Home / Telugupage 7

Telugu

కేంద్రం, బాబు కుమ్మక్కు: ఉద్యోగుల విభజన ప్రక్రియకు సీమాంధ్ర చంద్ర గ్రహణం

ఉద్యోగుల విభజన ప్రక్రియకు సీమాంధ్ర చంద్ర గ్రహణం పట్టిందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు బట్వాడా చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతున్నదని వారు ఆరోపించారు. చంద్రబాబు, కేంద్రం మిలాఖత్ కావడం వల్లనే విభజన ప్రక్రియ జాప్యం జరుగుతున్నదని వారన్నారు. కేంద్రం కూడా ఉద్దేశపూర్వకంగా జనవరి 2015 వరకు విభజన ప్రక్రియ సాగదీయాలని చూస్తున్నదన్నారు. అక్టోబర్ 31 నాటికి విభజన ప్రక్రియను పూర్తి చేయాలన్న తమ డిమాండ్‌పైన కమలనాథన్ కమిటీ, ఏపీ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదన్నారు.కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ప్రభావితం చేస్తున్నదని ఫలితంగానే ఉద్యోగుల విభజనకు ఏపీజీఏడీ కేంద్ర కార్యాలయమయ్యిందని టీ ఉద్యోగసంఘాల నాయకులన్నారు. జూలై 25న కమలనాథన్ కమిటీ విడుదల చేసిన మార్గదర్శకాలలో చంద్రబాబు పెత్తనం కనిపిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలలోని ఉద్యోగులు, వివిధ ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆయుష్, ప్లానింగ్ తదితర విభాగాల ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే సీమాంధ్ర పాలకులు చోద్యం చూస్తున్నారని అన్నారు. కమలనాథన్, పీకే మహంతి, పీవీ రమేశ్ చంద్రబాబు సలహాల ప్రకారమే నడుచుకున్నారని తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షులు ఏ పద్మాచారి ఆరోపించారు. ...

Read More »

దళిత స్కాలర్ల ప్రతిభ

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు తగినన్ని వనరులు కల్పించి, వాటి నాణ్యతను పెంచితే తెలంగాణ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలరు. నేను ఉదహరించిన విద్యార్థులందరు ప్రభుత్వ స్కూళ్లల్లో తెలుగు మీడియంలో చదువుకున్నవారే. ఇంగ్లిష్ భాష అదేం బ్రహ్మపదార్థం కాదు. ఆలోచన, అవగాహన, స్పందన, సమాజం పట్ల సమగ్ర అవగాహన, ప్రజల మీద ప్రేమ ఉన్న విద్యార్థులకు ఆకాశమే హద్దు.గత వారం కాలమ్‌కు కొనసాగింపుగా మరికొందరు స్కాలర్ల ప్రతిభ గురించి తెలంగాణ విద్యారంగం తెలుసుకోవలసిన అవసరముంది. ముఖ్యంగా కాంట్రాక్టు లెక్చరర్లకు, ఫ్రెష్ స్కాలర్స్‌కు అవకాశాల పంపిణీ విషయంలో స్పర్థ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్లు, కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలను ఉన్నపళంగా రెగ్యులరైజ్ చేస్తే ఎక్కువ విద్యా అర్హతలున్న తమ సంగతేమిటని అడుగుతున్నారు. వాళ్ల శిబిరానికి వెళ్లినప్పుడు కొంత ఆవేశం లో ఉన్నారు. అది కొంత సహజమైనదే. ప్రశ్న అవకాశాలకు సంబంధించింది. ఆ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు వాటిని లోతుగా చర్చించడానికి అది సందర్భం కా దని నాకు అర్థమయ్యింది. తెలంగాణ యూనివర్సిటీలో పరిశోధన చేసిన స్కాలర్లు తమ తమ విశ్వవిద్యాలయాల్లో తమ తమ ప్రాంతాల్లో ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు.కొందరికి ...

Read More »

నల్లా వాష్‌బేసిన్ల నుంచి మరుగుదొడ్డి దాకా అన్నీ ఎత్తుకెళ్లిన సీమాంధ్ర అధికారులు!

