Home / తెలుగు (page 4)

తెలుగు

కమలనాథన్ కాకి కబుర్లు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఎవరు లోకల్, ఎవరికి ఆప్షన్లు,ఎవరిని ఎలా పరిగణిస్తారు అనే అంశాలపై కమి టీ తన అభిప్రాయాలను తెలిపింది. కమిటీ ప్రకటించిన మార్గదర్శకాలపై సీమాంధ్ర ఉద్యోగులు హర్షం వెలిబుచ్చితే తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసనను వెలిబుచ్చాయి. కమిటీ తాను ఉద్యోగుల స్థానికతను నిర్ధా రించుటలో ఆర్టికల్ 371డీ మేరకు రూపొందించిన రాష్ట్రపతి ఉత్తర్వులను స్ఫూర్తి గా తీసుకునే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంటు యాక్ట్ 1975కు లోబడి ఉద్యోగి సర్వీసు రికార్డులో నమోదైన లేక అధీకృత అధికారి ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం ఉద్యో గి స్థానికతను నిర్ధారిస్తున్నట్లు పేర్కొంటూ, తాము రూపొందించిన విదివిధానాలపై ఉద్యోగుల్లో ఎవరికైనా అభ్యంతరాలున్నా లేదా సూచనలు చేయాలనుకున్నా ఆగస్టు 5 లోపు పంపాలని పేర్కొంది.స్థూలంగా కమిటీ ఉద్యోగుల విభజనపై రూపొందించిన విధి విధానాను ఒకసారి పరిశీలిస్తే అవి ఎంత వరకు ఆర్టికల్ 371డీ కి అనుగుణంగా ఉద్యోగుల నియామకాలకు సంబంధించి విధిగా పాటించవలసిన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి వున్నవి లేనిది స్పష్టం అవుతుంది. కమలనాథన్ కమిటీ ...

Read More »

MSOల మీద కేంద్రం పెత్తనమేంది?

ప్రైవేటు చానళ్ల కోసం మా గొంతుమీద కత్తి పెడతారా? భయపెట్టి ప్రసారాలు చేయించడం ప్రభుత్వాలు చేయాల్సిన పనేనా?.. ఇవీ శనివారం ఇక్కడ జరిగిన తెలంగాణ ఎంఎస్‌వోల సమావేశంలో వ్యక్తమైన ఆగ్రహావేశాలు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఎంఎస్‌వోలు ఇక్కడ సమావేశమై అంతర్గతంగా చర్చించుకున్నారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బడుగు జీవులమైన తమపై చూపుతున్న ఈ దాదాగిరీ పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్న డీటీహెచ్‌ల మీద చేయగలరా? అని వారు ప్రశ్నించారు. డీటీహెచ్‌లు వారికి నచ్చిన చానళ్లు ప్రసారం చేస్తే నోరెత్తని కేంద్రం తమ విషయంలో మాత్రం ఎందుకు నిర్బంధం విధిస్తున్నదని నిలదీశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కేంద్రం విస్మరించడం దారుణమన్నారు. బయపెడితే బెదిరిపోం…చావుకైనా వెనుకాడేది లేదు. ప్రజలు కోరుకోని చానళ్ళను చూపబోం, భయభ్రాంతుల్ని చేసి నిర్బంధం పెట్టాలని చూస్తే ఉద్యమం మరింత పెరుగుతుంది అని ఎంఎస్‌వోలు చెబుతున్నారు. దేనికైనా సిద్ధం కావాలని వారు స్పష్టతకు వచ్చారు. సోమవారం మరో దఫా సమావేశమై భవిష్యత్తు కార్యచరణ రూపొందించాలని నిర్ణయించారు.  అన్ని చానళ్లు ఇవ్వడం ఎవరి వల్లా కాదు.. హైదరాబాద్ కొన్ని ప్రాంతాలు, తొమ్మిది జిల్లాల్లో డిజిటలైజేషన్ ...

