Home / Author Archives: Telangana Talkies (page 21)

Author Archives: Telangana Talkies

మెదక్ జిల్లా ములుగులో ఉద్యానవన వర్సిటీ

మెదక్ జిల్లా ములుగు మండలంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అటవీ వర్సిటికీ అనుబంధంగా కాలేజీ, పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటవుతాయని చెప్పారు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో వీటిని నిర్మించనున్నారు. ఈ సంస్థలకు ములుగు వద్ద వెయ్యి ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.శుక్రవారం జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు వెళుతూ ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌సీ)వద్ద కేసీఆర్ ఆగారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే పై సంస్థలకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. పచ్చని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంతోపాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఊహించని పురోభివృద్ధి సాధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ములుగు ఎఫ్‌ఆర్‌సీలో సుమారు వెయ్యి ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.కలెక్టర్ శరత్, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ప్రియాంక వర్గీస్, డీఎఫ్‌వో సోనిబాలాదేవీ, ఓఎస్డీ హన్మంతరావులతో భూసేకరణ వివరాలపై సమీక్షించారు. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమానికి తానే వస్తానని, అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ...

Read More »

హైదరాబాద్ కబ్జాకు కోరలు సాచిన మోడీ సర్కారు!

తెలంగాణ రాష్ట్ర నవోదయంపై ఆరంభంలోనే చీకట్లు కమ్మే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం నిర్లజ్జగా తెరతీసింది. సీమాంధ్ర బాబుల ఒత్తిళ్లకు తలొంచి.. ప్రజాస్వామ్య స్ఫూర్తినే పాతరేసింది. రాష్ట్ర వ్యవహారాల్లో, ఉభయ కమిషనరేట్లతోపాటు రంగారెడ్డి జిల్లా శాంతి భద్రతల వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం 13 అంశాలతో లేఖ రాసింది. రాష్ట్ర వ్యవహారాల్లో గవర్నర్ ఆదేశాలను పాటించాలని అందులో పేర్కొన్నారు. బలగాల మోహరింపు వంటి అంశాల్లో గవర్నర్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. తద్వారా తెలంగాణ ప్రజలను, ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దారుణంగా అవమానిస్తూ తెలంగాణ సర్కారుపై సూపర్ ప్రభుత్వాన్ని రుద్దే చర్యలకు సాహసించింది. హైదరాబాద్ కబ్జాకు కోరలు సాచింది. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన సీఎం కే చంద్రశేఖర్రావు.. మోడీ సర్కారుది ఫాసిస్టు చర్యగా అభివర్ణించారు. కేంద్రం లేఖను పరిగణనలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యానికి పాతరేసే విధంగా ఉన్న ఈ లేఖకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామని ప్రకటించారు. వివిధ విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా కేంద్రం చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.ఒకప్పుడు భాగ్యశాలి అయిన తెలంగాణ రక్తమాంసాలను అరవై ...

Read More »

Centre Issues 13 Guidelines To Make Governor The Super CM Of Telangana!

modi-kcr

The Union government is treating Telangana, India’s 29th State, as a special case, if it’s latest letter to the State is anything to go by. Somehow either the Centre thinks Telangana people are unfit to rule themselves or simply can’t get out of the deadly embrace of Andhra capitalists invested in Hyderabad. The Centre wrote to Telangana government to entrust ‘special responsibilities’ to the Governor in maintenance of law and order in Hyderabad, as if Hyderabad is in the throes of a civil war and badly needs a rescue from Centre. The letter has been signed by MHA Joint Secretary S Suresh Kumar. The Telangana Government immediately snapped, with Chief Secretary Rajeev Sharma replying to the Centre within two hours of ...

Read More »

Here Is The Survey Form To Be Used On Aug 19th

Survey 6

The Government made it clear all residents of a household should be at home on 19th August to be considered in the social audit being conducted by the Telangana State Government. The Government is trying to plug loopholes and irregularities in the State’s welfare programs to the tune of  nearly Rs 10,000 Cr each year. The Government addressed concerns of NRIs and students studying abroad that they need not worry about not being at home as the Govt will figure out alternate mechanism for considering the NRIs. Parents of students studying abroad though are recommended to provide documentary proof of their wards studying abroad. The Government termed the survey a social audit and has categorically said it has nothing to ...

Read More »

లండన్ లో ఘనంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు

లండన్మహానగరం లో జయశంకర్ సార్ జయంతివేడుకను అక్కడ నివసిస్తున్న తెలంగాణాప్రజలు చాలా ఘనంగా జరుపుకున్నారు.జయశంకర్ తెలంగాణా రిసర్చ్ అండ్ డెవెలప్‌మెంట్సెంటర్ ఆద్వర్యం లో జరిగిన ఈవేడుకకు వందల సంఖ్యలో తెలంగాణా బిడ్డలు పాళ్గుణి పెద్దసారు కు ఘన నివాళిఅర్పించారు. తెలంగాణా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్శ్రీ జీవన్కుమార్ శ్రీరాముల గారు, సుప్రీమ్ కోర్ట్లాయర్, TDF UK Europe ఛైర్మన్ శ్రీ కమల్ ఓరుగంటిగారు, జయశంకర్ తెలంగాణా రిసర్చ్ అండ్ డెవెలప్‌మెంట్సెంటర్ గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ వి ప్రకాష్(తెలంగాణా ప్రకాష్) గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. శ్రీజీవన్ కుమార్ శ్రీరాముల గారు జయశంకర్ సార్తో తనకు ఉన్న అనుబందాన్నిపంచుకోగా, కమల్ ఓరుగంటి గారుజయశంకర్ సార్ ఉధయ్మానికి అందిచినవిలువలను సేవలను కొనియాడారు. జయశంకర్ తెలంగాణా రిసర్చ్ అండ్ డెవెలప్మెంట్ గ్లోబల్అధ్యక్షులు శ్రీ వి ప్రకాష్గారు మాట్లాడుతూ వివిధ ధేశాలలో సంస్దచేసాని పలు సామాజిక సేవలను,రిసర్చ్ పనులను వాటి ఉపయోగాలను సభకుతెలియ చేశారు. జయశంకర్తెలంగాణా రిసర్చ్ అండ్ డెవెలప్మెంట్ సెంటర్లండన్ అధక్షులు శ్రీ చాడ సృజాన్రెడ్డి గారు మాట్లాడుతూ లండన్లో సంస్దచేసాని పలు సామాజిక సేవలనుసభకు తెలియ చేశారు. శ్రీచితరంజన్ రెడీ, నవీన్ పొన్నాల,మధు అందెం, రామ ...

Read More »