Home / Tag Archives: నెల రోజుల స్వయంపాలన అస్తిత్వ పతాక

Tag Archives: నెల రోజుల స్వయంపాలన అస్తిత్వ పతాక

నెల రోజుల స్వయంపాలన అస్తిత్వ పతాక

KCR_Telangana CM

ఏలే వాలకం తొలి అడుగుల్లోనే తెలిసిపోతుందంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఈ నెల రోజుల తొలి అడుగులు మంచిమార్కులు సాధించి పెట్టాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటివరకు చూసిన ముఖ్యమంత్రులకంటే ఎలా భిన్నమైనవారో, ఒక కొత్త రాష్ట్ర నాయకునిగా ఏమి చేయగలడో ఈ నెలరోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఎరుకపరిచారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి సమావేశాల్లో కేసీఆర్ చేసిన ప్రసంగం అధికార ప్రతిపక్షాలను సైతం మంత్రముగ్ధులను చేసింది. తెలంగాణ రాష్ట్ర చారిత్రతక అవసరాన్ని, అస్తిత్వకాంక్ష మూలాలను, సమస్యల లోతులను తడిమి, తాను ఏమి చేయదల్చుకుంటు న్నారో చెప్పినప్పుడు సభ యావత్తూ ఏకీభావంతో గొంతుకలిపింది. తెలంగాణ నాయకత్వంపై మనలో మనకే బలపడిపోయిన ఒక చిన్నచూపును, సందేహ దష్టిని కేసీఆర్ పటాపంచలు చేశారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ వడివడిగా అడుగులువేస్తూ అనతికాలంలోనే ఆయన రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగారు. సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం, సమస్యలకు సంబంధించిన లోతైన అవగాహన, వేగంగా నిర్ణయాలు చేయగల ైస్థెర్యం కేసీఆర్‌ను ఒక బలమైన, దక్షత కలిగిన ముఖ్యమంత్రిగా ప్రజల ముందు నిలిపాయి. పోలవరం వివాదం, విద్యుత్ ఒప్పందాల రద్దు, కష్ణా జలాల విడుదల, గురుకుల ...

Read More »