Home / Tag Archives: Manugur thermal power station

Tag Archives: Manugur thermal power station

మణుగూరుకు థర్మల్ విద్యుత్ కేంద్రం?

ఖమ్మం జిల్లాలోని మణుగూరుకు మహర్దశ పట్టనుంది. జిల్లాలో థర్మల్ విద్యుత్ కేంద్రం మణుగూరు లేదా ఏదో ఒకచోట నిర్మించుకుందామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించడంతో ఈ ప్రాం తవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మణుగూరులో మూడు దశాబ్దాల కిందటే థర్మ ల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదించినా, సీమాంధ్ర పాలకులు విజయవాడకు తరలి పోయారు. తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారు. మణుగూరులో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం అసెంబ్లీలో కోరారు. పరిశీలించి నిర్ణయం తీసుకుందాం. ఖమ్మం జిల్లాలో తప్పనిసరిగా పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేద్దాం అని సీఎం బదులి వ్వడంతో మూడు దశాబ్దాల కల నెరవేరుతుందని ప్రజలు ఆశతో ఉన్నారు.  మూడు దశాబ్దాల కిందటే సర్వే 1991లో మణుగూరు ఎన్టీపీసీ కోసం అశ్వాపురం మండలంలోని మొండికుంట ప్రాంతంలో 3 వేల ఎకరాల భూమిలో సర్వే నిర్వహించారు. 2001లో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కొన్ని లింకేజీ సమస్యల కారణంగా ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే ఏరియాగా మణుగూరుకు గుర్తింపు ఉన్నప్పటికీ, ఈ ప్రాంత అభివద్ధికి ఉపయోగపడే పరిశ్రమలపైన సింగరేణి యాజమాన్యం, అప్పటి ...

Read More »