Home / Tag Archives: Solar power in telangana

Tag Archives: Solar power in telangana

సౌర విద్యుత్‌ను ఉపయోగించుకోవడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలి

solar telangana

-సౌరశక్తికి రాష్ట్రంలో విస్తృత పరిధి..  -తక్షణ విద్యుత్ అవసరాలను తీర్చే వనరు -సోలార్‌పై ఔత్సాహికులు, సంస్థలు సిద్ధం -వేల కోట్ల పెట్టుబడులకు, ఉపాధికి అవకాశం -ఆసక్తి కనబరుస్తున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు -విధి విధానాల్లో స్వల్పమార్పులతో అన్నీ సాధ్యమంటున్న నిపుణులు -ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు, ప్రతి సబ్‌స్టేషన్‌కు ఒక సౌర విద్యుత్ ప్లాంట్..  - ఇదీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక సౌర విద్యుత్ నిపుణుడి సూచన. తెలంగాణకు విద్యుత్ కష్టాలు తొలిగించే ప్రత్యామ్నాయ వనరుల్లో సౌరశక్తి (సోలార్ పవర్) ప్రధానంగా కనిపిస్తున్నది. తక్షణ విద్యుత్ అవసరాలు తీర్చడం, వ్యవస్థాపనకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఔత్సాహికులు, సంస్థలు ఈ రంగానికి బంగా రు భవిష్యత్తును కల్పిస్తున్నాయి. మరోవైపు ఈ రంగం పై పలువురు ఎన్‌ఆర్‌ఐలు కూడా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో విధి విధానాల్లో స్పల్ప మార్పులుచేస్తే విస్తృతస్థాయిలో సౌర విద్యుచ్ఛక్తిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని, తద్వారా తెలంగాణ సౌర తెలంగాణ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల్లో తెలంగాణ జిల్లాలు సౌరశక్తికి అనువుగా ఉన్నాయి. దేశంలో సూర్య తాపం- గ్లోబల్ హారిజంటల్ ఇరాడియన్స్(జీహెచ్‌ఐ) ...

Read More »