Home / తెలుగు (page 10)

తెలుగు

హైదరాబాద్ ని రెగ్యులేటెడ్ సిటీ చేస్తాం

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు జాతీయ/అంతర్జాతీయ కన్సల్టెంటును నియమించనున్నారు. నగరాన్ని రెగ్యులేటెడ్ సిటీగా మార్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక-పట్టణాభివృద్ధి శాఖకు బాధ్యతను అప్పగిస్తూ రాష్ట్ర క్యాబినెట్ బుధవారం తీర్మానించింది. క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మీడియాకు వివరాలు వెల్లడించారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు వీలుగా మాస్టర్‌ప్లాన్ తయారీకి కన్సల్టెంటును నియమించాలని క్యాబినెట్‌లో తీర్మానం చేసినట్లు సీఎం తెలిపారు. నగరంలోని వ్యర్థాలను నిర్మూలించేందుకు మరిన్ని డంపింగ్‌యార్డుల ఆవశ్యకత ఉందని, దీనికోసం కనీసం 2వేల ఎకరాల స్థలం అవసరం అవుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ తనవద్దే ఉన్నందున దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. నగరంలో అక్రమ నిర్మాణాలను ప్రస్తావిస్తూ.. నగరంలో 60వేలకు పైచిలుకు అక్రమ భవనాలు ఉన్నాయి. నాలాలు, చెరువులు, ఈఎన్‌టీ ఆస్పత్రి, దేవాదాయ భూములు అన్నీ కబ్జాకు గురయ్యాయి. సాక్షాత్తూ సెక్రటేరియల్‌కు కూతవేటు దూరంలోనే క్లబ్బులు నిర్వహిస్తున్నారు. భారీసంఖ్యలో అక్రమ భవనాలు ఉన్నాయి. వీటన్నింటిపై చర్యలు తీసుకుని నగరాన్ని ఓ రెగ్యులేటెడ్ సిటీగా మార్చాలి అని సీఎం పేర్కొన్నారు. రాజ్‌భవన్, అసెంబ్లీ, సీఎం కార్యాలయాల ఎదుట చిన్నపాటి వర్షానికే భారీగా నీరు నిలుస్తున్నది. దీనిపై ...

Read More »

న్యాయబద్ధత, మానవత్వం లేని భారత పాలకవర్గ విధానాలకు నిదర్శనం పోలవరం ప్రాజెక్టు

POLAVARAM TRIBALS

-ఎన్ వేణుగోపాల్ అంతరాల వ్యవస్థలో పాలకులు కావాలంటే న్యాయబుద్ధీ, మానవత్వమూ వదులుకోవలసి ఉంటుంది. ఏ విధానమైనా, ఆచరణ అయినా వ్యవస్థలో కొన్ని వర్గాలకే లాభదాయకంగా, మరికొన్ని వర్గాలకు నష్టదాయకంగా ఉంటాయి గనుక ఏ విధానాన్నీ న్యాయబద్ధంగా వివరించడం సాధ్యం కాదు. కొన్ని వర్గాలకు జరిగే నష్టాన్ని విస్మరించడానికి మానవతాదృష్టినీ వదులుకోక తప్పదు. అందువల్లనే ‘తటస్థంగా కనిపించే సూత్రబద్ధ, హేతుబద్ధ, చట్టబద్ధపాలన’, ‘ఎక్కువమందికి ఎక్కువ మంచిచేసే కార్యక్రమాలు’ అనే సూత్రాలు ఆధునిక పాలనలోకి వచ్చి చేరాయి. మహాఘనత వహించిన భారత పాలకులకు మాత్రం ఆ హేతుబద్ధత చట్టబద్ధత అన్నా, బహుజన హితాయ అన్నా కంటగింపు. వారికి కావలసింది తమ ఆశ్రితుల ప్రయోజనాలు. అవి ఎంత మోసపూరితంగా సాధించినా ఫరవాలేదు. పిడికెడు మంది తమవారికోసం కోట్లాది బహుజనులను మోసగించినా, చంపివేసినా ఫరవాలేదు. ఈ న్యాయబద్ధత లేని, మానవత్వం లేని భారత పాలకవర్గ విధానాలకు నిదర్శనం కావాలంటే పోలవరం ప్రాజెక్టుకు మించిన ఉదాహరణ మరొకటి ఉండబోదు. సమాజం చేత ఆ విషగుళికను మింగించడానికి సాంకేతిక వ్యవస్థలతో, న్యాయవ్యవస్థలతో, చట్టసభలతో ఆడించిన నాటకాలు మన కళ్లముందర సాగుతున్నాయి. పోలవరం ఉదంతం పాలకుల దుర్మార్గానికి మాత్రమే కాదు, ...

