Home / Tag Archives: N venugopal on gurukul trust land demolition

Tag Archives: N venugopal on gurukul trust land demolition

భూమిని ముట్టుకో, ప్రళయమే! – ఎన్ వేణుగోపాల్

ayyappa society

‘భూమితో మాట్లాడు, జ్ఞానమిస్తుంది’ అని బైబిల్‌లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆధ్యాత్మిక అర్థం మాట ఎలా ఉన్నా అది గొప్ప మాట. అది ‘భూమి నాదియనిన భూమి పక్కున నవ్వు’ అని మన వేమన అన్న కాలానికి చాల ముందరి మాట. ఆ రెండు మాటలూ గడిచి ఇవాళ ‘భూమిని ముట్టుకో, ప్రళయమే’ అనే దగ్గరికి చేరినట్టున్నాం. భూమి నాది అనుకోగూడదన్న వేమనను దాటి సమాజం చాల “పురోగమించింది” గదా. భూమి నాదీ అనుకోవచ్చు, ఇతరులదని అనుకున్నా దాన్ని దురాక్రమించుకోవచ్చు. దురాక్రమణను అడ్డుకుంటామని ఎవరన్నా అంటే వారిని భూమిమీద లేకుండానూ చేయవచ్చు. భూసంస్కరణలు అమలు జరుపుతానన్న నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని పడగొట్టడం దాకా, దున్నేవారికే భూమిని పంచాలన్న విప్లవకారులను కాల్చిచంపడం దాకా పోనక్కరలేదు. ప్రభుత్వానికీ విప్లవకారులకూ మొదలైన చరిత్రాత్మక చర్చలలో అక్రమంగా అన్యాక్రాంతమైన భూమి ప్రస్తావన రాగానే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి ఆ ప్రస్తావనను “అడ్డగోలు మాటలు”గా అభివర్ణించి, చర్చలకు ముగింపు పలికి నెత్తురుటేర్లు పారించిన చరిత్ర దగ్గరికీ పోనక్కరలేదు. ఇవాళ్టికివాళ జరిగిన, జరుగుతున్న సంగతే చూద్దాం. అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూమిలో కొన్ని ఎకరాల భూమిని, వందలాది ఉదంతాలలో రెండు ...

Read More »