Home / తెలుగు (page 9)

తెలుగు

తెలంగాణ రాష్ట్ర చిహ్నలు: మోదుగపూవు, ఇప్ప చెట్టు, అడవిదున్న, పాలపిట్ట

moduga

ఎర్రగా విరగబూసి అడవికికే వన్నె తెచ్చే మోదుగపూవు, పరిమళాలు వెదజల్లే ఇప్ప చెట్టు, భారీ ఆకారంలో ఠీవిగా కనిపించే అడవిదున్న, అందమైన పాలపిట్ట.. ఇవీ తెలంగాణ రాష్ట్ర చిహ్నలుగా తెరముందుకు రాబోతున్నాయి. రాష్ట్ర జంతువు, పక్షి, చెట్టు, పూవుల చిహ్నాలను ఎంపికచేయడంపై అధికారులు, నిపుణులు కసరత్తు పూర్తిచేశారు.ప్రభుత్వ ఆమోదానికి నివేదిక సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, ఒడిశాలకు రాష్ట్రపక్షిగా ఉన్న పాలపిట్ట (ఇండియన్ రోలర్)కు బదులు ఇండియన్ బర్డ్‌ను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ పాలపిట్టకు తెలంగాణలో ప్రత్యేకస్థానం ఉన్నందున దానినే రాష్ట్ర పక్షిగా ఎంపిక చేయాలని నిపుణులు, అటవీశాఖ అధికారులు అభిప్రాయపడ్డట్టు తెలుస్తున్నది. పాలపిట్ట విజయదశమి రోజు కనపడితే శుభమని తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఈ కారణంగానే పాలపిట్ట ఇప్పటికీ మూడు రాష్ర్టాల్లో ఉన్నా తెలంగాణకు కూడా దానినే ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. వరంగల్ నుంచి మొదలుకుని ఆదిలాబాద్, ఖమ్మం వరకు అడవులకు వన్నె తెస్తున్న అడవిదున్నను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేయడంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఇక తెలంగాణలో జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచే మోదుగపూవును రాష్ట్ర పూవుగా ఎంపిక చేయనున్నారు. మోదుగ పూవులను హోళీకి ...

Read More »

10 రోజుల్లో టీపీఎస్సీ ! 20,000 ఉద్యోగాలు భర్తీ!

tpsjobs

నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగుల స్వప్నాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. పదిరోజుల్లోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ఏర్పాటు కాబోతున్నది. ఇప్పటికే ఫైల్‌ను సిద్ధం చేసిన సాధారణ పరిపాలన శాఖ దాన్ని త్వరలోనే గవర్నర్‌కు పంపనుంది. టీపీఎస్సీ ఏర్పాటుపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసినదే. టీపీఎస్సీ ఏర్పాటుపై క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలతో కూడిన ఫైల్ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి చేరింది.దీన్ని ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ నరసింహన్ ఆమోదం కోసం పంపనున్నామని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి బీ వెంకటేశ్వరరావు తెలిపారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం పదిరోజుల్లోనే టీపీఎస్సీ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే టీపీఎస్సీ ఏర్పాటైనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో జారీ అవుతుంది. ఆ తర్వాత చైర్మన్‌తో పాటు కనీసం ఇద్దరు, గరిష్ఠంగా ఆరుగురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. టీపీఎస్సీ కార్యదర్శితో పాటు ఇతర ఆఫీసు సిబ్బంది నియామకం వంటిపనులు శరవేగంగా పూర్తిచేసి, వెనువెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.టీపీఎస్సీ ద్వారా దాదాపు ...

Read More »

రైల్వే క్రాసింగ్‌ల వద్ద చిన్న మార్పుతో పెద్ద రక్షణ!

