Home / Tag Archives: భూకబ్జాదారుల వెన్నులో వణుకుపుడుతోంది

Tag Archives: భూకబ్జాదారుల వెన్నులో వణుకుపుడుతోంది

భూకబ్జాదారుల వెన్నులో వణుకుపుడుతోంది!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ..తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ ఏర్పాటు..కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సీమాంధ్ర భూకబ్జాదారుల వెన్నులో వణుకుపుడుతోంది. కేసీఆర్ తొలి అడుగు గురుకుల్ ట్రస్టు భూములపై పడడం, అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చేయడం, వక్ఫ్ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పడం, భూదాన్ భూములను ప్రభుత్వం కిందకు తీసుకురావడంతో ఏళ్ల తరబడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వాలిన రాబందులకు దడ పుట్టింది. గురుకుల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు నోటీసులు ఇవ్వడం, సర్వే చేసి అక్రమంగా నిర్మించిన విషయం తేల్చడంతో సీమాంధ్ర పెట్టుబడిదారులకు మింగుడుపడలేదు. హైదరాబాద్ లో అక్రమాలకు పాల్పడ్డ 70 మంది సీమాంధ్ర ప్రముఖులు అయ్యప్ప సొసైటీలో అక్రమనిర్మాణాలు కూల్చిన రోజే చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి హైదరాబాద్ మీద తెలంగాణ ప్రభుత్వానికి హక్కులు లేకుండా గవర్నర్ చేతికిందకు తీసుకువచ్చేలా చూడాలని కోరారని తెలుస్తోంది. ఇక అప్పటి నుండి సీమాంధ్రలో పాలన గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు ...

Read More »