Home / Tag Archives: telangana telugu cinema iran influence

Tag Archives: telangana telugu cinema iran influence

తెలంగాణ సినిమా ఇరాన్ మార్గం

మానవజాతి చరిత్రలో జరిగిన విముక్తి పోరాటాలన్నింటికీ కారణాలు రెండే రెండు. ఒకటి అస్తిత్వ కాంక్ష! రెండోది ఆత్మగౌరవ ఆకాంక్ష. ఈ రెండు కారణాలే స్వాతంత్యోద్యమానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మార్గాల్ని వేసాయనేది వాస్తవం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాజకీయంగా, భౌగోళికంగా తెలంగాణ ప్రజలు విముక్తులయ్యారు. కానీ సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, సినిమాల పరంగా ఆ విముక్తి ఇంకా జరగాల్సివుంది. సాంస్కృతిక కళారూపలన్నిట్లోనూ సినిమాది అగ్ర ప్రాధాన్యత అనడంలో సందేహంలేదు. అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని , ఆత్మగౌరవాన్ని గత ఆరు దశాబ్దాలుగా తృణీకరిస్తూ వలస పాలకుల ఆధితప్య ధోరణిని తెలంగాణ నేలమీద సైతం బలోపేతం చేసిన కారకాలలో తెలుగు సినిమా చూపించిన ప్రభావం, పోషించిన పాత్ర అనన్యసామాన్యం. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా నుంచి తెలంగాణ సినిమాని విముక్తం చేయాలనే ప్రయత్నాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే తెలుగు సినీ పరిశ్రమ పేరిట బలంగా పాతుకుపోయిన వలస సంస్కృతుల బారి నుండి తెలంగాణ సినిమాకు సొంత గ్రామర్ రూపొందించడం సాధ్యమా? అసలు తెలంగాణ సినిమా అస్తిత్వాన్ని తెలుగు సినిమా సునామీ నుండి తట్టుకొని నిలబడగలిగేలా చేయగలమా? తెలుగు సినిమా తరహా మాస్ మసాలా ...

Read More »