Home / Tag Archives: స్థానికత కీలకం

Tag Archives: స్థానికత కీలకం

తెలంగాణ ఉమ్మడి అస్తిత్వ భావనలకు మూలం ప్రాంతమే

తెలంగాణ ఉద్యమమే స్థానికీయ (నేటివిటీ) ఉద్యమం. . హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రతో బలవంతంగా కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956 నుంచీ స్థానికీయత ఆధారంగానే తొలి ఉద్యమ భావనలు రూపొందాయి. అంతకుముందు సర్వస్వతంత్రంగాఉన్న హైదరాబాద్ సంస్థానంలో కూడా పాలనావసరాల రీత్యా గైర్‌ముల్కీలను ఉద్యోగాల్లో చేర్చుకున్నారు. అప్పుడే ముల్కీల ఆందోళ న ప్రారంభమయింది. పరిపాలనలో ఇంగ్లీషు ప్రవేశించినప్పటి నుంచి ఉర్దూ రాజభాషగా విలసిల్లిన హైదరాబాద్ స్టేట్‌లో స్థానికీయత అనేది ఒక సమస్యగానే ఉన్నది. నిజాం కాలం నాటి ఈ పరిణామాల వల్ల అచ్చు హైదరాబాదీలు చేసిన ఆందోళనల ఫలితంగా నిజాం ముల్కీ నిబంధనలు ప్రవేశపెట్టారు. ఈ ముల్కీ నిబంధనలు 1956 తర్వాత క్రమక్రమంగా సడలించారు. 1948లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను విముక్తి చేసిన అనంతరం జరిగిన పరిణామాల వల్ల ముల్కీ నిబంధనలను ఉల్లఘించి స్థానికేతరులకు ఉద్యోగాల్లోకి తీసుకోవడం భారీగా జరిగింది.స్వతంత్ర హైదరాబాద్ స్టేట్‌లో ప్రభుత్వం ఏర్పడేదాకా వెల్లోడి పాలన సాగింది. వెల్లోడి పాలనలో ఆంగ్లావసరాల కోసం ఉద్యోగులను తెచ్చుకోవడంతో స్థానికుల అవకాశాలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో ఇంగ్లీషు విద్యావ్యాప్తి లేకపోవడంతో ఇక్కడి వారి అవకాశాలు సన్నగిల్లాయి. సరిగ్గా ఒక ప్రాంతం మీద ఆధిపత్యం ...

Read More »