Home / Author Archives: Telangana Talkies (page 208)

Author Archives: Telangana Talkies

School Pledge came from Telangana!

76108_181296772057592_1113278260_n

“India is my country and all Indians are my brothers and sisters…” అంటూ చిన్నప్పటి నుంచి మనం school లో చదివిన pledge ఎవరు రాసారో తెలుసా? మన తెలంగాణా బిడ్డ! నల్గొండ జిల్లా అన్నెపర్తి వాస్తవ్యుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఈయన రాసిన pledge ఐదు దశాబ్దాలుగా దేశములోని పిల్లలు అందరు చదువుథున్నరు కాని కనీస గుర్తింపు లేదు మన తెలంగాణా తేజానికి .. share this widely. and tell everyone ప్రతి నోట పలికేది తెలంగాణా వాడి మాట అని!

Read More »

Channel V6 picks up TELANGANA TALKIES story on Paidi Jairaj!

V6 picks up Telangana hero Dhadasaheb Phalke Award winner Paidi Jairaj’s story TELANGANA TALKIES published first on Aug 24 as its first post! TT also published it 4 days ago on this FB Page, including the fact that he won Dhadasaheb Phalke 10 years before ANR. తెలంగాణా ఆణిముత్యం పైడి జైరాజ్! Jai Telangana!! Post by Telangana Talkies.

Read More »

మాయ తెర By: – దేశపతి శ్రీనివాస్

ఉహ తెలిసిన నాటి నుంచి మనసును పట్టి ఊపుతున్న కాల్పనిక ప్రపంచం సినిమా. ఆలోచన, భావన సృజన అన్నింటినీ సినిమా తన్మయం చేసింది. జీవితం సినిమా అయిపోయినట్లు విషాదంలోనూ, వినోదంలోనూ ఒక బ్యాక్‌గ్రౌన్డ్ మ్యూజిక్ మోగుతున్నట్లే భ్రమ. చిన్నప్పుడు కొట్లాడుకుంటుంటే కూడా డిష్షుం డిష్షుం అనే చప్పుడు నోటి అప్రయత్నంగా వెలువడేది. జానపదాలు చూసిన ప్రభావం చిన్నప్పుడు ఎంత వెంటాడేదంటే..చేతుల కళ్ళాన్ని పట్టుకొని నోటితోని గుర్రం గిట్టల ధ్వనిని చేసుకుంటు కాలొకటి ఎగరేసుకుంటు పంచకళ్యాణి మీద దూసుకపోవుడే కని మామూలుగా నడిచేదా? ఎలితెబద్దలకు సుతిలి దారాలుగట్టి బాణాలు తయారు చేసుకొని నుదుటికి ఆనించుకుని అచ్చం ఎన్టీ రామారావు వలనె మంత్రించి అస్త్రాలు వదిలితే రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫీలో దూసుకపోతున్నట్టు అబ్బ చెప్పరాని సంబురం. వంకరటింకర కట్టె ఒకటి కనబడితె అదే చేతుల మంత్రదండంగా మారిపోయేది. రాజనాలంత భీకరంగా ‘సర్పకేశీ’ అని భూతాలను ఆవాహన చేసుడు. జ్వాలాదీప రహస్యాలను కనుక్కొని మంత్రగాని ప్రాణమున్న భరిణెను దొరికించుకొని చిత్రవధ చేసి వధించేంది. దీపావళి తుపాకులు తీసుకొని గోడచాటుకు దాక్కుంటు నడుమ నడుమ తల బయటకు పెట్టుకుంట అచ్చం డిటెక్టివ్ సినిమాల వలనె ...

Read More »

వలసంటే? – అభినయ్ కశ్యప్

1002627_10200754980371032_2108133960_n

ఒక 15 ఏండ్ల కిందటి మాట: వేసవి సెల్వులు వస్తే మా దోస్తులందరూ తిరుపతి వోతం, ఊరికి వోతం, ఊటీ వోతం అనేటోళ్ళు. నాకు మాత్రం మనసంతా మా ఊరిమీననే. “మా పల్లె యందు ప్రకృతి పరవశించెను, ఎటు చూసినా పచ్చని పొలాలతో, పారే కాలువలతో, వాగులతో, వంకలతో, పల్లె అందము వర్ణనాతీతము” అని పుస్తకాలల్ల సదువుకునేటిది. అది సదివి ఊరికి పోవాలెనని ఉబలాటం ఇంగా ఎక్కువయ్యేటిది. అప్పట్ల చిన్న చిన్న పోరల్లం ఒక పది మంది దంక ఐతుంటిమి. సెల్వులొస్తే సాలు, ఊరికోవాలె, ఆడ అందరితోని ఆడుకునాలె, శామకూరోళ్ళ సందీపు, భారతీషు, పద్మనాభాచర్య, ఐద్రవాదు సంపతు, మా ముగ్గురక్కలు, పెదనాయిన, పెద్దమ్మ ఇంగ మా కాక. ఎప్పుడైతె కలుస్తనా ఈళ్ళనందరినీ అని పానం ఒకటే గుంజుడు. ” ఎండాకాలం రా బిడ్డా ఆడ ఓళ్ళకే మస్తు కష్టము, అసలే ఊర్ల నీళ్ళు లేవు, నీడ పట్టున ఈడనే ఉండు రా ఇంటి కాడ” అని అమ్మా, నాయిన మస్తు జెప్పేటోల్లు. మనం ఇంటమా, ఆ దోస్తులు, ఆ మామిడిపండ్లు, మా కాక. మనసు వశమయ్యేటిది కాదు. రెండు మూడు ...

Read More »