Home / తెలుగు / మేధావుల అంచనాలు నిజమవుతాయా లేక సామాన్య జనం కలలు ఫలిస్తాయా?

మేధావుల అంచనాలు నిజమవుతాయా లేక సామాన్య జనం కలలు ఫలిస్తాయా?

HydMillionMarchతెలంగాణ వస్తే ఏం ఒరుగుతుం ది. ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పులేమీరావు. కాకపోతే సీమాంధ్ర పాలకుల బదులు తెలంగాణ పాలకులు వస్తారని కొంత మండి చెబుతున్నా రు.అలాగే..పథకాల పేర్లు మారతా యి. కానీ ప్రజల జీవితాలు మారవు. ఒకసారి తెలంగాణ కావాలనే డిమాం డ్ వచ్చింది కాబట్టి, రాష్ట్రం సాధించుకోవాలనే పట్టుదల అందరిలో కనిపి స్తుంది. ఆకల రేపోమాపో నిజం అవుతుంది. 

కానీ రాష్ట్ర సాధన అనేది తెలంగాణ ప్రజల కష్టాలను తొలగించే, సమస్యలు పరిష్కరించే సర్వరోగనివారిణి మాత్రం కాదని తెలంగాణ ఉద్యమం ఉధతంగా నడుస్తున్న సమయంలో చాలామంది మేధావులు చేసిన విశ్లేష ణ ఇది. ఈమాటలన్నది ఏసీమాంధ్ర వ్యక్తులో కాదు. తెలంగాణ మేధావులే సూత్రీకరించిన విషయం. కానీ, సామాన్యజనం మాత్రం అలా అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా తమ బతుకులు మారతాయని భావించారు. అందుకే ఉద్యమంలో మమేకం అయ్యారు. ఉద్యమం సందర్భంలోనే కాదు, ఎన్నికల సమయంలో కూడా ప్రజలు తెలం గాణ రాష్ట్రంలో తమకేదో మేలు జరగాలని కోరుకున్నారు. పాత కాంగ్రెస్ పాలనే వస్తే మార్పు జరగదని, ఉద్యమానికి నేతత్వం వహించిన వారే, రేపు రాష్ర్టాన్ని పునర్నిర్మించాలని కోరుకున్నారు. అందుకే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. 

మేధావులని చెప్పుకునే వారి అంచనాలు నిజమవుతాయా? సామాన్య జనం కలలు ఫలిస్తాయా? అనేదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తు న్న విషయం. ఇది కేసీఆర్ పాలనాదక్షతకు కూడా సవాలే. కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే.. ఎన్నికల్లో గెలిచినవారు సంబురాలు చేసుకోవడం కాదు, ఓటేసిన వారు సంతోషపడాల్సిన రోజులు రావాలి. నిజానికి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కేసీఆర్ సర్కార్ కు అనేక సవాళ్లు స్వాగతం పలికాయి. ఆర్థికలోటు, విద్యుత్ కొరత, రైతుల పంట రుణమాఫీ లాంటి క్లిష్టమైన హామీల అమలు, కేంద్రంలో మోడీ సర్కార్, పక్కలో బల్లెంలా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభు త్వం, తెలంగాణ ప్రభుత్వంలో చాలినంత యం త్రాంగం లేకపోవడం.. ఇలా ఊపిరి సలపనివ్వని చాలా సమస్యలే ఎదురవుతున్నాయి. అయినా సరే, వీటిని పంటి బిగువున అదిమి పట్టుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరి రేపటికి నెలరోజులు. ఈ నెలరోజుల కాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన పను ల మంచిచెడులపై చర్చ జరుగుతున్నది. హైదరాబా ద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడే అంశంపై కేసీఆర్ ఎక్కువ దష్టి పెట్టినట్టు ఆయన చేతలను బట్టి అర్థమవుతున్నది. కేవలం పరిశ్రమలు పెంచడం, ఉద్యోగావకాశాలను సష్టించడమే కాకుండా, లండన్, న్యూయా ర్క్ నగరాల సరసన సగర్వంగా నిలబడే నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనే తపన ప్రభుత్వంలో కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అవరోధంగా మారిన అంశాల్లో కూడా అప్పట్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ తమతో ఉంటే చాలు అనే భావన అటు సీమాంధ్రుల్లో, ఇటు తెలంగాణలో వ్యక్తమయింది. నిజంగా కూడా హైదరాబాద్ తెలంగాణకు ఓ వరం. ఇటీవల బ్రిటిష్ హై కమిషనర్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. అప్పుడాయన హైదరాబాద్ ఈజ్ ఏ గ్రేట్ ఎసెట్ టు తెలంగాణ అన్నారు. అంటే హైదరాబాద్ ఉనికిని, గమనాన్ని ప్రపంచం గమనిస్తున్నది. 

