Home / తెలుగు (page 14)

తెలుగు

తెలంగాణ ఉమ్మడి అస్తిత్వ భావనలకు మూలం ప్రాంతమే

తెలంగాణ ఉద్యమమే స్థానికీయ (నేటివిటీ) ఉద్యమం. . హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రతో బలవంతంగా కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956 నుంచీ స్థానికీయత ఆధారంగానే తొలి ఉద్యమ భావనలు రూపొందాయి. అంతకుముందు సర్వస్వతంత్రంగాఉన్న హైదరాబాద్ సంస్థానంలో కూడా పాలనావసరాల రీత్యా గైర్‌ముల్కీలను ఉద్యోగాల్లో చేర్చుకున్నారు. అప్పుడే ముల్కీల ఆందోళ న ప్రారంభమయింది. పరిపాలనలో ఇంగ్లీషు ప్రవేశించినప్పటి నుంచి ఉర్దూ రాజభాషగా విలసిల్లిన హైదరాబాద్ స్టేట్‌లో స్థానికీయత అనేది ఒక సమస్యగానే ఉన్నది. నిజాం కాలం నాటి ఈ పరిణామాల వల్ల అచ్చు హైదరాబాదీలు చేసిన ఆందోళనల ఫలితంగా నిజాం ముల్కీ నిబంధనలు ప్రవేశపెట్టారు. ఈ ముల్కీ నిబంధనలు 1956 తర్వాత క్రమక్రమంగా సడలించారు. 1948లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను విముక్తి చేసిన అనంతరం జరిగిన పరిణామాల వల్ల ముల్కీ నిబంధనలను ఉల్లఘించి స్థానికేతరులకు ఉద్యోగాల్లోకి తీసుకోవడం భారీగా జరిగింది.స్వతంత్ర హైదరాబాద్ స్టేట్‌లో ప్రభుత్వం ఏర్పడేదాకా వెల్లోడి పాలన సాగింది. వెల్లోడి పాలనలో ఆంగ్లావసరాల కోసం ఉద్యోగులను తెచ్చుకోవడంతో స్థానికుల అవకాశాలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో ఇంగ్లీషు విద్యావ్యాప్తి లేకపోవడంతో ఇక్కడి వారి అవకాశాలు సన్నగిల్లాయి. సరిగ్గా ఒక ప్రాంతం మీద ఆధిపత్యం ...

Read More »

ఇంజినీరింగ్ విద్యార్థులు ఐటీ రంగంలో రాణించడానికి వత్తినైపుణ్య శిక్షణ – కేటీఆర్

ఇంజినీరింగ్ విద్యార్థులు ఐటీ రంగంలో రాణించడానికి అవసరమైన వత్తినైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమి ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టీఏఎస్‌కే-టాస్క్)ను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి కే తారకరామావు వెల్లడించారు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కంపెనీలకు అవసరమయ్యేవిధంగా నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ అందిస్తామని, ఇందుకోసం కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పద్ధతిలో సాఫ్ట్‌వేర్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఐటీ అభివద్ధిలో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదని కేటీఆర్ తెలిపారు. ఇందులోభాగంగా శుక్రవారం సాయంత్రం 7గంటలకు నగరంలోని తాజ్‌కష్ణా హోటల్‌లో హైదరాబాద్‌లోని 150 ప్రముఖ ఐటీ కంపెనీల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐటీ పరిశ్రమను మరింత విస్తరించేందుకు, పెట్టుబడులు ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. ఐటీ రంగం అభివద్ధి కోసం త్వరలో అమెరికాలోని తెలుగు అసోసియేషన్‌తో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం జూలై మొదటి వారంలో తాను అమెరికా వెళ్లనున్నట్లు తెలిపారు. ఐటీ రంగం అభివద్ధికి పెద్దఎత్తున రాష్ర్టానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కొత్తగా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని పరిశ్రమలు స్థాపించాలనుకునే ...

Read More »

అప్పుడు ఉద్యమ ఏకీకరణ, ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ

ఒక రాజకీయ ఉద్యమం వల్ల సిద్ధించిన తెలంగాణలో రాజకీయ కూడా జరగడం ఇవ్వాళ్లటి ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమం స్వీయ రాజకీయ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమం. తెలంగాణ ఏర్పడింది. ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌కు అధికారం దఖలయింది. పదమూడు సంవత్సరాలు స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం సకల ఉద్యమశ్రేణులను కలుపుకొని కేసీఆర్ సుదీర్ఘ ఉద్యమం నడిపారు. తెలంగాణకు ఏకైక నాయకుడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ నాయకత్వంపైన నమ్మకం పెరిగింది. తెలంగాణ తేవడానికి మత్యుముఖం దాకా వెళ్లివచ్చిన కేసీఆరే వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా అభివద్ధి చేయగలడన్న విశ్వాసమూ పెరిగింది. అందువల్లనే తెలంగాణ కోరుకున్న, ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేసిన రాజకీయశక్తులు కేసీఆర్ నాయకత్వం క్రిందకు రావడం ఒక ముందంజ. నిజానికి ఇప్పుడు ఏ ఎన్నికలూ లేవు. టికెట్ల గొడవా లేదు. పదవుల గొడవ అసలే లేదు. గెలుపు ఓటముల బాధా లేదు. అయినప్పటికీ రాజకీయ కప్పలతక్కెడ అనివార్యతలు లేనప్పటికీ బుధవారం నాడు టీఆర్‌ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున జరిగిన చేరికలు చిల్లర రాజకీయాల కోసం కాదన్న విషయాన్ని ధవపరుస్తున్నాయి. కాంగ్రెస్‌లో ...

