Home / Tag Archives: తెలంగాణ ‘ఇంజనీర్సు డే’ గా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి

Tag Archives: తెలంగాణ ‘ఇంజనీర్సు డే’ గా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి

తెలంగాణ ‘ఇంజనీర్సు డే’ గా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి (జులై 11)

తెలంగాణ ఆర్థర్ కాటన్…నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి దేశవ్యాప్తంగా తెలియని వారుండరు. ఆయన భారతదేశం గర్వించదగ్గ ఇంజనీరు. భారతరత్న బిరుదాంకితుడు. భారతదేశంలో నీటి పారుదల రంగానికి పునాదులు వేసిన తొలి తరం మేధావి. అటువంటి మేధావికి సమకాలికుడు, అంతటి స్థాయి కలిగిన ప్రతిభావంతుడైన ఇంజనీరు నవాబ్ అలీ నవాజ్‌జంగ్. హైదరాబాద్ రాజ్యంలో పటిష్టమైన ప్రణాళికలు రచించి, అనేక భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ తెలంగాణ సాగునీటి రంగానికి పితామహుడు.నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్‌గా ప్రపంచానికి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు పరిచితుడైన ఈయన అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. 11-7-1877న హైదరాబాద్‌లో జన్మించాడు. హైదరాబాద్ రాజ్యంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మీర్ అహ్మద్ అలీ హైదరాబాద్ అబిడ్స్‌లోని సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకొన్నాడు. ఇంగ్లీషుతో పాటు లాటిన్ భాషను కూడా నేర్చుకొన్నాడు. ఆ తర్వాత నిజాం కాలేజీలో చేరాడు. అక్కడ నాలుగేండ్లు ఉన్నత విద్యను అభ్యసించి 1896లో ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌తో ఇంగ్లండ్‌లో ప్రఖ్యాతి గాంచిన కూపర్‌హిల్ ఇంజనీరింగ్ ...

Read More »