Home / Telugupage 15

Telugu

అహంకారమా, భావప్రకటనా స్వేచ్ఛా?

భావ ప్రకటనా స్వేచ్ఛ మనిషికి ఉండే హక్కులలో అత్యున్నతమైనది. అందులో భిన్నాభిప్రాయం లేదు. ప్రతి మనిషికీ ఏ భావాలైనా కలిగి ఉండే స్వేచ్ఛ, వాటిని ప్రకటించే స్వేచ్ఛ తప్పనిసరిగా ఉండాలి. ఆ మాట అంగీకరిస్తూనే అసలు భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఏమిటో కూడ విశ్లేషించుకోవలసి ఉంది. మనిషి అంటే ఒంటరి రాబిన్సన్ క్రూసో కాదు, మరొకరు కనబడని ద్వీపం మీద లేడు. అసలు అలా ద్వీపం మీద ఉంటే భావాలు ప్రకటించవలసిన అవసరమే రాదు. మనిషంటే తోటి మనుషులతో నిత్య సంబంధంలో ఉండడమనే అర్థం. అందువల్ల ఒక మనిషికి ఉండే హక్కులన్నిటినీ తోటి మనుషులతో సంబంధంలోనే నిర్వచించాలి గాని వాటికి “మెరుగైన సమాజ నిర్మాతల”, “అక్షరాయుధ” ధారుల సొంత, అహంకారపూరిత నిర్వచనాలు కుదరవు. అందుకే “నా పిడికిలి ఊపే హక్కు నీ ముక్కు మొదలయ్యే దగ్గర ముగిసిపోతుంది” అని అమెరికన్ న్యాయనిపుణుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆలివర్ వెండెల్ హోల్మ్స్ అన్నమాట హక్కుల మీద హేతుబద్ధమైన పరిమితికి అద్దం పట్టింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, “మెరుగైన సమాజం కోసం”, “కులరహిత సమాజం కోసం” పాటుపడుతున్నానని తనకు తాను చెప్పుకునే మహా ...

Read More »

రాధాకృష్ణ ..కళ్లున్న కబోధి

రాధాకృష్ణ ..కళ్లున్న కబోధి

మొత్తానికి కేసీఆర్ దుష్టతలంపు వచ్చిందే తడవు ఆంధ్రజ్యోతి మీద పడ్డాడు. మేం దేనికీ భయపడం. తప్పుంటే చర్యలు తీసుకోండి. కేసీఆర్ స్వయంగా ఎంఎస్ఓలకు ఫోన్ చేసి బెదిరించాడు. అయితే తెలంగాణ టీఆర్ఎస్ మోనార్క్ ఏమీ కాదు. ఆ పార్టీకి వచ్చింది 38.5 శాతం ఓట్లే. మిగతా ప్రజల మనోభావాలకు అద్దంపట్టాల్సిన భాధ్యత మీడియాకు లేదా ? నిజామాబాద్ లో పుట్టిన నేను ఆంధ్రోడిని ఎలా అవుతాను. కానీ నన్ను ఆంధ్రోడిని చేయడంలో కేసీఆర్ విజయవంతం అయ్యాడు. ఆంధ్రజ్యోతి ప్రసారాలను తెలంగాణ ఎంఎస్ఓలు బంద్ చేయడంతో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఈ రోజు తన పత్రికలో రాసుకున్న పలుకులివి. పత్రిక నీది కాబట్టి పలుకులు ఎన్నయినా రాసుకోవచ్చు. నీవు చెప్పిందే నిజమని నీకు నువ్వే భావించుకోవచ్చు. కానీ తెలంగాణ సమాజం నీ కారుకూతలను ..పిచ్చిరాతలను చూసి భ్రమపడిపోదు. తెలంగాణలో 1200 మంది బిడ్డలు బలిదానాలు చేసుకుంటే వారికి అండగా నిలవలేని నీ పాపిష్టి మీడియా ..తెలంగాణ సమాజాన్ని అనుక్షణం గందరగోళంలోకి నెట్టి ..వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఆత్మహత్యల పాపాన్ని మూటగట్టుకున్న నీ సీమాంధ్రజ్యోతి ..తెలంగాణ విడిపోగానే సీమాంధ్ర రాజధానికి విరాళాలు సేకరిస్తుందంటే ...

