Home / తెలుగు (page 6)

తెలుగు

మార్గదర్శి జయశంకర్ సార్

నేడే ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి.ఒక లక్ష్యం కోసం సుదీర్ఘకాలం, అలుపు లేకుండా పోరాటం చేసిన అతికొద్ది మంది యోధుల్లో ప్రొఫెసర్ జయ శంకర్ గారి పేరు చేర్చ క తప్పదు. ఆయన జీవితం తెలంగాణ ఉద్యమంతో పెనువేసుకుని పోయింది. తెలంగాణ కోసం పోరాడిన మూడు తరాలకు వారధి ప్రొఫెసర్ జయశంకర్. 1952 ముల్కీ ఉద్యమంలో జయశంకర్ గారు కార్యకర్త. 1968లో ప్రత్యే క రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో భావవ్యాప్తికి కృషి చేయగా, 1996లో మొదలైన మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిర్దేశకుడయ్యాడు.వ్యక్తిగత అనుభవం ఆధారంగానే ఎవరైనా జీవిత లక్ష్యాలను నిర్ణయించుకుంటారు. అయితే మనలో చాలామంది జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారమైతే చాలునని అనుకుంటాం. మన సమస్య పరిష్కారమైతే సంతృప్తిచెందుతాం. కానీ జయశంక ర్ లాంటివారు తాము ఎదుర్కొన్న సమస్యలు తమ కే కాదు మరెవ్వరికీ రాకూడదని భావిస్తారు. అందుకనే సమస్యలకు మూలాలను వెతికి వాటిని సమూలంగా రూపుమాపాలని ప్రయత్నిస్తారు. అంబేద్కర్ అంటరానితనాన్ని వ్యక్తిగత సమస్యగా చూడలేదు. అంటరానితనం కులవ్యవస్థలో భాగమని గుర్తించి, కులవ్యవస్థ నిర్మూలనకు పోరాటం చేశారు. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆంధ్ర పాలకు లు ...

Read More »

ఉద్యోగాలు చేయలేకపోతే రాజీనామాలు చేయండి!

ఉద్యోగుల విభజన నేపథ్యంలో తమకు తీరని అన్యాయం జరుగుతున్నదని మొరపెట్టుకున్న తెలంగాణ ఉద్యోగులపై కమలనాథన్‌ విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు చేయలేని పక్షంలో రాజీనామాలు చేసి వెళ్లాపోవాలని అన్నారు. ఉద్యోగుల విభజనకు ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీని మంగళవారం తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక సంఘం అధ్యక్షులు ఏ పద్మాచారి, చైర్మన్ కే రాములు సారథ్యంలో ఉద్యోగులు కలిశారు.తెలంగాణ ఉద్యోగులకు తీరని అన్యాయాలు జరుగుతున్నాయని, తాము ఉద్యోగాలు చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వారు కమలనాథన్‌కు తమ కష్టాలను వివరించారు. ఈ సందర్భంలోనే ఉద్యోగ నాయకులకు, కమలనాథన్‌కు వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఉద్యోగాలు చేయలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండని కమలనాథన్ మండిపడ్డారు.విభజన సందర్భంలో కొన్ని సర్దుబాట్లు ఉంటాయని, వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కమలనాథన్ ఉద్యోగ నాయకులకు చెప్పారు. విభజనలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ జీఏడీ అధికారిని మెంబర్ సెక్రటరీని చేయడం అన్యాయమని, ఇలాంటి నిర్ణయాలు ఆరుదశాబ్దాల తెలంగాణ ఉద్యోగుల పోరాటాలను అవమానించడమేనని పద్మాచారి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులు బాధలను, కష్టాలను, ఇబ్బందులను చెప్పడానికి వస్తే రాజీనామాలు చేయాలంటూ కసురుకోవడం ఎంతవరకు న్యాయసమ్మతమని టీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. టీ ఉద్యోగుల ఐక్యవేదిక ...

Read More »

కరీంనగర్‌లో ఘనస్వాగతం, కేసీఆర్‌కు నీరాజనం

Screen Shot 2014-08-05 at 9.47.46 PM

కరీంనగర్ జనసంద్రమైంది. తమ ప్రియతమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు రావడంతో వేల సంఖ్యలో వచ్చిన జనం.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు జిల్లా కేంద్రం శివారులోకి చేరుకోగానే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యేలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అప్పటికే అక్కడ బారులు తీరిన విద్యార్థినులు కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. అనంతరం ప్రత్యేక బుల్లెట్‌ప్రూఫ్ బస్సులో ఎక్కిన సీఎం, ప్రజలకు అభివాదం చేస్తూ ప్రదర్శనగా ముందుకు సాగారు. రాంపూర్, కమాన్, సిక్కువాడీ, కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయం, బస్‌స్టేషన్ మీదుగా కలెక్టరేట్ వరకు రెండుగంటల పాటు ర్యాలీ సాగింది. ముఖ్యమంత్రిని చూసేందుకు రహదారికిరువైపులా బారులు తీరిన నగరవాసులు.. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. వీరందరికీ అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు. బతుకమ్మలు, బోనాలతోపాటు ఒగ్గుడోలు ప్రదర్శన, లంబాడీల నృత్యాలు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు నగరంలోని కమాన్ వద్ద ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు (కరీంనగర్ ...

