Home / తెలుగు (page 11)

తెలుగు

స్వదేశీ జపం..విదేశీ పెట్టుబడులు 

చెప్పేవి శ్రీరంగ నీతులు ..దూరేవి సాని కొంపలు అని పెద్దలు ఊరికే అనలేదు. ఎన్నో ఏళ్ల నుండి ..ఎందరో అనుభవాల నుండి సామెతలు పుడతాయి. భారతీయ జనతా పార్టీ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడుల(ఎఫ్.డి.ఐ)ను ఆహ్వానిస్తే పార్లమెంటు వేదికగా నానారభస చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థను విదేశాల చేతుల్లో పెట్టడమే అని నానా గగ్గోలు పెట్టారు. అంత పెద్ద ఎత్తున హంగామా చేసిన బీజేపీ ఇప్పుడు అధికారం చేతికి దక్కినవెంటనే మొదటి బడ్జెట్ లోనే ఎఫ్.డి.ఐలను ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కీలకమయిన రక్షణ, భీమా రంగాలలో ఎఫ్.డి.ఐలను 26 శాతం నుండి 49 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక్కడితో ఆగిపోకుండా తయారీ రంగంలో కూడా ఎఫ్.డీ.ఐలను ఆహ్వానిస్తూ సంకేతాలు పంపింది. స్వదేశీ జపం చేసే భారతీయ జనతా పార్టీ నేతలు పూర్తి మెజార్టీ ఇస్తే ఏదో ఒరగబెడతాం ..సంకీర్ణ ప్రభుత్వాల మూలంగా తాము ఏమీ చేయలేకపోతున్నాం అని గతంలో వాపోయేవారు. ఇక ఎన్నికలకు ముందే ఏదో చేస్తానని ప్రజలకు అరచేతిలో స్వర్గం చూయించిన ...

Read More »

భూకబ్జాదారుల వెన్నులో వణుకుపుడుతోంది!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ..తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ ఏర్పాటు..కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సీమాంధ్ర భూకబ్జాదారుల వెన్నులో వణుకుపుడుతోంది. కేసీఆర్ తొలి అడుగు గురుకుల్ ట్రస్టు భూములపై పడడం, అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చేయడం, వక్ఫ్ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పడం, భూదాన్ భూములను ప్రభుత్వం కిందకు తీసుకురావడంతో ఏళ్ల తరబడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వాలిన రాబందులకు దడ పుట్టింది. గురుకుల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు నోటీసులు ఇవ్వడం, సర్వే చేసి అక్రమంగా నిర్మించిన విషయం తేల్చడంతో సీమాంధ్ర పెట్టుబడిదారులకు మింగుడుపడలేదు. హైదరాబాద్ లో అక్రమాలకు పాల్పడ్డ 70 మంది సీమాంధ్ర ప్రముఖులు అయ్యప్ప సొసైటీలో అక్రమనిర్మాణాలు కూల్చిన రోజే చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి హైదరాబాద్ మీద తెలంగాణ ప్రభుత్వానికి హక్కులు లేకుండా గవర్నర్ చేతికిందకు తీసుకువచ్చేలా చూడాలని కోరారని తెలుస్తోంది. ఇక అప్పటి నుండి సీమాంధ్రలో పాలన గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు ...

Read More »

భూమిని ముట్టుకో, ప్రళయమే! – ఎన్ వేణుగోపాల్

ayyappa society

‘భూమితో మాట్లాడు, జ్ఞానమిస్తుంది’ అని బైబిల్‌లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆధ్యాత్మిక అర్థం మాట ఎలా ఉన్నా అది గొప్ప మాట. అది ‘భూమి నాదియనిన భూమి పక్కున నవ్వు’ అని మన వేమన అన్న కాలానికి చాల ముందరి మాట. ఆ రెండు మాటలూ గడిచి ఇవాళ ‘భూమిని ముట్టుకో, ప్రళయమే’ అనే దగ్గరికి చేరినట్టున్నాం. భూమి నాది అనుకోగూడదన్న వేమనను దాటి సమాజం చాల “పురోగమించింది” గదా. భూమి నాదీ అనుకోవచ్చు, ఇతరులదని అనుకున్నా దాన్ని దురాక్రమించుకోవచ్చు. దురాక్రమణను అడ్డుకుంటామని ఎవరన్నా అంటే వారిని భూమిమీద లేకుండానూ చేయవచ్చు. భూసంస్కరణలు అమలు జరుపుతానన్న నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని పడగొట్టడం దాకా, దున్నేవారికే భూమిని పంచాలన్న విప్లవకారులను కాల్చిచంపడం దాకా పోనక్కరలేదు. ప్రభుత్వానికీ విప్లవకారులకూ మొదలైన చరిత్రాత్మక చర్చలలో అక్రమంగా అన్యాక్రాంతమైన భూమి ప్రస్తావన రాగానే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి ఆ ప్రస్తావనను “అడ్డగోలు మాటలు”గా అభివర్ణించి, చర్చలకు ముగింపు పలికి నెత్తురుటేర్లు పారించిన చరిత్ర దగ్గరికీ పోనక్కరలేదు. ఇవాళ్టికివాళ జరిగిన, జరుగుతున్న సంగతే చూద్దాం. అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూమిలో కొన్ని ఎకరాల భూమిని, వందలాది ఉదంతాలలో రెండు ...