నగర పోలీస్ వ్యవస్థకు కొత్త రూపు ఇవ్వడం, దాన్ని బలోపేతం చేయడం, పౌరులకు ప్రధానంగా మహిళలకు పూర్తి భరోసా, భద్రత ఇవ్వ డం ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా పెట్టుకోవడం మంచి ఆలోచన. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, కాలుష్యాన్ని కనిష్ఠస్థాయికి తీసుకురావడానికి, గండిపేట, హుస్సేన్‌సాగర్ లాంటి చెరువులను కాపాడడానికి కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. ముంబై నగరంలో అమలయ్యే ప్రభుత్వరవాణా విధానాన్ని అనుసరించే విషయంలో, సాంకేతికంగా కూడా నగరాన్ని ఓ వైఫై నగరంగా మార్చే అంశంలో ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తున్నది. చారిత్రక వారసత్వ సంపదయిన హైదరాబాద్‌ను సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా అభివద్ధి చేయడం, క్లీన్ అండ్‌గ్రీన్ సిటీగా మార్చడం.. ద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షించడంతోపాటు, తెలంగాణలోని ఇతర నగరాలు కూడా స్ఫూర్తిపొందే ఓ ద్విముఖ వ్యూహం ప్రభుత్వ చర్యల్లో కనిపిస్తున్నది. 

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని బాగా దెబ్బతీసిన అంశాల్లో రియల్ ఎస్టేట్ దందాలు, బడా బాబుల భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు ప్రధానమైనవి. హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని కొద్దిమంది పారిశ్రామిక వేత్తలు, సినిమా ప్రముఖులు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. దీనికి పరాకాష్ట గురుకుల్ ట్రస్టు భూముల దురాక్రమణ. టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా గత ప్రభుత్వాలు ఈ విషయంలో ఆక్రమణదారులకు కొమ్ముకాసే విధంగానే వ్యవహరించా యి.

కేసీఆర్ మాత్రం హైదరాబాద్‌లో దురాక్రమణదారుల పట్ల కఠినంగానే వ్యవహరించాలనే నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అక్రమ కట్టడాల తొలగింపు దశ్యాలు, వలసవాదుల సామ్రాజ్యాలు కూలుతున్న భావనను తెలంగాణ ప్రజల్లో కలిగిస్తున్నాయి. ఇదే పట్టుదలను, చిత్తశుద్ధిని కొనసాగించాలని కూడా తెలంగాణ జనం కోరుకుంటున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమొక్కటే రాజకీయాల అంతిమలక్ష్యంగా మారడంతో ప్రభుత్వాలు కొన్ని విషయాల్లో అవినీతి,అక్రమాలను చూసి చూడనట్లు వ్యవహరించాయి. పేదల కోసం తెచ్చిన ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టినా పట్టించుకోవడం మానేశాయి. లెక్కకు మించి జారీచేసిన తెల్లరేషన్ కార్డులు ఇందుకో ఉదాహరణ.