Read More »

గోల్కొండపై స్వాభిమాన ప్రకటన!

గోల్కొండ ప్రాకారంలోకి అడుగు పెడితే తెలంగాణ బిడ్డలకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ రాతి గోడలను చూసినప్పుడు చరిత్ర పొరలలో నిక్షిప్తమైన అనేక తరాల రాతలు మస్తిష్కంలో మెదలాడుతుంటాయి. రాజులు, రాణుల రసరమ్య గాథలు, కరవాలాల ఖణఖణలు, కులీనుల విలాసాలు, కవితా గోష్టులు, నర్తకీమణుల అందెల గలగలలు… అన్నింటికీ మౌనసాక్షి మన గోల్కొండ దుర్గం.దేశ స్వాతంత్య్ర వేడుకలను ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగుర వేసి జరుపుకుంటున్నట్టే, మన తెలంగాణలో గోల్కొండ కోటను వేదికగా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. గోల్కొండ కోటపై పతాకం ఎగుర వేయడమంటే అదొక – తెలంగాణ సమాజ స్వాభిమాన ప్రకటన. పరాయి పెత్తనంపై తెలంగాణ సమాజం సాధించిన విజయానికి సూచిక. గోల్కొండ కోటపై రెపరేపలాడే ఆ స్వాంతంత్య్ర పతాక కొత్త శకారంభాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ చారిత్రక వారసత్వం, నృత్యాలు, జానపద కళారూపాలు, కవుల చిత్రపటాలు మొదలైనవి ప్రదర్శించడం మన చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటుకోవడమే. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత జరుపుకుంటున్న తొలి స్వాతంత్య్ర వేడుకలోనే తెలంగాణతనం, స్వాభిమానం ప్రతిబింబించడమంటే- తెలంగాణ ఉద్యమ సందేశానికి కార్యరూపం ఇవ్వడమే. తెలంగాణ పురావైభవానికి ప్రతీక అయిన గోల్కొండ ...

Read More »

ఆ గొంగడి తగలేద్దాం

-కట్టా శేఖర్ రెడ్డి సంకల్పం ఉంటే సప్త సముద్రాలను అలవోకగా దాటవచ్చు. నాయకుడు దీక్షాదక్షుడైతే జనాన్ని సైన్యంలా నడిపించవచ్చు. ఎటువంటి లక్ష్యాలనైనా సాధించవచ్చు. ఒకేరోజు రాష్ట్రంలోని 84 లక్షల ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించాలన్న ఆలోచనే అసాధారణమైనది, విప్లవాత్మకమైనది. బడ్జెట్ రూపకల్పనకోసం, సంక్షేమ పథకాల అమలుకోసం, నిధుల కేటాయింపుకోసం ఇప్పటి వరకు జరుగుతున్న సర్వేలన్నీ శాంపిల్ సర్వేలు. ఉజ్జాయింపు సర్వేలు. జనాభా లెక్కల సేకరణ ఒక్కటే సమగ్ర సర్వే. కానీ అందులో ప్రభుత్వానికి అవసరమైన అనేక వివరాలు సేకరించడం లేదు. అందులో కూడా పౌరులు చెప్పింది రాసుకోవడమే. పరిశీలనాత్మక సర్వే లేదు. సరైన, సమగ్రమైన సమాచారం లేకుండానే కొన్ని దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఏటా లక్షలాది ఇళ్ల నిర్మాణం ప్రకటిస్తారు. ఏటా కొత్తగా వేలు లక్షలు రేషన్‌కార్డులు ఇస్తారు. ఏటా సామాజిక పెన్షన్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. వీటికి అంతులేకుండా పోతున్నది. నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో తీవ్రమైన వైఫల్యం జరుగుతున్నది. అందుకే 84లక్షల గృహస్తులు ఉన్న మనరాష్ట్రంలో ఇప్పటికే 54 లక్షల ఇళ్లు నిర్మించినా ఇంకా ఇళ్ల నిర్మాణానికి లక్షలాది దరఖాస్తులు ఎదురు ...

Read More »