Pic: Namasthe Telangana

- స్విచ్‌బోర్డు నుంచి తలుపులు, కిటికీలు, అద్దాలు, లైట్ల దాకా.. - నల్లా నుంచి వాష్‌బేసిన్ల దాకా అన్నీ ఎత్తుకెళ్లిన వైనం - మరుగుదొడ్డినీ వదలని అల్పత్వం - సీఎం సందర్శకులకు కేటాయించిన ఎస్‌ఐబీ భవనంపై బయటపడ్డ కడుపుమంట - సహించేది లేదంటున్న తెలంగాణవాదులు - ప్రభుత్వ భవనాలకు రక్షకుడు గవర్నరే..  - ఆయన చర్యలు తీసుకోవాలని డిమాండ్ -సీమాంధ్ర అధికారుల చిల్లరవేషాలు! -ఎస్‌ఐబీ భవనం ఖాళీచేస్తూ కోటికిపైగా విలువైన ఫర్నీచర్ లూటీ హైదరాబాద్, జూలై 29 (టీ మీడియా): సీమాంధ్రుల సోదర ప్రేమ ఏపాటిదో మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణ ప్రభుత్వంపై సీమాంధ్ర అధికారుల కడుపు మంట బజారుకెక్కింది. తెలంగాణ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్‌రావుకు గ్రీవెన్స్ కార్యాలయంగా కేటాయించిన ఎస్‌ఐబీ భవనం వేదికగా ఆంధ్రపోలీసులు జుగుప్సాకరమైన చర్యలకు పాల్పడ్డారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు అరాచకశక్తుల్లా వ్యవహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకువచ్చే ప్రజలు, సందర్శకులకోసం సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న పాత ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) కార్యాలయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రిత మే ఈ భవనాన్ని గ్రీవెన్స్ కార్యాలయంగా ఏర్పాటుచేసుకునేందుకు కేటాయింపు జరిగింది. ...

Read More »

రూ. 3.24 లక్షల్లోనే కేసీఆర్ మోడల్ హౌస్ !

- రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం- కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి కేసీఆర్ మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు.ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో ...

Read More »

విభజన ప్రక్రియను ఏపీ ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తున్నారు!

  ఉద్యోగుల విభజనకు కమలనాథన్ కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టత కొరవడిందని, స్థానికతను సరిగ్గా నిర్ధారించలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమలనాథన్ కమిటీతో సమావేశాల సందర్భంగా తాము వ్యక్తంచేసిన అభిప్రాయాలను అసలు ఏమాత్రం పట్టించుకోకుండా మార్గదర్శకాలు రూపొందించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వీటి ద్వారా కేంద్ర పాలకులు ఉద్యోగుల విభజనను జటిలం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. సీమాంధ్ర బాబుల ప్రభావం, కేంద్ర పాలకుల మితిమీరిన జోక్యం మార్గదర్శకాల్లో ఉందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేసేవిధంగా కుట్రలకు తెరతీశారని ఆరోపిస్తున్నారు. ఆగస్టు చివరినాటికి ఉద్యోగులందరి స్థానికతపై విచారణ జరుపాలని, పాఠశాలలు ఇచ్చిన బోనఫైడ్ సర్టిఫికెట్ ప్రకారం స్థానికతను నిర్ధారించడం శాస్త్రీయమైన విధానం కానేకాదని వారు స్పష్టం చేస్తున్నారు. బోనఫైడ్ సర్టిఫికెట్ ఒక్కటే స్థానికత నిర్ధారణకు ప్రామాణికం కాదని తేల్చిచెప్తున్నారు.ఈ మేరకు మార్గదర్శకాలపై తమ అభ్యంతరాలను వివరిస్తూ కేంద్రానికి అందించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు మహావిజ్ఞపనను సిద్ధంచేస్తున్నారు. ప్రతీ తెలంగాణ ఉద్యోగిని సొంత రాష్ర్టానికి కేటాయించాలనే ప్రధాన డిమాండ్‌తో దీనిని రూపొందిస్తున్నారు. ఈ అంశంపై బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మను ...

Read More »