Home / తెలుగు (page 8)

తెలుగు

సౌర విద్యుత్‌ను ఉపయోగించుకోవడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలి

solar telangana

-సౌరశక్తికి రాష్ట్రంలో విస్తృత పరిధి..  -తక్షణ విద్యుత్ అవసరాలను తీర్చే వనరు -సోలార్‌పై ఔత్సాహికులు, సంస్థలు సిద్ధం -వేల కోట్ల పెట్టుబడులకు, ఉపాధికి అవకాశం -ఆసక్తి కనబరుస్తున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు -విధి విధానాల్లో స్వల్పమార్పులతో అన్నీ సాధ్యమంటున్న నిపుణులు -ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు, ప్రతి సబ్‌స్టేషన్‌కు ఒక సౌర విద్యుత్ ప్లాంట్..  - ఇదీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక సౌర విద్యుత్ నిపుణుడి సూచన. తెలంగాణకు విద్యుత్ కష్టాలు తొలిగించే ప్రత్యామ్నాయ వనరుల్లో సౌరశక్తి (సోలార్ పవర్) ప్రధానంగా కనిపిస్తున్నది. తక్షణ విద్యుత్ అవసరాలు తీర్చడం, వ్యవస్థాపనకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఔత్సాహికులు, సంస్థలు ఈ రంగానికి బంగా రు భవిష్యత్తును కల్పిస్తున్నాయి. మరోవైపు ఈ రంగం పై పలువురు ఎన్‌ఆర్‌ఐలు కూడా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో విధి విధానాల్లో స్పల్ప మార్పులుచేస్తే విస్తృతస్థాయిలో సౌర విద్యుచ్ఛక్తిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని, తద్వారా తెలంగాణ సౌర తెలంగాణ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల్లో తెలంగాణ జిల్లాలు సౌరశక్తికి అనువుగా ఉన్నాయి. దేశంలో సూర్య తాపం- గ్లోబల్ హారిజంటల్ ఇరాడియన్స్(జీహెచ్‌ఐ) ...

Read More »

1956 ప్రాతిపదిక ఎందుకు?

వందల ఏళ్లుగా ఇక్కడ విద్య విస్మరణకు గురైంది. సామాన్యుడికి అందని పండై ఉండిపోయింది. స్వాతంత్య్రానంతరం మన ప్రభుత్వా లు విద్యావ్యాప్తికి చర్యలు ప్రారంభించీ ప్రారంభించక ముందే ఉమ్మడి రాష్ట్రం పేరిట మరో దాస్యప్రపంచంలోకి తెలంగాణ నెట్టివేయబడింది. విద్యారంగం మీద మళ్లీ అమావాస్య కమ్మింది. ఆరు దశాబ్దాల కాలంలో ఈ రంగంలో జరిగిన అన్యాయం వల్లించడం చర్విత చరణమే అవుతుంది. ఇపుడు గ్రహణం విడిచింది కాబట్టి విద్యను సార్వజనీనం చేయడం ఆ రంగంలో దశాబ్దాల పాటు జరిగిన లోటు పాట్లను వేగంగా పూడ్చుకోవడం మన ముందున్న కర్తవ్యం. ఇన్నాళ్లూ నష్టపడ్డాం కనుక మనకే వందకు వంద శాతం ఫలాలు దక్కడం న్యాయం. అందుకు ఉమ్మడి రాష్ట్రం అంటించిన మరకలన్నీ తుడిచేయక తప్పదు. మా పిల్లలు ఇక్కడే పుట్టారు అంటూ లాజిక్కులు మాట్లాడే ప్రతివాడూ ఒకనాటి చొరబాటుదారుడే. అందుకే 1956 కటాఫ్ శాసనం! 1956 ప్రాతిపదికగా స్థానికతను నిర్ధారించడం మీద వివిధ వర్గాల్లో తీవ్ర స్థాయి చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మరీ కఠినంగా వ్యవహరిస్తున్నదని కొందరు అభిప్రాయపడుతుంటే కొంతమంది తెలంగాణవాదులు కూడా మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉద్యమంలో జీవన్మరణ సమస్యగా ...

