Home / Tag Archives: Hortcultural university Medak

Tag Archives: Hortcultural university Medak

మెదక్ జిల్లా ములుగులో ఉద్యానవన వర్సిటీ

మెదక్ జిల్లా ములుగు మండలంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అటవీ వర్సిటికీ అనుబంధంగా కాలేజీ, పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటవుతాయని చెప్పారు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో వీటిని నిర్మించనున్నారు. ఈ సంస్థలకు ములుగు వద్ద వెయ్యి ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.శుక్రవారం జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు వెళుతూ ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌సీ)వద్ద కేసీఆర్ ఆగారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే పై సంస్థలకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. పచ్చని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంతోపాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఊహించని పురోభివృద్ధి సాధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ములుగు ఎఫ్‌ఆర్‌సీలో సుమారు వెయ్యి ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.కలెక్టర్ శరత్, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ప్రియాంక వర్గీస్, డీఎఫ్‌వో సోనిబాలాదేవీ, ఓఎస్డీ హన్మంతరావులతో భూసేకరణ వివరాలపై సమీక్షించారు. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమానికి తానే వస్తానని, అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ...

Read More »