Home / Tag Archives: August 19 Telangana survey (page 5)

Tag Archives: August 19 Telangana survey

Aug 19th సర్వే పై సందేహాలు.. సమాధానాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే అత్యంత కీలకంగా మారింది. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఉండి సర్వేలో వివరాలను నమోదుచేసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలు వారికి అందబోవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో సర్వేపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు అధికారులు వివరణ ఇచ్చారు. సందేహాలు: సర్వే కోసం ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడుకుటుంబసభ్యులందరూ ఇంట్లో ఉండాల్సిందేనా ? సూచన: అవును, ఆరోజున ఇంట్లో ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటారు. కుటుంబసభ్యులు పలు కారణాల వల్ల ఆ రోజున ఇంట్లో లేకపోతే పరిస్థితి ఏమిటి? దీనికి కచ్చితమైన ఆధారం చూపించాల్సి ఉంటుంది.  ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ర్టాల్లో, విదేశాల్లో ఉన్న వారి సంగతేమిటి? ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటే వారిని పరిగణనలోకి తీసుకోరు. అయితే పై చదువుల కోసం వేరేచోట ఉంటే అదికూడా ఒక సంవత్సరంలోపు వారు తిరిగి ఆ కుటుంబంలోకి వస్తారనే ఆధారం చూపగలిగితే వారి పేరును నమోదు చేసుకుంటారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ ప్రైవేటు ఉద్యోగుల మాటేమిటి? ప్రైవేటు ఉద్యోగులైనా తప్పకుండా ఆ రోజున అందుబాటులో ...

Read More »