Home / Tag Archives: అహంకారమా

Tag Archives: అహంకారమా

అహంకారమా, భావప్రకటనా స్వేచ్ఛా?

భావ ప్రకటనా స్వేచ్ఛ మనిషికి ఉండే హక్కులలో అత్యున్నతమైనది. అందులో భిన్నాభిప్రాయం లేదు. ప్రతి మనిషికీ ఏ భావాలైనా కలిగి ఉండే స్వేచ్ఛ, వాటిని ప్రకటించే స్వేచ్ఛ తప్పనిసరిగా ఉండాలి. ఆ మాట అంగీకరిస్తూనే అసలు భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఏమిటో కూడ విశ్లేషించుకోవలసి ఉంది. మనిషి అంటే ఒంటరి రాబిన్సన్ క్రూసో కాదు, మరొకరు కనబడని ద్వీపం మీద లేడు. అసలు అలా ద్వీపం మీద ఉంటే భావాలు ప్రకటించవలసిన అవసరమే రాదు. మనిషంటే తోటి మనుషులతో నిత్య సంబంధంలో ఉండడమనే అర్థం. అందువల్ల ఒక మనిషికి ఉండే హక్కులన్నిటినీ తోటి మనుషులతో సంబంధంలోనే నిర్వచించాలి గాని వాటికి “మెరుగైన సమాజ నిర్మాతల”, “అక్షరాయుధ” ధారుల సొంత, అహంకారపూరిత నిర్వచనాలు కుదరవు. అందుకే “నా పిడికిలి ఊపే హక్కు నీ ముక్కు మొదలయ్యే దగ్గర ముగిసిపోతుంది” అని అమెరికన్ న్యాయనిపుణుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆలివర్ వెండెల్ హోల్మ్స్ అన్నమాట హక్కుల మీద హేతుబద్ధమైన పరిమితికి అద్దం పట్టింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, “మెరుగైన సమాజం కోసం”, “కులరహిత సమాజం కోసం” పాటుపడుతున్నానని తనకు తాను చెప్పుకునే మహా ...

Read More »