Home / Tag Archives: dalit scholars from telangana

Tag Archives: dalit scholars from telangana

దళిత స్కాలర్ల ప్రతిభ

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు తగినన్ని వనరులు కల్పించి, వాటి నాణ్యతను పెంచితే తెలంగాణ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలరు. నేను ఉదహరించిన విద్యార్థులందరు ప్రభుత్వ స్కూళ్లల్లో తెలుగు మీడియంలో చదువుకున్నవారే. ఇంగ్లిష్ భాష అదేం బ్రహ్మపదార్థం కాదు. ఆలోచన, అవగాహన, స్పందన, సమాజం పట్ల సమగ్ర అవగాహన, ప్రజల మీద ప్రేమ ఉన్న విద్యార్థులకు ఆకాశమే హద్దు.గత వారం కాలమ్‌కు కొనసాగింపుగా మరికొందరు స్కాలర్ల ప్రతిభ గురించి తెలంగాణ విద్యారంగం తెలుసుకోవలసిన అవసరముంది. ముఖ్యంగా కాంట్రాక్టు లెక్చరర్లకు, ఫ్రెష్ స్కాలర్స్‌కు అవకాశాల పంపిణీ విషయంలో స్పర్థ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్లు, కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలను ఉన్నపళంగా రెగ్యులరైజ్ చేస్తే ఎక్కువ విద్యా అర్హతలున్న తమ సంగతేమిటని అడుగుతున్నారు. వాళ్ల శిబిరానికి వెళ్లినప్పుడు కొంత ఆవేశం లో ఉన్నారు. అది కొంత సహజమైనదే. ప్రశ్న అవకాశాలకు సంబంధించింది. ఆ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు వాటిని లోతుగా చర్చించడానికి అది సందర్భం కా దని నాకు అర్థమయ్యింది. తెలంగాణ యూనివర్సిటీలో పరిశోధన చేసిన స్కాలర్లు తమ తమ విశ్వవిద్యాలయాల్లో తమ తమ ప్రాంతాల్లో ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు.కొందరికి ...

Read More »