Home / తెలుగు (page 16)

తెలుగు

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల్నీ విసిరేస్తుంది తెలంగాణ. జాగ్రత్త. జాగ్రత్త. తెలంగాణ అనే నిప్పుతో చెలగాటం మంచిది కాదు. భవిష్యత్ మాదే. మీరు కొంచెం మర్యాదగా ఉంటే మంచిది. బొడిగె శోభ ఒక దళిత స్త్రీ. ఒక ఎమ్మె ల్యే. దళాల్లో తిరిగిన మాజీ. సామాన్యురాలయిన శోభ కొంత చైతన్యం పొందింది. చొప్పదండి నియోజకవర్గంలో ప్రజల సమస్యల వెంట తిరిగింది. బొడిగె శోభ తెలంగాణ స్త్రీ. ఉద్యమంలో ముందు నిలిచింది. కేసీఆర్ అరెస్టయినప్పుడు ఆ తర్వాత తీవ్రంగా స్పందించింది. కేసీఆర్‌కు గుర్తుండిపోయింది. ఉద్యమానంతరం ఆరు దశాబ్దాల కల సాకారమయింది. కేసీఆర్ శోభకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. బాల్క సుమన్‌కు అనుకున్న టికెట్ పోరాడి శోభ సాధించుకున్నది. గెలిచింది. ప్రజాస్వామ్యం, ఓట్ల పతనపు విలువలు, ఎన్నికల కంపు, పలుకుబడి, ప్రతిష్టలనన్నింటినీ ఎడమ చేతి చిటికెన వేలుతో పక్కకు తోసి, గత కాలపు క్షీణ విలువలను తొక్కి బొడిగె శోభ అసెంబ్లీకి చేరింది. ప్రమాణ పత్రం ...

Read More »

కళ్ళ ముందే ఇంత దుర్మార్గమా? – ఎన్ వేణుగోపాల్

Polavaram

‘విరబూసే యాపిల్ చెట్ల సౌందర్యం కాదు, సత్యానికి తారుపూసే హిట్లర్ ఉపన్యాసాల బీభత్సం నా చేత కవిత్వం రాయిస్తోంది’ అని బెర్టోల్ట్ బ్రెహ్ట్ రాసినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆనందం కన్నా కేంద్ర ప్రభుత్వం, కోస్తా, రాయలసీమ కాంట్రాక్టర్-రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రత్యక్షంగా సాగించిన దుర్మార్గం, తెలంగాణ నాయకుల కుటిల మౌనం కలగలిసి ఖమ్మం జిల్లా ఆదివాసుల జీవితాల మీద జరగనున్న బీభత్సమే ఇవాళ రాయడానికి పురికొల్పుతున్నది. నిజానికి పోలవరం ప్రాజెక్టు కేవలం మూడు లక్షల మంది ఆదివాసులను నిర్వాసితులను చేసే, వారి జీవితాలను ధ్వంసం చేసే పథకం మాత్రమే కాదు, దాన్ని వ్యతిరేకించడానికి మరెన్నో కారణాలున్నాయి. పోలవరం ఆనకట్ట ఏదో బహుళార్థ సాధక అభివృద్ధి పథకమనీ, అది కోస్తా, రాయలసీమలకు ఏదో మంచి చేస్తుందనీ, అన్ని “మంచి” పనులకూ ఏదో ఒక బలి ఇవ్వక తప్పదనే హిందూ బ్రాహ్మణ ఆచారం ప్రకారం ఆదివాసుల బలి తప్పదనీ చాల మంది అమాయకులు భావిస్తున్నారు. ఈ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అనే న్యాయమైన ఆకాంక్షను నెరవేర్చామనే ముసుగు వేసుకుని పాలకవర్గాలు పోలవరం ...

Read More »

Interview with ‘యాది’ Director Yennengee – “learnt a lot of filmmaking on Internet!”

Yennengee PHOTO

Yennengee is one of the many aspirants who want to make movies. This youngster who could only study till Intermediate before plunging into movies talks about his struggle to make his dream into reality. He studied moviemaking books on Internet and dived headlong into movies assisting director Ramesh Reddy Thummala before making the shortfilm ‘Yaadi’ centered around suicides of Telangana youth for Statehood. తెలంగాణా సినీ కళాకారులను, తెలంగాణా కధలకు ఒక వేదికను ఏర్పాటు చేసుకోడానికి ఉద్యమములో మమేకమైన వ్యక్తులు, సంస్థలు కలిసి ఈ మధ్య Film Telangana Festival పేరిట షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించారు. అనేకమంది కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ ఫెస్టివల్ లో ‘యాది’ అనే షార్ట్ ఫిలిం ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీతం, ఉత్తమ చాయాగ్రహణం కు గాను అవార్డులు గెలుచుకున్ధి. ఫెస్టివల్ కు ఎంపికై నాలుగు అవార్డులకు గాను మూడు అవార్డులు గెలుచుకుంది. అంతే కాకుండా, ప్రతిష్టాత్మక ...

Read More »