Home / Tag Archives: Telangana TASK engineering students

Tag Archives: Telangana TASK engineering students

ఇంజినీరింగ్ విద్యార్థులు ఐటీ రంగంలో రాణించడానికి వత్తినైపుణ్య శిక్షణ – కేటీఆర్

ఇంజినీరింగ్ విద్యార్థులు ఐటీ రంగంలో రాణించడానికి అవసరమైన వత్తినైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమి ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టీఏఎస్‌కే-టాస్క్)ను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి కే తారకరామావు వెల్లడించారు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కంపెనీలకు అవసరమయ్యేవిధంగా నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ అందిస్తామని, ఇందుకోసం కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పద్ధతిలో సాఫ్ట్‌వేర్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఐటీ అభివద్ధిలో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదని కేటీఆర్ తెలిపారు. ఇందులోభాగంగా శుక్రవారం సాయంత్రం 7గంటలకు నగరంలోని తాజ్‌కష్ణా హోటల్‌లో హైదరాబాద్‌లోని 150 ప్రముఖ ఐటీ కంపెనీల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐటీ పరిశ్రమను మరింత విస్తరించేందుకు, పెట్టుబడులు ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. ఐటీ రంగం అభివద్ధి కోసం త్వరలో అమెరికాలోని తెలుగు అసోసియేషన్‌తో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం జూలై మొదటి వారంలో తాను అమెరికా వెళ్లనున్నట్లు తెలిపారు. ఐటీ రంగం అభివద్ధికి పెద్దఎత్తున రాష్ర్టానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కొత్తగా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని పరిశ్రమలు స్థాపించాలనుకునే ...

Read More »