Read More »

కేసీఆర్ కు ప్రజలే ప్రతిపక్షం!

kcr rayalatelangana bandh

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారపగ్గాలు చేపట్టడంతో కోస్తాంధ్ర పెట్టుబడిదారి వర్గాల కళ్లు మండుతున్నాయి. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నలుమూలలకు తీసుకెళ్లి ..సబ్బండ వర్గాలను తెలంగాణ ఉద్యమంలోకి నడిపించి ..తెలంగాణ ఎందుకు కావాలి ? ఎందుకు రావాలి ? అన్నది సూక్ష్మంగా అందరికి వివరించి తెలంగాణ సాధించిన కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వస్తాడని చంద్రబాబు అనుకూల ..చంద్రబాబు కొమ్ముకాసే సీమాంధ్ర మీడియా మాఫీయా ఏ మాత్రం అంచనా వేయలేదు. కలలో కూడా వారు ఈ విషయాన్ని ఊహించలేదు. ఎందుకంటే గత 14 ఏళ్లుగా కేసీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి, తెలంగాణ ఉద్యమాన్ని తెరమరుగు చేయడానికి, తెలంగాణ రాష్ట్ర సమితిని అతలా కుతలం చేయడానికి వారు చేయని ప్రయత్నం లేదు. ఇంకా ముఖ్యంగా కేసీఆర్ 11 రోజుల నిరహార దీక్ష 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రకటన తరువాత ఈ వర్గంలోని అహంభావం, వికృత స్వభావం, తెలంగాణ వ్యతిరేక భావన జడలు విప్పింది. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు వీరు ...

Read More »

తెలంగాణ ‘ఇంజనీర్సు డే’ గా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి (జులై 11)

తెలంగాణ ఆర్థర్ కాటన్…నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి దేశవ్యాప్తంగా తెలియని వారుండరు. ఆయన భారతదేశం గర్వించదగ్గ ఇంజనీరు. భారతరత్న బిరుదాంకితుడు. భారతదేశంలో నీటి పారుదల రంగానికి పునాదులు వేసిన తొలి తరం మేధావి. అటువంటి మేధావికి సమకాలికుడు, అంతటి స్థాయి కలిగిన ప్రతిభావంతుడైన ఇంజనీరు నవాబ్ అలీ నవాజ్‌జంగ్. హైదరాబాద్ రాజ్యంలో పటిష్టమైన ప్రణాళికలు రచించి, అనేక భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ తెలంగాణ సాగునీటి రంగానికి పితామహుడు.నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్‌గా ప్రపంచానికి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు పరిచితుడైన ఈయన అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. 11-7-1877న హైదరాబాద్‌లో జన్మించాడు. హైదరాబాద్ రాజ్యంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మీర్ అహ్మద్ అలీ హైదరాబాద్ అబిడ్స్‌లోని సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకొన్నాడు. ఇంగ్లీషుతో పాటు లాటిన్ భాషను కూడా నేర్చుకొన్నాడు. ఆ తర్వాత నిజాం కాలేజీలో చేరాడు. అక్కడ నాలుగేండ్లు ఉన్నత విద్యను అభ్యసించి 1896లో ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌తో ఇంగ్లండ్‌లో ప్రఖ్యాతి గాంచిన కూపర్‌హిల్ ఇంజనీరింగ్ ...

Read More »

బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి

నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2014 – 2015 వార్షిక బడ్జెట్ లో తెలంగాణకు అనుకున్న విధంగానే అన్యాయం చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టమయిన అయిష్టతను, వివక్షను బయటపెట్టుకుంది. తెలంగాణ పట్ల మొదటినుండి స్పష్టమయిన వ్యతిరేకతతో ఉన్న నరేంద్రమోడీ, ఆయన సన్నిహితుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చక్రం తిప్పుతున్న ప్రస్తుత ప్రభుత్వంలో తెలంగాణకు రాబోయే రోజుల్లోనూ అన్యాయమే జరుగుతుంది అన్నదానికి ఇదో ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో వరాలజల్లు కురిపించిన అరుణ్ జైట్లీ తెలంగాణకు మాత్రం కంటితుడుపుగా ఒక్క ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం వ్యవసాయ విశ్వవిద్యాలయం, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పోర్టు అభివృద్ది, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, అనంతపురం జిల్లా హిందూపూర్ లో నేషనల్ కస్టమ్స్ మరియు ఎక్సయిజ్ అకాడమీని నెలకొల్పాలని నిర్ణయించారు. ఇక వీటితో పాటు ఎయిమ్స్, ఐఐటీలను కేటాయించారు. ఇంత స్పష్టంగా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం కేంద్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న దాఖలాలు గానీ ..తెలంగాణ ప్రాధాన్యాలకోసం పట్టుబడుతున్న దాఖలాలు గానీ కనిపించడం లేదు. సీమాంధ్రలో బీజేపీకి ...

Read More »