Home / Tag Archives: ఆగస్టు 15 నుంచి దళితులకు భూ పంపిణీ KCR Telangana 3 acre land to dalit

Tag Archives: ఆగస్టు 15 నుంచి దళితులకు భూ పంపిణీ KCR Telangana 3 acre land to dalit

భూపంపిణీపై పలు రాష్ర్టాల ఆసక్తి!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబం పథకం పలు రాష్ర్టాలను ఆకర్షిస్తున్నది. ఈ పథకం తీరుతెన్నులపై పలు రాష్ర్టాలు ఆసక్తిగా వాకబు చేస్తున్నాయి. రాష్ట్రంలోని భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల వ్యవసాయ సాగుయోగ్యమైన భూమిని ఇస్తామని టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది.ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోపే ఈ హామీని అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేసి శుక్రవారం (ఆగస్టు 15న) ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. భూమి ఇవ్వడం మాత్రమే కాకుండా నీటి వనరుల కల్పన, ఏడాదిపాటు ఖర్చులన్నీ భరించడంవంటి అంశాలు వివిధ రాష్ర్టాల రాజకీయ వర్గాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పథకాన్ని ఎవరికి వర్తింపచేయాలి? ఎలా వర్తింపచేయాలి? సాధ్యాసాధ్యాలు ఏ మేరకున్నాయి? అన్న విషయాలన్నీ ముందే సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.ఆ క్రమంలో ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ జీవో నెంబర్ 1, మార్గదర్శకాల జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో ఉన్న అంశాలను గతంలో ఏ రాష్ట్రంలోనూ వర్తింపచేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జరుగుతున్న భూ పంపిణీపై ...

Read More »