ రూపొందించడం సాధ్యమా? అసలు తెలంగాణ సినిమా అస్తిత్వాన్ని తెలుగు సినిమా సునామీ నుండి తట్టుకొని నిలబడగలిగేలా చేయగలమా? తెలుగు సినిమా తరహా మాస్ మసాలా ...

Read More »

నేడు కేసీఆర్, చంద్రబాబు చర్చలు!

-సమస్యలు పరిష్కరించుకుందాం- గవర్నర్ సమక్షంలో నేడు కేసీఆర్, చంద్రబాబు చర్చలు- రాజ్‌భవన్ వేదికగా 12 గంటలకు సమావేశం- వివాదాస్పదమైన అంశాలపై సీఎంల కీలక భేటీ- స్థానికత, విద్యుత్ సమస్య, ఫాస్ట్.. చర్చకు రానున్న మరికొన్ని కీలకాంశాలు రాష్ట్ర విభజన వికాసానికి దారితీసేలా ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆదివారం రాష్ట్ర గవర్నర్ సమక్షంలో చర్చలు జరుపనున్నారు. విభజన నేపథ్యంలో తలెత్తుతున్న పలు సమస్యలు ఇరు ప్రాంతాల మధ్య ఇబ్బందులకు తావిస్తున్నాయి. వీటిపై మాటామాటా అనుకోవడంకంటే కూర్చుని మాట్లాడుకుని, పరిష్కరించుకుంటే మంచిదని తెలంగాణ, ఏపీ సీఎంలు కే చంద్రశేఖర్‌రావు, ఎన్ చంద్రబాబునాయుడు అభిప్రాయానికి వచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో ఉభయ ముఖ్యమంత్రులు నరసింహన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే.. మామూలుగా మాట్లాడుకోవడంకంటే నిర్మాణాత్మక పద్ధతిలో ఉభయ రాష్ర్టాల సీఎస్‌లు, ముఖ్య అధికారులతో సహా కూర్చుని చర్చించుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచన చేశారు. ఈ మేరకు ఆదివారం రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ కీలక భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అపోహలు, ...

Read More »

సర్వేపై తెలంగాణ భవిష్యత్ ఆధారపడి ఉంది

- సందీప్ రెడ్డి కొతపల్లి ఓ ఊళ్ల రాములు అని ఉన్నడు. ఆయినకో పెండ్లం, నలుగురు కొడుకులు, ఓ బిడ్డ. ఓ కొడ్కుకు కడుపునొప్పి. ఇంగొగనికి కాలునొప్పి. పెండ్లానికి కండ్లు సక్కగ కనిపియ్యవు. కాని ఇంట్లోళ్లకు ఎవ్వలకు ఏం రోగముందో రాములుకు మాత్రం తెల్వదు. ఎప్పుడడిగినా పిల్లలు ఏదో ఓ మాటజెప్పి తప్పించుకుంటుండ్రు. అసలు విషయం మాత్రం సక్కగ జెప్పరు. దీంతో రాములుకు పైసలు ఖర్సయితుండయి గాని తక్లీఫ్ మాత్రం తక్వయితలేదు. “తేలు మంత్రం రానోడు పాముకాటుకు మందేసిండని” సామెత. ఇంట్ల ఎవ్వలకు ఏం ఇబ్బంది తెల్వంది రాములు ఏంజేస్తడు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే మీద విపక్ష నేతలు, సీమాంధ్ర నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నరు. సంక్షేమ పథకాలు ఎత్తేసేందుకేనని, దీని ఎన్క శాన మోసం ఉందని, అయ్యాల పెండ్లిళ్లు ఉండయి సర్వే ఎట్ల జేస్తరు అని, ఒక్క దినం గాదు శానదినాలు సర్వే జెయ్యాలని నాలికె ఎట్ల తిర్గుతె అట్ల జోలి జెప్పి జనాల తప్పుదారి పట్టించే ప్రయత్నంల బిజీగ ఉన్నరు. 60 ఏండ్ల సంది అధికారం అనుభవించిండ్రు. అడ్డగోలుగ జనం పైసలు కమాయించిండ్రు. వీడు ...

Read More »

రాజ్‌భవన్‌లో చంద్రుల భేటీ

-వాడివేడిగా సాగిన సమావేశం-వివాదాలపై నిలదీసిన కేసీఆర్-చర్చించుకుందామన్న చంద్రబాబు-గవర్నర్ తేనేటి విందుకు హాజరైన ఇద్దరు సిఎంలు-గవర్నర్ చొరవతో జరిగిన అంతర్గత సమావేశం-సహకరించుకోవాలని నరసింహన్ హితోక్తి తెలంగాణ, ఏపీ సీఎంలు కే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ చొరవతో జరిగిన ఈ సమావేశం వాడివేడిగానే జరిగినట్టు సమాచారం. పరిపాలనాపరమైన అంశాలు, కీలక నిర్ణయాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య తలెత్తుతున్న వివాదాల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ ప్రత్యేక చొరవతో ఈ సమావేశం జరిగింది. జటిలమైన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం.  అంతర్గత మందిరంలో భేటీ.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు హాజరయ్యారు. విందు తర్వాత గవర్న ర్ తన అంతర్గత సమావేశమందిరంలోకి ఇద్దరినీ పిలిచి వారితో ముఖాముఖి సమావేశానికి తెరతీశారు.ఈ సమావేశం హాట్‌హాట్‌గానే సాగింది. హైదరాబాద్‌పై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల వ్యవహరంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సామాజిక సర్వేను వివాదాస్పదం చేయడం వంటి అంశాలపై వేడిగానే చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడిన విషయాన్ని పరిగణించకుండా తమ రాష్ట్ర పరిపాలనా నిర్ణయాలలో జోక్యం ...

Read More »

సమగ్ర సర్వేకు సర్వం సిద్ధం

తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పథకాల రూపకల్పనలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 1996 నుంచి ఇప్పటివరకు జరిగిన ఐదు సర్వేలపై లేని వివాదం తెలంగాణ సర్కారు తలపెట్టిన ఇంటింటి సర్వేపై లేవనెత్తి, రాజకీయకోణంలో దానిని రచ్చచేసే చర్యలను ప్రభుత్వం చాకచక్యంగా తిప్పికొట్టింది.బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సర్వే తప్పనిసరి అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నది. పాలకులు ప్రజలకు సేవకులుగా, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే ప్రతి ఒక్క రూపాయి ప్రజల కోసమే ఖర్చుపెట్టి, పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వచ్ఛందంగా తమ వివరాలను అందించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి ఆరు పేజీలతో కూడిన సమగ్ర ఫార్మాట్‌ను ప్రభుత్వం ముందుగా రూపొందించింది. అయితే ఈ సర్వే నిర్వహణలో ఎలాంటి దురుద్దేశం లేకపోయినా కొందరు దీనిని వివాదం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీంతో అపోహలకు ఆస్కారం ఉన్న అంశాలను ప్రభుత్వం సర్వే పత్రంనుంచి తొలగించింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజల ...

Read More »