అనర్హులకు కూడా తెల్లరేషన్ కార్డులున్నయనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా అన్ని పార్టీలు తెల్లరేషన్ కార్డుల విషయంలో రీ సర్వే జరగాల్సిందే అనే విషయంలో ఏకాభిప్రా యం వ్యక్తం చేశాయి. అయితే పిల్లి మెడలో గంట కట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. రేష న్ కార్డులు కోల్పోయిన వారు తమ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచుకుంటారనే రాజకీయకోణం పార్టీలను వెంటాడింది. కానీ కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్ర మే కాదు, తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం కూడా. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే రేపు శాసనాలవుతాయి. భవిష్యత్ మార్గనిర్దేశకాలవుతాయి. అటు కేసీఆర్ కూడా.. ప్రతీదీ రాజకీయ లబ్ధి కోసం కాకుం డా, పాలన పారదర్శకంగా,అవినీతిరహితంగా, అర్థవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. రేషన్ కార్డుల విషయంలోనే కాదు,రేపు దళితుల భూపంపిణీ, పేదలకు గహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంటు తదితర పథకాల అమలులో కూడా కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే దిశలోనే ప్రభు త్వం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వ ఉద్దేశంలోని చిత్తశుద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడమొక్కటే ఇప్పుడు చేయాల్సిన పని.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కూడా ఇప్ప టి వరకు ప్రభుత్వ విధానం అధికారికంగా వెల్లడికాలేదు. కానీ, తెలంగాణ పిల్లలకు నష్టం జరగని, మన సొమ్ము వేరే ప్రాంతం వారికి అప్పనంగా అప్పజెప్పకుండా ఉండని విధానమొకటి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో భారతదేశంలో చాలా రాష్ర్టాలు స్థానికతను నిర్ధారించే విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుని అమలుచేశాయి. ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ కూడా ఐటీడీఏ ఉద్యోగాలు ఇవ్వడానికి స్థానిక గిరిజనులు మాత్రమే అర్హులని తేల్చిచెప్పింది. 1950కి ముందు స్థానికంగా స్థిరపడిన వారి నే స్థానికులుగా పరిగణిస్తూ 2000 సంవత్సరంలో జారీచేసిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలులో ఉన్నా యి. స్థానికతను ధవీకరించుకోవాల్సిన బాధ్యత కూడా లబ్ధిదారులపైనే ఉంటుంది. ఈ విధానం ఫీజు రీయింబర్స్‌మెంటుకు ప్రవేశపెట్టడం వల్ల తెలంగాణ విద్యార్థులకు వచ్చిన నష్టమేమీ లేదు. తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్న వారు స్థానికతను నిరూపించుకోవడం పెద్ద కష్టం కాదు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సాఫల్యాల మీద కన్నా, ఎదుటివారిని ఇబ్బంది పెట్ట డం వల్ల వచ్చే ప్రయోజనం మీద ఆధారపడి రాజకీయాలు నడుపుతున్న నాయకుడాయన. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని వీలైనంత ఎక్కువ ఇబ్బందిపెట్టడం ఆయన లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే పీపీఏల రద్దు లాంటి నిర్హయాలు తీసుకున్నారు. తెలంగాణ లో కరెంటు లేదనే ప్రచారం కూడా చేస్తున్నారు. దీని ఉద్దేశం తెలంగాణకు పరిశ్రమలు రావద్దనేదే. ఇలాం టి కుట్రలు, కుతంత్రాలు భవిష్యత్తులోనూ మనం చంద్రబాబు నుంచి ఊహించవచ్చు. విద్యుత్ విషయంలో స్వయం సమద్ధి సాధించేదాకా, ఆంధ్రప్రదేశ్‌ను నమ్ముకోవడం కన్నా, మిగతా పొరుగు రాష్ర్టాలను నమ్ముకోవడం మంచిదనే నిర్ణయానికి ప్రభు త్వం రావడం సముచితం. 

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలేకాదు, కేంద్ర పరిధిలోని అంశాల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కేసీఆర్ గుర్తించారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ పరిశ్రమకు, కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటుకు, నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటుకు, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు, ప్రాణహితకు జాతీయ హోదా పొందేందుకు, పోలవరం ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్ రద్దుకు గట్టి ప్రయత్నాలే ప్రారంభమయ్యాయి. 

ఆత్మగౌరవంతో కూడిన అభివద్ధి లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. తెలంగాణ పండుగలను రాష్ట్ర పండుగలుగా జరుపుకోవడం మన సంస్కతికి దక్కిన గొప్ప గౌరవం. పీవీ నర్సింహారావు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం తెలంగాణ జాతి గర్వపడే సందర్భం. మన రాష్ట్రంలో మన పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి పీవీ జయంతి ఓ సూచిక. ఇలాంటి పాలనను, ఇలాంటి నిర్ణయాలనే ప్రజలు కోరుకుంటున్నారు. ఈ దిశగానే ప్రభు త్వం నడవాలని ఆశిస్తున్నారు. 

-శ్రీగుణ గటిక

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,285 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>