Home / తెలుగు / మిని థియేటర్లతో చిన్న సినిమాకు, తెలంగాణ సినిమాకు ఊతం

మిని థియేటర్లతో చిన్న సినిమాకు, తెలంగాణ సినిమాకు ఊతం

tg cinemaస్వప్రయోజనాలు తప్ప చలనచిత్ర పరిశ్రమ మీద శ్రద్ధ లేని సీమాంధ్ర సినీ పెద్దల కబంద హస్తాలనుంచి తెలంగాణ సినిమా విముక్తికి మినీ థియేటర్ల నిర్మాణమే మార్గమని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సంగిశెట్టి దశరథ ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో సూచించారు. రాష్ట్రంలోని థియేటర్లనన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్న సినిమా పెద్దలు చిన్న సినిమాలు, తెలంగాణ సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేసి గొంతు నొక్కేశారని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు ఇచ్చిన భూముల వంటి తాయిలాలన్నీ గద్దల్లా ఎగరేసుకుపోయారని, వారు బలపడి తెలంగాణ సినిమా ప్రతినిధులను ఆమడ దూరం పెట్టారని వివరించారు. ప్రభుత్వ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకున్నారనే ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. 

వీరి పెత్తనం కారణంగా చిన్న సినిమాలు, తెలంగాణ ఇతివృత్తాలతో కూడిన సినిమాలు నడిపేందుకు థియేటర్లు దొరకక డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నరకయాతన అనుభవించారని చెప్పారు. థియేటర్లు కావాలంటే అధికమొత్తాల్లో రెంట్లు వసూలుచేసి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన చిన్న నిర్మాతలు, దర్శకులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ సినిమాను అభివృద్ధి పరచాలంటే తమిళనాడు కర్నాటక రాష్ర్టాల తరహాలో ప్రభుత్వమే మినీ థియేటర్లను నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ఫిలిం చాంబర్ సూచించింది. లేదా ప్రభుత్వ స్థలాలు కేటాయించినా ఫిలించాంబర్ సభ్యులు మినీ థియేటర్లు నిర్మించుకుంటారని పేర్కొంది. తక్కువ మెయింటెనెన్స్‌తో సినిమాలను ఆడించడం ద్వారా నిర్మాతకు లాభం చేకూర్చుతామని ఫలితంగా ప్రభుత్వానికి లీజు రుసుముతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ పెరుగుతుందని పేర్కొంది. 

రాష్ట్రవ్యాప్తంగా 50వేల జనాభా దాటిన ప్రతి పట్టణంలోనూ ఇలాంటి థియేటర్లు నిర్మించేందుకు 4వేలనుండి 8వేల చదరపు గజాల స్థలాన్ని లీజు పద్దతిలో కేటాయించాలని చాంబర్ కోరింది. డిజిటలైజేషన్ కారణంగా తగ్గిన థియేటర్ నిర్మాణ వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని 500 థియేటర్ల నిర్మాణం చేపట్టవచ్చునని, ఒక్కో థియేటర్‌ద్వారా నెలకు రూ. 1.50లక్షలు ఆదాయంగా వచ్చే వీలు కలుగుతుందని వివరించింది. వీటిద్వారా పన్ను రూపంలో ఏటా రూ. 90కోట్ల ఆదాయం వచ్చే వీలు కలుగనుంది. తెలంగాణలో సినిమాలకు పనికివచ్చే లొకేషన్లు ఉన్న ప్రతి ప్రాంతంలో సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించింది. దీంతో తెలంగాణ సంసృ్కతికి ప్రతిబింబాలైన ఒగ్గుకథ, యక్ష గానం, బుర్రకథ, కావమ్మ కథ వంటి ప్రాచీన కళలకు, కళాకారులకు చేయూతనిచ్చి సాధ్యపడుతుందని తెలంగాణ ఫిలిం చాంబర్ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,279 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>