Read More »

ఇంటింటి సర్వేపై సందేహాలు-సమాధానాలు

సర్వే జరుగనున్న 19వ తేదీన ప్రైవేటు సంస్థలు సెలవు ప్రకటించకుంటే పరిస్థితి ఏమిటి?సమాధానం: తెలంగాణ పది జిల్లాల్లో ప్రైవేటు సంస్థలు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాల్సిందే. ఈ మేరకు కార్మిక ఉపాధి శాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు జారీ అవుతాయి. సందేహం: గిరిజనులు ఉపాధి కోసం అడవుల్లో సంచరిస్తుంటారు.. వారి నమోదు ప్రక్రియ ఎలా ఉంటుంది ?సమాధానం: నివాస స్థలాలు(హాబిటేషన్స్) ఎక్కడ ఉంటే అక్కడికి సర్వే సిబ్బంది తప్పనిసరిగా వెళతారు. సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండి ప్రతి కుటుంబంలోని వ్యక్తుల పేర్లను నమోదు చేస్తారు. సందేహం: సంచార జాతులు ఒక చోట స్థిరనివాసం ఉండరు.. అలాంటి వారిని ఏవిధంగా పరిగణలోకి తీసుకుంటారు ?సమాధానం: సర్వే జరిగే రోజున వారు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే వారి వివరాలను నమోదుకు చర్యలు తీసుకోవాలని సర్వే యంత్రాంగానికి కచ్చితమైన ఆదేశాలు జారీచేస్తున్నాం. సందేహం: అత్యవస సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు ఇంటిలో ఉండలేరు కదా ? సమాధానం: ఇలాంటి ఉద్యోగులకు సంబంధించిన వివరాలు వారి కుటుంబసభ్యులు తగిన ఆధారాలతో చూపిస్తే సరిపోతుంది. సర్వే సిబ్బంది కూడా అంగీకరిస్తారు. సందేహం: ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నరోగుల నమోదు చేసుకుంటారా ?సమాధానం: ...

Read More »

మెదక్ జిల్లా ములుగులో ఉద్యానవన వర్సిటీ

మెదక్ జిల్లా ములుగు మండలంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అటవీ వర్సిటికీ అనుబంధంగా కాలేజీ, పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటవుతాయని చెప్పారు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో వీటిని నిర్మించనున్నారు. ఈ సంస్థలకు ములుగు వద్ద వెయ్యి ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.శుక్రవారం జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు వెళుతూ ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌సీ)వద్ద కేసీఆర్ ఆగారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే పై సంస్థలకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. పచ్చని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంతోపాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఊహించని పురోభివృద్ధి సాధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ములుగు ఎఫ్‌ఆర్‌సీలో సుమారు వెయ్యి ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.కలెక్టర్ శరత్, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ప్రియాంక వర్గీస్, డీఎఫ్‌వో సోనిబాలాదేవీ, ఓఎస్డీ హన్మంతరావులతో భూసేకరణ వివరాలపై సమీక్షించారు. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమానికి తానే వస్తానని, అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ...

Read More »

హైదరాబాద్ కబ్జాకు కోరలు సాచిన మోడీ సర్కారు!

తెలంగాణ రాష్ట్ర నవోదయంపై ఆరంభంలోనే చీకట్లు కమ్మే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం నిర్లజ్జగా తెరతీసింది. సీమాంధ్ర బాబుల ఒత్తిళ్లకు తలొంచి.. ప్రజాస్వామ్య స్ఫూర్తినే పాతరేసింది. రాష్ట్ర వ్యవహారాల్లో, ఉభయ కమిషనరేట్లతోపాటు రంగారెడ్డి జిల్లా శాంతి భద్రతల వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం 13 అంశాలతో లేఖ రాసింది. రాష్ట్ర వ్యవహారాల్లో గవర్నర్ ఆదేశాలను పాటించాలని అందులో పేర్కొన్నారు. బలగాల మోహరింపు వంటి అంశాల్లో గవర్నర్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. తద్వారా తెలంగాణ ప్రజలను, ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దారుణంగా అవమానిస్తూ తెలంగాణ సర్కారుపై సూపర్ ప్రభుత్వాన్ని రుద్దే చర్యలకు సాహసించింది. హైదరాబాద్ కబ్జాకు కోరలు సాచింది. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన సీఎం కే చంద్రశేఖర్రావు.. మోడీ సర్కారుది ఫాసిస్టు చర్యగా అభివర్ణించారు. కేంద్రం లేఖను పరిగణనలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యానికి పాతరేసే విధంగా ఉన్న ఈ లేఖకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామని ప్రకటించారు. వివిధ విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా కేంద్రం చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.ఒకప్పుడు భాగ్యశాలి అయిన తెలంగాణ రక్తమాంసాలను అరవై ...

Read More »