design

ప్రభుత్వాల అలసత్వం.. వాహనదారుల నిర్లక్ష్యం, తొందరపాటు కారణంగా ప్రతిఏటా కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. 2001 నుంచి డిసెంబర్ 2013 వరకు మొత్తం కాపలాలేని రైల్వేక్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాల్లో 870 మంది మృతి చెందితే.. ఇందులో ఏప్రిల్ 2013 నుంచి డిసెంబర్ 2013 మధ్యకాలంలోనే 66 మంది దుర్మరణం పాలయ్యారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఏర్పాటు చేసే హెచ్చరిక బోర్డులు, సంకేతాలు ఇవేవీ ఎలాంటి ప్రయోజనాన్నివ్వ లేదు.కానీ రైల్వే క్రాసింగ్‌ల వద్ద స్పీడ్ బ్రేకర్ల నిర్మాణంలో కొద్దిపాటి మార్పులు చేస్తే ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని మానవప్రవర్తనను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రతి రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలకు ఇరువైపులా పది మీటర్ల దూరంలో అప్రోచ్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లను నిర్మిస్తున్నారు. కానీ వీటిని రోడ్డుకు కచ్చితంగా లంబకోణంలో నిర్మిస్తున్నారు.ఫలితంగా వీటి మీదుగా ప్రయాణించే వాహనాల ముందు, వెనుక టైర్లు ఒకే సారి స్పీడ్‌బ్రేకర్లపైకి ఎక్కి దిగుతాయి. అలాంటి పరిస్థితుల్లో వాహనవేగం తగ్గించకపోయినా వాహనంలో ప్రయాణిస్తున్నవారు పెద్దగా కుదుపులకు గురికారు. దీనివల్ల రెండు నష్టాలున్నాయి. ఆ సమయంలో ...

Read More »

T News లైవ్ షో లో ప్రశ్నలకు CM KCR సమాధానాలు

KCR TNews Live Show

ప్రభుత్వం వచ్చాక ఏమీ జరుగడం లేదు అని చాలామంది అనుకున్నరు. కానీ సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నా. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో సీఎం చాంబర్‌లో నా టేబుల్ డ్రాలో భద్రంగా పెట్టుకున్నాను . ఏ విషయం వచ్చినా చూసుకుంటున్న. అదే మా భగవద్గీత. - సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోనే తమ భగవద్గీత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండాఅమలు చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం అవినీతి, భూ కబ్జాలు, కుంభకోణాలు వారసత్వంగా ఒక గంజాయి వనాన్ని అందించిందని, ఆ గంజాయి వనాన్ని నరికి వేస్తామని అన్నారు.గురుకుల్ భూముల కబ్జాలే కాదు భూదాన్ భూములతో సహా దేనినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని, కబ్జాదారులు స్వయంగా భూములు సరెండర్ చేస్తే బతికి పోతారని అన్నారు. లేకుంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు ఉద్యమంలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవం పాలనలో పాఠాలు నేర్పిందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ముందు ముందు మరిన్ని పథకాలు ప్రవేశపెడతామని చెప్పారు.పోరాడి సాధించిన తెలంగాణను ఇతరుల పాలు కానివ్వరాదనే ఎన్నికల్లో పోటీ చేశామని చెప్పారు. గురువారం ...

Read More »

తెలంగాణ ఆత్మ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమవుతుందో ఇన్నాళ్లూ కలల్లో బతికిన తెలంగాణ ప్రజానీకం ఇప్పుడు వాస్తవాలను కళ్లారా చూస్తోంది. కళ్లముందే భూములను కాజేస్తుంటే.. కుంభకోణాలు చేసేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బతికిన సగటు తెలంగాణ జీవి ఆక్రోశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తనదిగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. రాజు సరిగ్గా ఉంటేనే ప్రజల నడవడిక సరిగ్గా ఉంటుందనే నానుడికి తగ్గట్లుగా కేసీఆర్ తన దారిని ఎంచుకుని చూపించారు. సమైక్యరాష్ట్ర పాలనలో ప్రతి పథకం కుంభకోణమేనని ధైర్యంగా ప్రకటించిన కేసీఆర్ రాబోయే రోజుల్లో తెలంగాణను బంగారంగా మార్చుతామని స్పష్టం చేశారు. భూదాన యజ్ఞబోర్డు భూములను, దేవాదాయ భూములను, ఇతర ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నవారినెవ్వరినీ వదిలిపెట్టేది లేదని చెప్పారు. అలాంటి అక్రమాలకు పాల్పడినవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్పగించాలని, లేకుంటే వారికి జైలు జీవితమే గతి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ల్యాంకో సంస్థ ఇతర సాఫ్ట్‌వేర్ సంస్థల పేరుతో రక్షణ పొందేందుకు ప్రయత్నిస్తే కుదరదని, దీనిపై తాము వెనుకకుపోయేదిలేదని తేల్చిచెప్పారు. ఇక గత పాలకులు చేపట్టిన ప్రతి పని కుంభకోణమే అంటూ ఉదాహరణలతో వెల్లడించారు. గృహనిర్మాణ పథకం, రేషన్‌కార్డులు, ...

Read More »