Home / Tag Archives: TSPSC to be set up in 10 days

Tag Archives: TSPSC to be set up in 10 days

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం!!

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటుకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం పంపిన ఫైలుపై గురువారం ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని లక్షల ఖాళీలు భర్తీ చేసేందుకు, కొత్త నియామకాలు జరుపుకొనేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలిగినట్లయింది. ఏపీపీఎస్సీకి చెందిన ఉన్నతాధికారులతో గవర్నర్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు తుది నిర్ణయం తీసుకున్నారు. సాంకేతికపరమైన అంశాలన్నింటినీ పూర్తిచేసిన తర్వాత గురువారం సాయంత్రం గవర్నర్ టీఎస్‌పీఎస్సీ ఫైలుపై సంతకం చేశారు. శుక్రవారం లేదా శనివారం ఈ విషయంలో జీవో జారీ అయ్యే అవకాశం ఉంది. జూన్ 2న కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలను స్వీకరించిన కొద్ది రోజులకే టీఎస్‌పీఎస్సీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ప్రతీ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 83, సబ్‌క్లాజ్ (2)లో కూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పరచుకునేందుకు నిబంధనలు ...

Read More »

10 రోజుల్లో టీపీఎస్సీ ! 20,000 ఉద్యోగాలు భర్తీ!

tpsjobs

నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగుల స్వప్నాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. పదిరోజుల్లోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ఏర్పాటు కాబోతున్నది. ఇప్పటికే ఫైల్‌ను సిద్ధం చేసిన సాధారణ పరిపాలన శాఖ దాన్ని త్వరలోనే గవర్నర్‌కు పంపనుంది. టీపీఎస్సీ ఏర్పాటుపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసినదే. టీపీఎస్సీ ఏర్పాటుపై క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలతో కూడిన ఫైల్ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి చేరింది.దీన్ని ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ నరసింహన్ ఆమోదం కోసం పంపనున్నామని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి బీ వెంకటేశ్వరరావు తెలిపారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం పదిరోజుల్లోనే టీపీఎస్సీ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే టీపీఎస్సీ ఏర్పాటైనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో జారీ అవుతుంది. ఆ తర్వాత చైర్మన్‌తో పాటు కనీసం ఇద్దరు, గరిష్ఠంగా ఆరుగురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. టీపీఎస్సీ కార్యదర్శితో పాటు ఇతర ఆఫీసు సిబ్బంది నియామకం వంటిపనులు శరవేగంగా పూర్తిచేసి, వెనువెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.టీపీఎస్సీ ద్వారా దాదాపు ...

Read More »