Read More »

మీడియా – తెలంగాణ

TV9 Bullet News Telangana

వాళ్లకు మన ఉనికి నచ్చదు. వాళ్లకు మన ఉన్నతి నచ్చదు. అరవైఏళ్లుగా జీర్ణించుకుపోయిన ఆంధ్రా ఆధిపత్య అహంకార ధోరణి వారిని ఊరికె ఉండనివ్వదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అన్న ఆలోచనే వారికి ఇంకా తట్టలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామికంగా పోరాడి తెలంగాణ ప్రజలు లక్ష్యాన్ని చేరుకోవడాన్ని వారు ఏ మాత్రం జీర్ణించుకోలేరు. అసలు సీమాంధ్ర నేతలకన్నా ఈ మీడియా మొగల్స్ తోనే తెలంగాణ ముందు ముందు పెను ప్రమాదం ముంచుకువస్తోంది. ఇది మొగ్గలోనే తుంచేయకపోతే తెలంగాణకు భవిష్యత్ లో తీరని అన్యాయం జరుగడం ఖాయం. తెలంగాణ శాసనసభ్యులను హేళన చేస్తూ టీవీ 9, సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ ఆంధ్రజ్యోతి దినపత్రిక చేసిన ప్రసారాలు, రాసిన వార్తలు వారిలోని తెలంగాణ వ్యతిరేకతను నగ్నంగా బయటపెట్టుకున్నాయి. స్వయంగా కేసీఆర్ స్పందించడం ..తెలంగాణ శాసనసభ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మొక్కుబడి క్షమాపణలు వచ్చినా అవి భవిష్యత్ లో తమ తీరు మార్చుకుంటాయని భావించడం అత్యాశనే అవుతుంది. అసలు ఈ సీమాంధ్ర మీడియా మూలలను దెబ్బతీస్తేనే తెలంగాణకు భవిష్యత్ ఉంటుంది. సీమాంధ్ర పెట్టుబడిదారుల కొమ్ముకాసే ఈ ...

Read More »

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు తాము బానిసలుగా చూపెట్టిన వాళ్లే తెలంగాణ రాష్ట్రానికి పాలకులు కావడంతో పాచికల్లు, తాగుబోతోడికి తొక్కు పచ్చడి, మడిషి పెట్టుకోవడం లాంటి మాటలతో కావురాన్ని ప్రదర్శిస్తుం డ్రు. తెలుగు సమాజంలో తెలంగాణ వాళ్లను చులకన చేయడమే గాకుండా ఏహ్యభావం కలిగే విధంగా ఈ మీడి యా ఉద్దేశ్యపూర్వకంగా ప్రవర్తిస్తుంది. తెలంగాణ ఆరణాల కూలీ అంజయ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయితే ఆయన్ని ఒక బఫూన్‌గా ఈ మీడి యా చిత్రించింది. బుడ్డర్‌ఖాన్, జోకర్‌గా ఆయన్ని ప్రచారం చేసింది. సముద్రంల తేల్ పడ్డది అంటే తేలు ఎట్ల పడ్తది? అని వ్యంగ్యంగా ప్రచారం చేసిండ్రు. తేల్ అంటే నూనె అనే సంగతి మరిచిండ్రు. ఇదంతా ఆయన తెలంగాణ భాషలో మాట్లాడ్డం మూలంగా చేసిన పరేషాన్. దానికి కొనసాగింపే టీవీ9 బుల్లెట్ న్యూస్ పేరిట కక్కిన కాలకూట విషం.పాశికల్లు తాగెటోనికి ఫారిన్ మందు ముందల బెట్టినట్టే ఉన్నది మన తెలంగాణ ఎమ్మెల్యేల కత, మొకం గడుక్కోని వచ్చిండ్రు బానే కని ప్రమాణ స్వీకారం అయితె చెయ్యుండ్రి అనంగనె ...

Read More »

మణుగూరుకు థర్మల్ విద్యుత్ కేంద్రం?

ఖమ్మం జిల్లాలోని మణుగూరుకు మహర్దశ పట్టనుంది. జిల్లాలో థర్మల్ విద్యుత్ కేంద్రం మణుగూరు లేదా ఏదో ఒకచోట నిర్మించుకుందామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించడంతో ఈ ప్రాం తవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మణుగూరులో మూడు దశాబ్దాల కిందటే థర్మ ల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదించినా, సీమాంధ్ర పాలకులు విజయవాడకు తరలి పోయారు. తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారు. మణుగూరులో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం అసెంబ్లీలో కోరారు. పరిశీలించి నిర్ణయం తీసుకుందాం. ఖమ్మం జిల్లాలో తప్పనిసరిగా పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేద్దాం అని సీఎం బదులి వ్వడంతో మూడు దశాబ్దాల కల నెరవేరుతుందని ప్రజలు ఆశతో ఉన్నారు.  మూడు దశాబ్దాల కిందటే సర్వే 1991లో మణుగూరు ఎన్టీపీసీ కోసం అశ్వాపురం మండలంలోని మొండికుంట ప్రాంతంలో 3 వేల ఎకరాల భూమిలో సర్వే నిర్వహించారు. 2001లో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కొన్ని లింకేజీ సమస్యల కారణంగా ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే ఏరియాగా మణుగూరుకు గుర్తింపు ఉన్నప్పటికీ, ఈ ప్రాంత అభివద్ధికి ఉపయోగపడే పరిశ్రమలపైన సింగరేణి యాజమాన్యం, అప్పటి ...

Read More »