Home / తెలుగు / భూకబ్జాదారుల వెన్నులో వణుకుపుడుతోంది!

భూకబ్జాదారుల వెన్నులో వణుకుపుడుతోంది!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ..తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ ఏర్పాటు..కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సీమాంధ్ర భూకబ్జాదారుల వెన్నులో వణుకుపుడుతోంది. కేసీఆర్ తొలి అడుగు గురుకుల్ ట్రస్టు భూములపై పడడం, అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చేయడం, వక్ఫ్ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పడం, భూదాన్ భూములను ప్రభుత్వం కిందకు తీసుకురావడంతో ఏళ్ల తరబడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వాలిన రాబందులకు దడ పుట్టింది.

గురుకుల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు నోటీసులు ఇవ్వడం, సర్వే చేసి అక్రమంగా నిర్మించిన విషయం తేల్చడంతో సీమాంధ్ర పెట్టుబడిదారులకు మింగుడుపడలేదు. హైదరాబాద్ లో అక్రమాలకు పాల్పడ్డ 70 మంది సీమాంధ్ర ప్రముఖులు అయ్యప్ప సొసైటీలో అక్రమనిర్మాణాలు కూల్చిన రోజే చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ ఈ జాబితాలో ఉన్నారు.

వీరంతా కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి హైదరాబాద్ మీద తెలంగాణ ప్రభుత్వానికి హక్కులు లేకుండా గవర్నర్ చేతికిందకు తీసుకువచ్చేలా చూడాలని కోరారని తెలుస్తోంది. ఇక అప్పటి నుండి సీమాంధ్రలో పాలన గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మీద గవర్నర్ ఆజమాయిషీ ..భూములు, భవనాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదని, హైదరాబాద్ లో రెండు రాష్ట్రాల పోలీసులు ఉండాలని, వారి నియామకం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం ఉండాలని, శాంతిభద్రతలు గవర్నర్ చేతుల్లో ఉండాలని కేంద్రానికి లేఖ రాశారు.

దేశంలో ఎక్కడా ..ఏ రాష్ట్రంలో లేనివిధంగా హైదరాబాద్ లోని సీమాంధ్ర అక్రమార్కులకు కొమ్ముకాసేందుకు చంద్రబాబు నాయుడు సిద్దమయ్యారు. హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల ఉన్న లక్షల ఎకరాలను అక్రమంగా ఆక్రమించుకున్న భూ బకాసురులకు చంద్రబాబు ఇప్పుడు అప్తుడయ్యాడు. అయితే  చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దంగానే ఉన్నారు. చంద్రబాబు చుట్టు తిరుగుతున్న అక్రమార్కుల గుట్టంతా కేసీఆర్ చేతుల్లో ఉందని సమాచారం. హైదరాబాద్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకుని తెలంగాణకు న్యాయం జరిగేలా చూసే విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేసేది లేదని కేసీఆర్ ఖరాఖండి ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

-సందీప్ రెడ్డి కొత్తపల్లి 

One comment

  1. Perugu Balasubramanyam

    సమైక్య ఆంధ్ర అని ఒక ఉద్యమం చేసారు ఎందుకనుకున్నారు వీరి వెనుక ఈ భూ కబ్జాదారుల డబ్బు తో వారి వారి స్వార్ధం ఉంది రాష్ట్రము విడి పోతే ఇలాంటివి తప్పవు వారి బాగోతం బయటికి వచ్చి వారి ఆస్తులు అవినీతి లాంటివి బయటికి వస్తాయీ అని తెలుసు ఇప్పుడెం చేస్తారు ఈ లాంటివి వారి సొంత ఊర్లో చెయ్యండి తోలు తీస్తారు వారిని శ్రీ చంద్ర బాబు గారు ఎలా సమర్ధిస్తారు హైదరాబాద్ కదా అడిగేవారు ఎవరున్నారు చేసేయ్ కబ్జా అన్న ధైర్యం జై హింద్

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,283 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>