Read More »

హైదరాబాద్‌పై సీమాంధ్ర పరోక్ష పాలనకు రంగం సిద్ధం?

Hyderabad UT Naidu

-బాబు లాబీయింగ్‌కు తలొగ్గుతున్న కేంద్రం..  -గవర్నర్ అధికారాల పేర రాష్ర్టానికి సర్క్యులర్ -సీమాంధ్రుల పరోక్ష పాలనకు రంగం సిద్ధం? -సినీ, రాజకీయ పెద్దల చీకటి సమావేశం.. హైదరాబాద్‌ను యూటీ చేయాలని పట్టు  -కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు.. భూ పరిపాలన గవర్నర్‌కు ఇవ్వాలని డిమాండ్ -రాష్ర్టానికి అందిన కేంద్రం సర్క్యులర్ -రెండు కమిషనరేట్లు, రంగారెడ్డి పోలీసింగ్ గవర్నర్‌కు -హైదరాబాద్‌కు జనాభా దామాషాలో సీమాంధ్ర పోలీసులు -ఉమ్మడి పోలీస్ సర్వీస్ బోర్డు ప్రతిపాదన -తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం కేసీఆర్  -ప్రతిపాదనలకు దీటైన జవాబు పంపడానికి సిద్ధం తెలంగాణవాసుల నెత్తురు మరిగే అంశం.. హైదరాబాద్‌ను యూటీచేసే పథకం.. అవును.. సరిగ్గా అదేకుట్ర మళ్లీ ముందుకు వస్తున్నది. కాకపోతే గవర్నర్ పాలన ముసుగులో.. మరో రూపంలో. ఆరు దశాబ్దాలుగా తాము కట్టుకున్న అక్రమ సామ్రాజ్యాలను తెలంగాణవాడు బద్దలుకొడుతుంటే.. గురుకుల్, గోకుల్, ఎన్‌కన్వెన్షన్, ఎఫ్‌డీసీ.. ఇలా ఒక్కటొక్కటిగా చేజారిపోతుంటే గుండెజారిన సీమాంధ్రబాబులు, అక్రమ రియల్టర్లు, సినీ, మీడియా, పెట్టుబడిదారులు రహస్య సమావేశాలుపెట్టి పథకాలు పన్నుతున్నారు. అలుపెరుగని ఉద్యమం, పన్నెండు వందల మంది బలిదానాలతో సాధించిన స్వరాష్ట్రం గుండెలమీద సీమాంధ్రులు రాజ్యం సాగించే కుట్రచేస్తున్నారు. సందేహం లేదు.. ...

Read More »

రోజూ తెలంగాణ కోల్పోతున్న విద్యుత్తు – 17.1 మిలియన్ యూనిట్లు!

-అప్పనంగా వాడుకుంటున్న ఏపీ సర్కార్-మన వాటా మనకు దక్కితే కరెంటు కోతలే ఉండవ్!-ప్రభుత్వ దృష్టి కి తీసుకెళ్లనున్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ ఉమ్మడిగా ఉన్నన్నాళ్లు అధికారాన్ని చేతుల్లో పెట్టుకుని తెలంగాణ వనరులను దోచుకున్న సీమాంధ్ర పాలకులు రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా అదే పని చేస్తున్నారు. స్పష్టంగా ఒప్పందాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ తెలంగాణకు ప్రతీ రోజు దక్కాల్సిన 17.1 మిలియన్ యూనిట్ల విద్యుత్తును దక్కకుండా చేసి, దానిని సీమాంధ్రకు మళ్లించుకుంటున్నారు. విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొరత ఉంది. ఫలితంగా విద్యుత్తు కోతలు పెరిగిపోయి ఇటు రైతాంగం, అటు సాధారణ జనం విలవిల్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయంగా రావాల్సిన విద్యుత్తు వస్తే తెలంగాణలో విద్యుత్తు కోతలే ఉండవని నిపుణులు చెబుతున్నారు.  అంచనాల్లో తప్పులు ఉమ్మడి రాష్ట్రం ఉన్నపుడు అనంతపురం, కర్నూలు జిల్లాలు తెలంగాణలోని ఏపీసీపీడీసీఎల్ పస్తుతం టీజీఎస్‌పీడీసీఎల్)లో భాగంగా ఉండేవి. రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ రెండు జిల్లాలను సీమాంధ్రలో కలిపారు. దాంతోపాటు టీజీఎస్‌పీడీసీఎల్ నుంచి రెండు జిల్లాలను ఏపీఎస్‌పీడీసీఎల్‌లో భాగంగా చేశారు. ఆ సమయంలో 2009-13 ...

Read More »