Home / తెలుగు (page 13)

తెలుగు

6000 కానిస్టేబుళ్లు, 500 ఎస్సైల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ!

త్వరలో పోలీస్‌శాఖలో కొలువుల మేళాకు తెరలేవనుంది. ప్రపంచస్థాయి పోలీసింగ్‌పై దష్టిపెట్టిన పోలీస్‌శాఖ సిబ్బంది లోటును భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరువేలమంది కానిస్టేబుళ్లు, 500 మంది ఎస్సైల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు డీజీపీ కార్యాలయం కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణలో పోలీసింగ్‌ను పటిష్టపరచడానికి తగినంతగా సిబ్బంది నియామకం అత్యవసరం. పైగా రాష్ట్ర రాజధానిలో ప్రపంచస్థాయి పోలీస్ వ్యవస్థ నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో సిబ్బంది కొరతను అధిగమించడానికి హోంగార్డు స్థాయి నుంచి ఎస్‌ఐ వరకు నియామకాలు జరుపాలని ప్రభుత్వం దఢనిశ్చయంతో ఉందని పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.  మొదటి దశలో భారీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నియామక ప్రక్రియ కావడంతో భారీస్థాయిలో ఖాళీలను భర్తీ చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. డీజీపీ ఈ మేరకు వివిధ విభాగాలు, జిల్లాల ఎస్పీల నుంచి ఖాళీలకు సంబంధించిన నివేదికలను తెప్పించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 6వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది ఎస్సైల నియామకం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రిక్రూట్‌మెంట్ బోర్డు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. అలాగే హోంగార్డుల నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే ఓ ...

Read More »

మూడేళ్లలో 30 ప్రాజెక్టులు; 40 లక్షల ఎకరాలను సాగు

Srisailam Left Bank Canal SLBC project

-40 లక్షల ఎకరాలకు నీరు-పూర్తయ్యే వాటికి తొలి ప్రాధాన్యత-రైతుకు త్వరితంగా నీరందించడమే లక్ష్యం-ఏటా రూ.5,500 కోట్ల వ్యయం-కృష్ణలో 132 టీఎంసీల సద్వినియోగం-ఇంత వరకూ 50 టీఎంసీలకే పరిమితం పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యత నివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో దాదాపు 30 ప్రాజెక్టులు కొద్దిపాటి నిధులతో పూర్తయ్యే అవకాశమంది. వీటిని పూర్తిచేస్తే సుమారు 40 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావొచ్చు. నిపుణుల సలహా మేరకు వీటిని ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు జరపాలని నిర్ణయించింది. ప్రాధాన్యతా రంగాలకు పెద్ద పీట వేసే క్రమంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూపొందిస్తున్న బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి దాదాపు 5,500 కోట్ల రూపాయలను కేటాయించనుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వం రూపొందిస్తోంది. మూడు ప్రాజెక్టులకే భారీ వ్యయం.. జలయజ్ఞం పథకం కింద రాష్ట్రంలో మొత్తం ముప్పయి మూడు ప్రాజెక్టులను చేపట్టగా వాటి కోసం మొత్తం రూ. 76,643 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. ఇందులో ప్రాణహిత-చేవెళ్ల, కాంతనపల్లి, ...

Read More »

మన పీవీ మన అస్తిత్వం

పీవీ నరసింహారావు తెలంగాణ నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు. దేశ రాజధానిలో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన రాజకీయ దురంధరుడు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. ఆర్థిక సంస్కరణల కోసం మొట్టమొదటిసారి రాజకీయేతర ఆర్థికవేత్తను ఆర్థికమంత్రిగా తెచ్చుకున్న దార్శనికుడు. ఆ తర్వాత ఆ ఆర్థికవేత్త మన్‌మోహన్‌సింగ్ దేశానికి ప్రధానిగా పదేళ్లు పనిచేశారు. విదేశాంగమంత్రిగా, దేశ జ్ఞాన, నిపుణతల స్థాయి పెంచే మానవవనరుల అభివద్ధి శాఖ రూపకర్తగా, ఆ పదవికే వన్నె తెచ్చిన వాడిగా వీపీ నరసింహారావు ప్రపంచ ఖ్యాతి పొందినవాడు. కానీ పీవీ నరసింహారావు సమాధి నెక్లెస్‌రోడ్డు చివరన విసిరేసినట్టున్న ప్రాంతంలో ఉంటుంది. అదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే పనిచేసిన ఎన్.టి.రామారావు సమాధులు, స్మారకాలు, గార్డెన్‌లు నెక్లెస్‌రోడ్డు నడి మధ్య లో ఒక తోటలాగా సందర్శన ప్రాంతంగా ఎందుకు ఉంటుంది.చెన్నారెడ్డికైతే ఈ ప్రాంతమేది దొరకక ఏదో మూలన సమాధి ఎందుకు ఉన్నది. దేశ ప్రధాని అయినప్పటికీ పీవీ విగ్రహాలు ఎక్కడా కనబడవేమి? చెన్నారెడ్డి ప్రజారంజక పాలకుడిగా కీర్తి గడించినప్పటికీ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆయనకు ప్రధాన ప్రాంతంలో ఆరడుగుల నేల దొరకలేదు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు హైదరాబాద్ నిండా ...

Read More »

మహబూబ్‌నగర్‌లో 1000 MW సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు!

100omw

తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెండు మూడేళ్లల్లో మిగులు విద్యుత్ సాధించాలనే భారీ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే మహబూబ్‌నగర్ జిల్లాలో మెగా సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. వెయ్యి మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేయనుంది. ఇదిపూర్తిగా తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీఐఐసీ) పర్యవేక్షణలో కొనసాగుతుంది. ప్లాంట్ ఏర్పాటు కోసం మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో 5వేల ఎకరాల స్థలాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఒక్క మెగావాట్ విద్యుదుత్పత్తికి రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రాజెక్టు వ్యయం రూ.6 వేలకోట్ల పైమాటే. ఐతే ఈ ప్రాజెక్టు ప్రణాళిక దశలో ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర టీ మీడియాకు తెలిపారు. సోలార్ విద్యుదుత్పత్తికి తెలంగాణలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

Read More »

బయ్యారంపై చిగురిస్తున్న ఆశలు

-ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సిద్ధమని సెయిల్ ప్రకటన.. -సరిపడా విద్యుత్, నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ-శరవేగంగా నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు.. -మరో పదిరోజుల్లో స్టీల్ ప్లాంట్‌పై స్పష్టత తెలంగాణ సిరుల గడ్డపై మరో మణిమాణిక్యం మొగ్గ తొడగనుంది. పరాయి పీడనలో అక్రమార్కుల చేతుల్లో లూటీకి గురైన బయ్యారం గనులపై.. ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. స్వీయ పాలనలో ఉక్కు కర్మాగారానికి చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్లాంట్ ఏర్పాటుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆమోదం తెలిపింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గత నెల 21, 22 తేదీల్లో ఖమ్మం జిల్లా పాల్వంచ, బయ్యారం, కొత్తగూడెం ప్రాంతాల్లో సెయిల్ బందం పర్యటించి అధ్యయనం చేసింది. కర్మాగార ఏర్పాటుకు వాతావరణ పరిస్థితులను అంచనా వేసింది.బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటిస్తూ సెయిల్ సంస్థ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖకు లేఖ పంపింది. కాగా, ప్లాంట్ ఏర్పాటుకు సెయిల్ బందం మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది. అందులో పాల్వంచ మండలం వెలమనూరు, కొత్తగూడెం మండలం కూనారం, బయ్యారం మండల కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటును ...

Read More »