Home / Tag Archives: తెలంగాణ సినిమా

Tag Archives: తెలంగాణ సినిమా

మిని థియేటర్లతో చిన్న సినిమాకు, తెలంగాణ సినిమాకు ఊతం

స్వప్రయోజనాలు తప్ప చలనచిత్ర పరిశ్రమ మీద శ్రద్ధ లేని సీమాంధ్ర సినీ పెద్దల కబంద హస్తాలనుంచి తెలంగాణ సినిమా విముక్తికి మినీ థియేటర్ల నిర్మాణమే మార్గమని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సంగిశెట్టి దశరథ ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో సూచించారు. రాష్ట్రంలోని థియేటర్లనన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్న సినిమా పెద్దలు చిన్న సినిమాలు, తెలంగాణ సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేసి గొంతు నొక్కేశారని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు ఇచ్చిన భూముల వంటి తాయిలాలన్నీ గద్దల్లా ఎగరేసుకుపోయారని, వారు బలపడి తెలంగాణ సినిమా ప్రతినిధులను ఆమడ దూరం పెట్టారని వివరించారు. ప్రభుత్వ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకున్నారనే ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. వీరి పెత్తనం కారణంగా చిన్న సినిమాలు, తెలంగాణ ఇతివృత్తాలతో కూడిన సినిమాలు నడిపేందుకు థియేటర్లు దొరకక డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నరకయాతన అనుభవించారని చెప్పారు. థియేటర్లు కావాలంటే అధికమొత్తాల్లో రెంట్లు వసూలుచేసి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన చిన్న నిర్మాతలు, దర్శకులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ సినిమాను అభివృద్ధి పరచాలంటే తమిళనాడు కర్నాటక రాష్ర్టాల తరహాలో ప్రభుత్వమే మినీ థియేటర్లను నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ఫిలిం చాంబర్ సూచించింది. లేదా ప్రభుత్వ స్థలాలు ...

Read More »