Home / తెలుగు / మణుగూరుకు థర్మల్ విద్యుత్ కేంద్రం?

మణుగూరుకు థర్మల్ విద్యుత్ కేంద్రం?

ఖమ్మం జిల్లాలోని మణుగూరుకు మహర్దశ పట్టనుంది. జిల్లాలో థర్మల్ విద్యుత్ కేంద్రం మణుగూరు లేదా ఏదో ఒకచోట నిర్మించుకుందామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించడంతో ఈ ప్రాం తవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మణుగూరులో మూడు దశాబ్దాల కిందటే థర్మ ల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదించినా, సీమాంధ్ర పాలకులు విజయవాడకు తరలి పోయారు. తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారు. మణుగూరులో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం అసెంబ్లీలో కోరారు. పరిశీలించి నిర్ణయం తీసుకుందాం. ఖమ్మం జిల్లాలో తప్పనిసరిగా పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేద్దాం అని సీఎం బదులి వ్వడంతో మూడు దశాబ్దాల కల నెరవేరుతుందని ప్రజలు ఆశతో ఉన్నారు. 

మూడు దశాబ్దాల కిందటే సర్వే

1991లో మణుగూరు ఎన్టీపీసీ కోసం అశ్వాపురం మండలంలోని మొండికుంట ప్రాంతంలో 3 వేల ఎకరాల భూమిలో సర్వే నిర్వహించారు. 2001లో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కొన్ని లింకేజీ సమస్యల కారణంగా ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. 

అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే ఏరియాగా మణుగూరుకు గుర్తింపు ఉన్నప్పటికీ, ఈ ప్రాంత అభివద్ధికి ఉపయోగపడే పరిశ్రమలపైన సింగరేణి యాజమాన్యం, అప్పటి ప్రభుత్వం దష్టిపెట్టలేదు. మణుగూరు తర్వాత ప్రతిపాదించిన భూపాలపల్లికి విద్యుత్‌ప్లాంటు రాగా.. సత్తుపల్లి ప్రతిపాదనను కూడా సీరియస్‌గానే తీసుకున్నారు. సింగరేణి యాజమాన్యం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద మెగా విద్యుత్‌కేంద్రం ఏర్పాటు చేస్తుండగా కొత్తగూడెం ఏరియాలో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మణుగూరు ఏరియా నుంచి కేటీపీఎస్‌కు, సిమెంట్ తదితర ఫ్యాక్టరీలకు బొగ్గు అత్యధికంగా రవాణా అవుతోంది. ఈ ప్రాంతంలో 60 ఏళ్ల వరకు అవసరమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. తలాపునే గోదావరి ఉరకలెత్తుతూ ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మణుగూరు వైపు మొగ్గు చూపే అవకా శాలు ఎక్కువగా ఉన్నాయి. మణుగూరులో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తే అభివద్ధి ఊహకందని విధంగా జరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,282 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>