Home / Tag Archives: ABN RK reply to Telangana boycott

Tag Archives: ABN RK reply to Telangana boycott

ఆంధ్రజ్యోతి చెత్త పలుకులు!

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత గొప్ప ఫిక్షన్ రైటర్ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. కలలు కనడం, ఆ కలలకు అక్షరరూపం ఇవ్వడం, అవి చెదరిపోగానే మళ్లీ కొత్త కలలు కనడం రాధాకృష్ణకు అలవాటయింది. రాధాకృష్ణ కలల ప్రపంచం నానాటికీ విస్తరిస్తున్నది. ఇప్పుడది అనంతంగా గోచరిస్తున్నది. ఆంగ్లంలో విష్‌ఫుల్ థింకింగ్ అంటారు.. రాధాకృష్ణను అది ఆవహించినట్టు కనిపిస్తున్నది. గవర్నర్‌కున్న అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించినట్టు, దానిపై కేంద్రం సీరియస్ అయినట్టు, రాజ్యాంగాన్ని అవమానించడంగా భావించినట్టు, అవసరమయితే చివరి ఆయుధంగా కేంద్ర పాలన విధించే అవకాశం ఉన్నట్టు… అక్కసు, అజీర్తీ, ఉక్రోషమూ కలబోసి కలనేసి రాధాకృష్ణ అల్లిన కల్లబొల్లి కథనాన్ని చూసి తెలంగాణవాదులు విస్తుపోతున్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మనసులో ఎంత కుట్ర ఉన్నదో ఆయన ఈ రకంగానయినా బయటపెట్టుకున్నందుకు సంతోషం. ఆంధ్రజ్యోతి పత్రిక రాసిందంతా కేంద్రం బాధ అని ఎవరూ అనుకోవడం లేదు. అదంతా కేవలం రాధాకృష్ణ బాధ.. రాధాకృష్ణ గోస. రాధాకృష్ణ తన రెండు ముఖాలను ఎప్పుడూ దాచుకోలేదు. ఒకటి- నేను తెలంగాణవాడినంటాడు. తెలంగాణవాదినంటాడు. రెండు – మనసావాచా కర్మణా సమైక్యవాదిలా, చంద్రబాబు మనిషిలా మాట్లాడతాడు, రాస్తాడు. కేంద్రం మిథ్య, ...

Read More »

రాధాకృష్ణ ..కళ్లున్న కబోధి

రాధాకృష్ణ ..కళ్లున్న కబోధి

మొత్తానికి కేసీఆర్ దుష్టతలంపు వచ్చిందే తడవు ఆంధ్రజ్యోతి మీద పడ్డాడు. మేం దేనికీ భయపడం. తప్పుంటే చర్యలు తీసుకోండి. కేసీఆర్ స్వయంగా ఎంఎస్ఓలకు ఫోన్ చేసి బెదిరించాడు. అయితే తెలంగాణ టీఆర్ఎస్ మోనార్క్ ఏమీ కాదు. ఆ పార్టీకి వచ్చింది 38.5 శాతం ఓట్లే. మిగతా ప్రజల మనోభావాలకు అద్దంపట్టాల్సిన భాధ్యత మీడియాకు లేదా ? నిజామాబాద్ లో పుట్టిన నేను ఆంధ్రోడిని ఎలా అవుతాను. కానీ నన్ను ఆంధ్రోడిని చేయడంలో కేసీఆర్ విజయవంతం అయ్యాడు. ఆంధ్రజ్యోతి ప్రసారాలను తెలంగాణ ఎంఎస్ఓలు బంద్ చేయడంతో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఈ రోజు తన పత్రికలో రాసుకున్న పలుకులివి. పత్రిక నీది కాబట్టి పలుకులు ఎన్నయినా రాసుకోవచ్చు. నీవు చెప్పిందే నిజమని నీకు నువ్వే భావించుకోవచ్చు. కానీ తెలంగాణ సమాజం నీ కారుకూతలను ..పిచ్చిరాతలను చూసి భ్రమపడిపోదు. తెలంగాణలో 1200 మంది బిడ్డలు బలిదానాలు చేసుకుంటే వారికి అండగా నిలవలేని నీ పాపిష్టి మీడియా ..తెలంగాణ సమాజాన్ని అనుక్షణం గందరగోళంలోకి నెట్టి ..వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఆత్మహత్యల పాపాన్ని మూటగట్టుకున్న నీ సీమాంధ్రజ్యోతి ..తెలంగాణ విడిపోగానే సీమాంధ్ర రాజధానికి విరాళాలు సేకరిస్తుందంటే ...

Read More »