Read More »

స్థానికతను నిర్ధారించడం తెలంగాణా ప్రభుత్వ హక్కు, అవసరం, ధర్మం

నాకు పీఎన్‌వీ నాయర్ అంటే అమిత గౌరవం. హాన్స్ ఇండియా పత్రిక ఎడిటర్‌గా ఆయన వృత్తి నిబద్ధత గల జర్నలిస్టుగా, సుదీర్ఘ జీవితానుభవం ఉన్న జ్ఞాని గా విశిష్ట గౌరవ మర్యాదలున్నవారు. అయితే.. నేను ఈ వ్యాసంతో ఆయనకున్న జ్ఞానాన్నీ, వృత్తి నిబద్ధతను సవాలు చేయడం లేదు. కానీ రెండు ఇరుగు పొరుగు రాష్ర్టాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు, వాటి సంబంధాల విషయంలో తలెత్తుతున్న సమస్యలు, కొన్ని విషయాలను ఆయన దృష్టికి తేదల్చుకున్నాను. అయితే ఇక్కడే మరో విషయం కూడా స్పష్టం చేయాలి. నేను కేసీఆర్‌నో, తెలంగాణనో వెనకేసుకొస్తున్నాననుకోవద్దు. సహజ న్యాయసూత్రాల ఆధారంగా తెలంగాణ ప్రజలు, వారి తరఫున కేసీఆర్ కోరుతున్న లేదా అంటున్న విషయాలను విపులీకరించదల్చుకున్నాను. ఇక్కడే మరో విషయం కూడా స్పష్టం చేయాలి. సహజంగానే తరతరాల చరిత్రను పరిశీలించినా.. తెలంగాణ ప్రజలు ప్రేమగల వారు. ద్వేషమన్నదే ఎరుగని వారు. అలాగే కేసీఆర్ కూడా ద్వేషంతో ఏనాడూ ఏమీ చేయలేదు. ఏ మాటా మాట్లాడలేదు. ఆయన అన్నదల్లా సహజ న్యాయసూత్రాల ఆధారంగా తెలగాణ ప్రజలకు న్యాయం దక్కాలె. వివక్ష, అణచివేతలు అంతంకావాలె. వలసపీడనల పీడ విరగడ కావాలె.తెలంగాణ ప్రజలే కాదు, ...

Read More »

మిని థియేటర్లతో చిన్న సినిమాకు, తెలంగాణ సినిమాకు ఊతం

స్వప్రయోజనాలు తప్ప చలనచిత్ర పరిశ్రమ మీద శ్రద్ధ లేని సీమాంధ్ర సినీ పెద్దల కబంద హస్తాలనుంచి తెలంగాణ సినిమా విముక్తికి మినీ థియేటర్ల నిర్మాణమే మార్గమని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సంగిశెట్టి దశరథ ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో సూచించారు. రాష్ట్రంలోని థియేటర్లనన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్న సినిమా పెద్దలు చిన్న సినిమాలు, తెలంగాణ సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేసి గొంతు నొక్కేశారని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు ఇచ్చిన భూముల వంటి తాయిలాలన్నీ గద్దల్లా ఎగరేసుకుపోయారని, వారు బలపడి తెలంగాణ సినిమా ప్రతినిధులను ఆమడ దూరం పెట్టారని వివరించారు. ప్రభుత్వ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకున్నారనే ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. వీరి పెత్తనం కారణంగా చిన్న సినిమాలు, తెలంగాణ ఇతివృత్తాలతో కూడిన సినిమాలు నడిపేందుకు థియేటర్లు దొరకక డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నరకయాతన అనుభవించారని చెప్పారు. థియేటర్లు కావాలంటే అధికమొత్తాల్లో రెంట్లు వసూలుచేసి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన చిన్న నిర్మాతలు, దర్శకులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ సినిమాను అభివృద్ధి పరచాలంటే తమిళనాడు కర్నాటక రాష్ర్టాల తరహాలో ప్రభుత్వమే మినీ థియేటర్లను నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ఫిలిం చాంబర్ సూచించింది. లేదా ప్రభుత్వ స్థలాలు ...

Read More »

పోటీ పడుతానన్న చంద్రబాబు తోక ముడిచారు!

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బలహీనవర్గాల ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించాడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బోగస్ రేషన్ కార్డుల విషయంలో సైతం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, త్వరలోనే బోగస్ రేషన్ కార్డులను పూర్తిగా ఏరివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.గత ప్రభుత్వాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కారు చౌకగా భూములను వివిధ సంస్థలకు అప్పగించిన విషయంలో సైతం ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, దీనిపై సీఐడీ విచారణ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జలయజ్ఞం పేరుతో జరిగిన ధనయజ్ఞంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో దేశంలోని వివిధ రాష్ర్టాల ఎంపీలు తమతో చర్చిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిలో పోటీ పడుతానని అన్న ఏపీ ముఖ్యమం త్రి ...

Read More »