Home / Tag Archives: హద్దులుదాటిన ఆంధ్ర మీడియా sangishetty srinivas bullet news tv9

Tag Archives: హద్దులుదాటిన ఆంధ్ర మీడియా sangishetty srinivas bullet news tv9

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు తాము బానిసలుగా చూపెట్టిన వాళ్లే తెలంగాణ రాష్ట్రానికి పాలకులు కావడంతో పాచికల్లు, తాగుబోతోడికి తొక్కు పచ్చడి, మడిషి పెట్టుకోవడం లాంటి మాటలతో కావురాన్ని ప్రదర్శిస్తుం డ్రు. తెలుగు సమాజంలో తెలంగాణ వాళ్లను చులకన చేయడమే గాకుండా ఏహ్యభావం కలిగే విధంగా ఈ మీడి యా ఉద్దేశ్యపూర్వకంగా ప్రవర్తిస్తుంది. తెలంగాణ ఆరణాల కూలీ అంజయ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయితే ఆయన్ని ఒక బఫూన్‌గా ఈ మీడి యా చిత్రించింది. బుడ్డర్‌ఖాన్, జోకర్‌గా ఆయన్ని ప్రచారం చేసింది. సముద్రంల తేల్ పడ్డది అంటే తేలు ఎట్ల పడ్తది? అని వ్యంగ్యంగా ప్రచారం చేసిండ్రు. తేల్ అంటే నూనె అనే సంగతి మరిచిండ్రు. ఇదంతా ఆయన తెలంగాణ భాషలో మాట్లాడ్డం మూలంగా చేసిన పరేషాన్. దానికి కొనసాగింపే టీవీ9 బుల్లెట్ న్యూస్ పేరిట కక్కిన కాలకూట విషం.పాశికల్లు తాగెటోనికి ఫారిన్ మందు ముందల బెట్టినట్టే ఉన్నది మన తెలంగాణ ఎమ్మెల్యేల కత, మొకం గడుక్కోని వచ్చిండ్రు బానే కని ప్రమాణ స్వీకారం అయితె చెయ్యుండ్రి అనంగనె ...

Read More »