Home / Tag Archives: స్థానికతను నిర్ధారించడం తెలంగాణా ప్రభుత్వ హక్కు

Tag Archives: స్థానికతను నిర్ధారించడం తెలంగాణా ప్రభుత్వ హక్కు

స్థానికతను నిర్ధారించడం తెలంగాణా ప్రభుత్వ హక్కు, అవసరం, ధర్మం

నాకు పీఎన్‌వీ నాయర్ అంటే అమిత గౌరవం. హాన్స్ ఇండియా పత్రిక ఎడిటర్‌గా ఆయన వృత్తి నిబద్ధత గల జర్నలిస్టుగా, సుదీర్ఘ జీవితానుభవం ఉన్న జ్ఞాని గా విశిష్ట గౌరవ మర్యాదలున్నవారు. అయితే.. నేను ఈ వ్యాసంతో ఆయనకున్న జ్ఞానాన్నీ, వృత్తి నిబద్ధతను సవాలు చేయడం లేదు. కానీ రెండు ఇరుగు పొరుగు రాష్ర్టాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు, వాటి సంబంధాల విషయంలో తలెత్తుతున్న సమస్యలు, కొన్ని విషయాలను ఆయన దృష్టికి తేదల్చుకున్నాను. అయితే ఇక్కడే మరో విషయం కూడా స్పష్టం చేయాలి. నేను కేసీఆర్‌నో, తెలంగాణనో వెనకేసుకొస్తున్నాననుకోవద్దు. సహజ న్యాయసూత్రాల ఆధారంగా తెలంగాణ ప్రజలు, వారి తరఫున కేసీఆర్ కోరుతున్న లేదా అంటున్న విషయాలను విపులీకరించదల్చుకున్నాను. ఇక్కడే మరో విషయం కూడా స్పష్టం చేయాలి. సహజంగానే తరతరాల చరిత్రను పరిశీలించినా.. తెలంగాణ ప్రజలు ప్రేమగల వారు. ద్వేషమన్నదే ఎరుగని వారు. అలాగే కేసీఆర్ కూడా ద్వేషంతో ఏనాడూ ఏమీ చేయలేదు. ఏ మాటా మాట్లాడలేదు. ఆయన అన్నదల్లా సహజ న్యాయసూత్రాల ఆధారంగా తెలగాణ ప్రజలకు న్యాయం దక్కాలె. వివక్ష, అణచివేతలు అంతంకావాలె. వలసపీడనల పీడ విరగడ కావాలె.తెలంగాణ ప్రజలే కాదు, ...

Read More »