Home / Tag Archives: ఒక్క ఇటుక పేర్చినా కూల్చుడే

Tag Archives: ఒక్క ఇటుక పేర్చినా కూల్చుడే

ఒక్క ఇటుక పేర్చినా కూల్చుడే!

నగరంలోని ప్రభుత్వ భూముల్లో ఒక్క ఇటుక పేర్చినా కూల్చివేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు కమిషనర్ సోమేష్‌కూమర్ ప్రత్యేక కార్యచరణ సిద్ధంచేశారు. ఉద్యోగులకు లంచాలిచ్చి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం, అనంతరం కోర్టు స్టేల మాటున వాటిని కొనసాగించడం నగరంలో మామూలైపోయింది. ఇటువంటి అక్రమ నిర్మాణాలు అటు ప్రభుత్వానికి, ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులకు తలనొప్పిగా తయారవుతున్నాయి. అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే తుంచివేస్తే ఈ సమస్య ఉండదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఓ నిర్ణయానికొచ్చారు. అందుకే మాన్‌సూన్ ఎమర్జెన్సీ బందాల తరహాలోనే సర్కిల్‌కు ఒకటి చొప్పున ఎన్‌ఫోర్స్‌మెంట్ బందాలను రంగంలోకి దింపాలని నిశ్చయించారు. నగరంలో ఏటా అక్రమ నిర్మాణాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీకి పది నుంచి 12వేలవరకు ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే ప్రతినెలా పదుల సంఖ్యలో కూల్చివేతలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంటు బందాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా పనిచేయడంలేదు. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకాని(బిపిఎస్)కి రెండు లక్షలకు పైగా దరఖాస్తులు రావడం, గురుకుల్ ట్రస్టు భూముల్లో వందల సంఖ్యలో ఏర్పడిన ఇళ్లే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాకుండా బీపీఎస్ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 40వేలు చెరువులు, కుంటల్లోని ఇళ్లకు సంబంధించినవి ...

Read More »