Read More »

కృష్ణా డెల్టాకు పది టీఎంసీలు: మంచినీటి వెనుక సాగునీటి కుట్ర!?

nagarjuna sagar dead storage

కృష్ణా డెల్టాకు పది టీఎంసీల నీటిని విడుదలచేసే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఆంధ్ర సర్కార్ నీటిపై చేస్తున్న తప్పడు లెక్కల గారడీ అయోమయానికి దారితీసింది. వర్షాభావం వల్ల ఒకవైపు భారీ ప్రాజెక్టులలో నీరు అడుగంటుతుంటే మరోవైపు తాగునీటికోసం పది టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ పేచీ పెడుతున్న ది. మొదట కష్ణా డెల్టాకు నీరు కావాలన్న సర్కార్ ఆ తర్వాత అత్యవసరంగా తాగునీటి కోసం నీటిని విడుదల చేయాలని ఒత్తిడి తెస్తున్నది. వాస్తవానికి కష్ణా డెల్టా పరిధిలో కేవలం 2 టీఎంసీల నీరు విడుదల చేస్తే తాగునీటి అవసరాలు తీరుతాయని అంచనా. ఆంధ్ర సర్కార్ మాత్రం పది టీఎంసీలను డిమాండ్ చేసి, తాగునీటి పేరిట నారుమళ్లకు నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. గతంలో సీమాంధ్ర పాలకుల ఆధిపత్యంలోని సర్కార్లు ఇష్టానుసారం తాగునీటి పేరిట నాగార్జునసాగర్ నుంచి కష్ణా నీటిని మళ్లించి తెలంగాణ వాటాకు గండి కొట్టాయి. ఈసారి పరిస్థితి మారింది. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్ డ్యామ్ సర్కిల్ నిర్వహణ తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. నీటిని విడుదల చేయాలంటే తెలంగాణ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అధికారుల ...

Read More »

రాధాక్రిష్ణ గారు…ఈ చైతన్యం మీ చలవే!

abn tv9 boycott telangana

స్వయంకృతాపరాధము… టివి9, ఎబిన్ ల ప్రసారాల నిలిపివేతపై  ఆశించినంతగ  మేధావుల  నుండి స్పందన రానందుకు  ఎబిన్ అధినేత, రాధాక్రిష్ణ ఖిన్నుడైనట్టున్నారు. ఇదేనా ప్రజాస్వామ్య  తెలంగాణ?  ఇందుకేనా తెలంగాణ కోసం పోరాడింది?   అని తన బాధను లోకం బాధగ చెప్పే ప్రయత్నం చేసినా, పెద్ధగ ఫలితం కల్గినట్టులేదు. అయినా, ప్రజాస్వామ్య పరిరక్షనకు మీరెంతగా పాటుపడిందీ…,  పిడికెడు  గుత్తేదార్ల  కొమ్ముకాస్తు,  కోట్లాది  ప్రజల అశలపై ఎట్లా  నీళ్ళు చల్లడానికి ప్రయత్నించిందీ…, తెలంగాణ వాదమే లేదనీ, తెలంగాణ  రానే రాదనీ,  రెచ్చగొట్టి,  వందల విద్యార్థుల  ఆత్మ హత్యలకు ఎట్లా    కారణమైందీ…,  ఇంకా ఏ మేధావి   మరవలేదు. అవి ఇప్పట్లో మరిచేవి కావు. నిజానికి, ఈ చైతన్యం మీ చలవే!. నాలుగున్నరేల్ల క్రితం  తెలంగాణ ప్రకటించబడినపుడు,  ప్రజాస్వామ్యమంటె ఏమిటో, అందులో మీడియా పాత్ర  ఎట్లుండాలో, మీరు గనక చూపించక పోయుంటె, ఒక సగటు మనిషికి ఈ రాజకీయలు అర్థం అయ్యేవి కావు, తన వాడెవడో…, తనతోనే ఉండి గోతులు తీసే వాడెవొడో…   తెలిసేదీ కాదు. ఆయినా ఇప్పుడు బాదపడి ఏం  లాభం రాధాక్రిష్ణ  గారు, మహానది లాంటి తెలంగాణ ఉద్యమంలో,  ఏ ...

Read More »