Home / తెలుగు / సమగ్ర సర్వేకు సర్వం సిద్ధం

సమగ్ర సర్వేకు సర్వం సిద్ధం

తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పథకాల రూపకల్పనలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 1996 నుంచి ఇప్పటివరకు జరిగిన ఐదు సర్వేలపై లేని వివాదం తెలంగాణ సర్కారు తలపెట్టిన ఇంటింటి సర్వేపై లేవనెత్తి, రాజకీయకోణంలో దానిని రచ్చచేసే చర్యలను ప్రభుత్వం చాకచక్యంగా తిప్పికొట్టింది.

serveyబంగారు తెలంగాణ నిర్మాణం కోసం సర్వే తప్పనిసరి అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నది. పాలకులు ప్రజలకు సేవకులుగా, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే ప్రతి ఒక్క రూపాయి ప్రజల కోసమే ఖర్చుపెట్టి, పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వచ్ఛందంగా తమ వివరాలను అందించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 

వాస్తవానికి ఆరు పేజీలతో కూడిన సమగ్ర ఫార్మాట్‌ను ప్రభుత్వం ముందుగా రూపొందించింది. అయితే ఈ సర్వే నిర్వహణలో ఎలాంటి దురుద్దేశం లేకపోయినా కొందరు దీనిని వివాదం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీంతో అపోహలకు ఆస్కారం ఉన్న అంశాలను ప్రభుత్వం సర్వే పత్రంనుంచి తొలగించింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేయాలనే లక్ష్యంతో, ప్రజానీకానికి కావాల్సిన అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనకు సమగ్ర కుటుంబ సర్వే ఎంతో దోహదం చేస్తుందన్న అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వం.. అడ్డంకులన్నీ అధిగమిస్తూ ముందడుగు వేసింది. 

ఒక్క రోజులో సర్వేను సవాలుగా స్వీకరించి.. అవసరమైన అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. 19వ తేదీన చరిత్ర సృష్టించేలా సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే సర్వేపై ఉన్న సందేహాలను నివృత్తి చేసిన ప్రభుత్వం.. ఎన్యూమరేటర్లకు శిక్షణ కూడా ముగించింది. సర్వే జరిగే రోజుకు కేవలం మూడు రోజులే మిగిలి ఉండటంతో ఇతరరత్రా చిన్న చిన్న ఇబ్బందులను సైతం తొలగించేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నది. సర్వే జరిగే రోజున అందరూ ఇండ్ల వద్దే ఉండి..సహకరించాలని ప్రభుత్వ యంత్రాంగం విజ్ఞప్తి చేస్తున్నది. 

సర్వేలు ఇదే కొత్త కాదు
రాష్ట్రంలో ఇండ్ల సర్వే జరుగడం ఇదే కొత్త కాదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 1996లో మల్టీ పర్పస్ హౌజ్‌హోల్డ్ సర్వే (ఎంపీహెచ్‌ఎస్) జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2002లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల (బీపీఎల్) సర్వే చేసింది. 2005లో రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ సర్వే చేయగా.. 2009లో ఆధార్ కార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్‌రోల్‌మెంట్ నిర్వహించింది.

2011లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సామాజిక ఆర్ధిక, కుల గణన (ఎస్‌ఈసీసీ), కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం(2013)లో పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతి సర్వేను నిర్వహించింది. ఈ విషయాలను ప్రస్తావిస్తున్న అధికారులు.. గతంలో ఎన్నడూ ఏ సర్వేపై లేని సంకటాన్ని ప్రస్తుత సమగ్ర కుటుంబ సర్వే విషయంలో సృష్టించడం వెనుక ఇతరత్రా కారణాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో సుమారు అరవై ఏండ్లపాటు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పేరిట చేసిన ఖర్చులన్నీ పారదర్శకంగా ప్రజల కోసమే జరిగినట్లయితే ప్రస్తుతం రాయితీలు, సంక్షేమ పథకాల ఆవశ్యకతే ఉండేది కాదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరకపోవడంవల్లే పేదలు మరింత పేదరికంలో మగ్గాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం భావిస్తున్నది.

దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను దేశం గర్వించే విధంగా అభివృద్ధిపథం వైపునకు పయనింపజేసేందుకు ఈ సర్వేను ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ప్రజల జనగణనలో వారి ఆర్థిక స్థితిగతులు ఏ స్థాయిలో ఉన్నాయనేది గుర్తించడం ఎంతో అవసరం. ప్రజల జీవన పరిస్థితులు, వారికి చేయూతనిచ్చేందుకు చేయాల్సిన కార్యక్రమాలు, వారి ప్రాంతాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలువంటి వాటికి కార్యాచరణ రూపకల్పనకు సర్వే సమాచారం ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

One comment

  1. Very good plan for protection of misuse of govt funds. some of the following suggessions:- 1) Close or ban all private schools and colleges. Further all running schools and colleges are run by telangana govt.only with nominal feeses. Provide ready made foods such as biscuits, Breads snacks etc., by reputed companies funded by govt. Along with drinking water bottles, where drinking water taps not available. Immediate action tone taken by the govt. schools which are running in dangerous shelter conditions tone taken up immediate repairs. shortly, our beloved cm is going to visit singapore where the people awareness is awakened and they thought always our street, our city, and our country, same thought tobe developed in telangana main cities and villages also. In view of the electricity shortage advise to all our telangana people to use low voltage bulbs and one tube to be provide in their street in front of every house so that no need to use of high voltage street lights. Please utilise the services of PENSiONERS those who are still young and energetic as tour guides and light duties such as entering the names at pilgrims places. After retirement it is difficult to maintain their families with half of the salaries.
    -Suresh. A retired telangana govt servant.

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

10,976 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>