Home / Movies / “కోస్తాంధ్ర విముక్తి చేసిన హైదరాబాద్” అనే ఒక సినిమా కథ!

“కోస్తాంధ్ర విముక్తి చేసిన హైదరాబాద్” అనే ఒక సినిమా కథ!

“కోస్తాంధ్ర విముక్తి చేసిన హైదరాబాద్” అనే ఒక సినిమా కథ:
ఒక అత్తిలి నుండో, ఒక కొండవీడు నుండో, లేదూ గొడావరి డిస్ట్రిక్ట్ లలో ఒక పల్లెటూరి నుండో మన హీరో హైదరాబాద్ వస్తాడు! హైదరాబాద్ కి రాక ముందు ఆయన గారు తన వూళ్ళో పరమ అల్లరి చిల్లరిగా తిరిగే ఒక ఉత్త సోమరిపోతు, ఆవారా, లఫంగ, తిరుగుబోతు అయిఉంటాడు. హీరోయిన్ బొడ్డు మీద బత్తాయిలో జాంపండ్లో (మరీ కొబ్బరి బోండాలు విసిరితే పిల్ల చచ్చి ఊరుకుంటుంది కనక) విసిరి ఒక రెండు పాటలు కూడా పాడి ఉంటాడు. ఈయన గారి చేష్టలకు విసిగి వాళ్ళ నాన్న “ఒరే వెధవా ఇక్కడ మనకు ఇంత పొలమున్నా నీకు యే పని చేత కాక పోయే! హైదరాబాద్ లో మనకు చాల దగ్గరి చుట్టం ఒకాయన పెద్ద ఫాక్టరీ యజమాని ఉన్నాడురా! ఆయన దగ్గర్కి పోతే మాంచి జాబ్ ఇప్పిస్తాడురా! కాలు మీద కాలేసుకుని కనేసం అది అయినా కుదురుగా చేసుకోపోరా ” అని హైద్రాబాద్ పంపిస్తాడు! మన హీరో గారు గొడావరి యాసలో రైలు లో బోల్డు జోకులతో ప్రయాణం చేసి సికింద్రాబాద్ లో దిగగానే ఆటో వాడితో లొల్లి పెట్టుకుని (ఈయన గారు మాట్లాడే గొడావరి యాసేమో ఆటో వాడు అర్థం చేసుకోవాలి – ఆటొ వాడు మాట్లాడే తెలంగాణ భాష ఈయన గారికి అర్థం కాడు) ఆటో వాడి భాషని నానా మాటలూ అని చేయి చేసుకుని ఈయన జిల్లా స్నేహితులుండే కాలనీ లో దిగబడతాడు. ఈ లోపల ఈయన చుట్టూ స్న్హేహితులంతా తమ భాషే శుద్ద తెలుగు అన్నట్టుగా భ్రమింప చేస్తుంటారు – మన హీరో గారు ముందుగా కాలనీ లో తెలంగాణ భాష మాట్లాడే ఒక ‘గుండా’ తో గొడవ పెట్టుకుని చితకబాది కాళమీద పడేసుకుంటాడు. అది చూసి తెలంగాణ భాష మాట్లాడే కమేడియన్ మన హీరో గారికి దాసోహం అవుతాడు. ఇంక మన హేరో గారు తన స్నేహితుల గాంగ్ ని వెంటేసుకుని కాలనీ లో తన జిల్లా ప్రజలకు రెచ్చిపోయి ప్రజాసేవ చేస్తుంటాడు. అప్పటిదాకా వాళ్ల నాన్న ఇచ్చిన ఉత్తరం ఇంకా గుర్తుకురాదు ఈయనకు (మరి యే శ్రమా చెయ్యకుండా తినడానికి అలవాటు పడ్డాడాయె) ఒక రోజు హేరో గారు జూబిలీ హిల్స్ బస్తాప్ లో ఒక తెలంగాణ రౌడి బారి నుండి ఒక అమ్మాయిని వీరోచితంగా కాపాడుతాడు – ఆ అమ్మాయి హేరో ని ఇంటికి తీసుకెల్తుంది – ఆ అమ్మాయి నాన్న యెవరో కాదు – మన