Home / Tag Archives: Telangana Vote TRS

Tag Archives: Telangana Vote TRS

ఈసారికి మాత్రం తెలంగాణకే!

TRS-Party-Symbol-CAR-245x138

ఆయన మంచోడే కానీ అది మనపార్టీ కాదు..,ఈయన గట్టోడే కానీ గెలిచెటోడు కాదు..చెడగొట్టేందుకొచ్చిండు…, పాతాయన మాత్రం ఓడి పోవాలె…, ఈసారికి మాత్రం పార్టీల్లేవు గీర్టీల్లేవు తెలంగాణకేస్తం.కారు గుర్తుకేస్తం..-సూర్యాపేట పల్లెల్లో పర్యటించినప్పుడు వినిపించిన మాటలివి. ఈ నాలుగు వ్యాఖ్యలు నలుగురు అభ్యర్థులను ఉద్దేశించి అక్కడి కొందరు పౌరులు చేసినవి. పల్లెల్లో తొందరగా ప్రజలు పార్టీ లు మార్చరు. నాయకులు ఎంత మోసం చేసినా, ఎన్ని పార్టీలు మార్చినా, పార్టీలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసి నా తరాలతరబడి ఒకే పార్టీని నమ్ముకుని పనిచేసే నిజాయితీ పరులైన జనం తెలంగాణ పల్లెల్లో కనిపిస్తారు. కానీ చాలాకాలం తర్వాత ఈసారి పల్లెల్లో ఒక సడలింపు ధోరణి ప్రజల్లో కనిపిస్తున్నది. ఇది ఒక చారిత్రక సందర్భం, చారిత్రక ఎన్నికలు కావడం వల్ల కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టే సంధికాలంలో ఉండడంవల్ల కావచ్చు. అన్ని రాజకీయ పార్టీల రాజకీయ పునాదుల్లో ఒక పెనుమార్పు కనిపిస్తున్నది. కొత్త గాలికి సూచన కావ చ్చు. ఈ ఒక్కసారి తెలంగాణ పార్టీకి అవకాశం ఇచ్చిచూద్దామన్న అభిప్రాయం చాలా మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల్లో కూడా వ్యక్తమయింది. మేము జెండాలు పెట్టుకోలేదు. ఇద్దరు మిత్రులతో ...

Read More »