Home / Tag Archives: మన పీవీ మన అస్తిత్వం allam narayana pv birth anniversary

Tag Archives: మన పీవీ మన అస్తిత్వం allam narayana pv birth anniversary

మన పీవీ మన అస్తిత్వం

పీవీ నరసింహారావు తెలంగాణ నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు. దేశ రాజధానిలో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన రాజకీయ దురంధరుడు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. ఆర్థిక సంస్కరణల కోసం మొట్టమొదటిసారి రాజకీయేతర ఆర్థికవేత్తను ఆర్థికమంత్రిగా తెచ్చుకున్న దార్శనికుడు. ఆ తర్వాత ఆ ఆర్థికవేత్త మన్‌మోహన్‌సింగ్ దేశానికి ప్రధానిగా పదేళ్లు పనిచేశారు. విదేశాంగమంత్రిగా, దేశ జ్ఞాన, నిపుణతల స్థాయి పెంచే మానవవనరుల అభివద్ధి శాఖ రూపకర్తగా, ఆ పదవికే వన్నె తెచ్చిన వాడిగా వీపీ నరసింహారావు ప్రపంచ ఖ్యాతి పొందినవాడు. కానీ పీవీ నరసింహారావు సమాధి నెక్లెస్‌రోడ్డు చివరన విసిరేసినట్టున్న ప్రాంతంలో ఉంటుంది. అదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే పనిచేసిన ఎన్.టి.రామారావు సమాధులు, స్మారకాలు, గార్డెన్‌లు నెక్లెస్‌రోడ్డు నడి మధ్య లో ఒక తోటలాగా సందర్శన ప్రాంతంగా ఎందుకు ఉంటుంది.చెన్నారెడ్డికైతే ఈ ప్రాంతమేది దొరకక ఏదో మూలన సమాధి ఎందుకు ఉన్నది. దేశ ప్రధాని అయినప్పటికీ పీవీ విగ్రహాలు ఎక్కడా కనబడవేమి? చెన్నారెడ్డి ప్రజారంజక పాలకుడిగా కీర్తి గడించినప్పటికీ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆయనకు ప్రధాన ప్రాంతంలో ఆరడుగుల నేల దొరకలేదు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు హైదరాబాద్ నిండా ...

Read More »