హేరో గారి నాన్న కలుసుకోమన్న, హైదరాబాద్ లో సెటిల్ అయిన కోస్తాంధ్ర పారిశ్రామికవేత్త! వెంటనే ఊరు పేరు తండ్రి పేరు చెప్పగానే చాలా సంబర పడిపోయి తన ఫాక్టరీ లో మేనేజర్ పోస్టులో చేరమని హేరో గారిని అపాయింట్ చేసేస్తాడు! హీరో గారు ఇంక తన ఉద్యోగం లో చేరి పోయి మొట్ట మొదటగా లొల్లి చేస్తున్న ‘సోమరి పోతులైన’ తెలంగాణ కూలీలని చితకబాది హెచ్చరిస్తాడు! తన కింద అసిస్టెంట్లుగా తన స్నేహితుల గాంగ్ ని అపాయింట్ చేస్తాడు – అందులో తెలంగాణ కమేడియన్ కి కూడా చాయ్ తెచ్చే సర్వర్ ఉద్యోగం ఇప్పిస్తాడు ఉదారంగా! ఈ లోపల ఫాకట్రీ యజమాని కూతురు హీరో గారితో ఒక రెండు పాటలు కల కంటుంది ముచ్చటగా! హీరో గారు తన పల్లేటూరి మరదలు బొడ్డుని మర్చిపోలేక మరో పాట కల కంటాడు! ఇద్దరు హీరోయిన్ల సంగతి తెల్సిన మన తెలంగాణ కమేడియన్ ఇద్దరితోనూ హీరొ గారు సరసమాడుతున్నట్టు ఒక కల కంటాడు! ఈ లోపల ఫాక్టరీ కి , దాని యజమానికీ మరో పెద్ద విలన్ తో గొడవ జరుగుతుంది! ఈ విలన్ తెలంగాణకి చెంది హైదరాబాద్ ని కొన్ని యేండ్లు గా గడ గడ లాడిస్తూ పట్టి పీడిస్తుంటాడు! ఇంకేముంది మన హీరొ గారు రెచ్చి పోయి విలన్ తో నానా విన్యాసాల వీరోచిత యుద్ధం చేసి (ఈ లోపల హీరో గారి తల్లితండ్రులు ప్రియురాలు కోస్త్రాంధ్ర నుండి హైద్రాబ్దాద్ రావడమూ తెలంగాణ విలన్ వాళ్లని కిడ్నాప్ చేయడమూ జరిగిపోతాయి) విలన్ ని మట్టి కరిపించి తనవాళ్లని రక్షించుకుని, హైదరాబాద్ ని తెలంగాణ విలన్ల నుండీ రౌడీ లనుండీ విముక్తం చేస్తాడు! ఈ కొట్లాట లో పల్లెటూరి హీరోయిన్ విలన్ కత్తిపోటుకు బలైపోతుంది – బతికున్న హీరోయిన్ తో ఫాక్టరీ యజమాని మామ హీరో పెళ్ళీ చేసి తన కూతురినీ ఫాక్టరీ ని హీరో గారికి అప్పజెపుతాడు! హీరో తలి తండ్రులు ఆనందబాష్పాలు రాలస్తోంటే తెలంగాణ కమేడియన్ కేరింతలు కొడుతూండగా శుభం కార్డ్ పడుతుంది! (ఒక వేళ పల్లెటూరి హీరోయిన్ బతికి పోతే హీరో గారు ఇద్దరితోనూ సరసాలాడుతూండగా శుభం పడుతుంది)

మిత్రులారా – యెన్నేండ్ల సంది ఇసుంటి సినిమాలు చూస్తున్నాం? యింకా యెణ్నేండ్లు చూద్దాం? మొన్న జరిగిన ‘సమైఖ్యాంధ్ర’ సభ కూడా ఈ సినిమా లెక్కనే లేదూ? – Narayanaswamy Venkatayogi

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,283 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>