Home / Tag Archives: 1956 ప్రాతిపదిక ఎందుకు?

Tag Archives: 1956 ప్రాతిపదిక ఎందుకు?

1956 ప్రాతిపదిక ఎందుకు?

వందల ఏళ్లుగా ఇక్కడ విద్య విస్మరణకు గురైంది. సామాన్యుడికి అందని పండై ఉండిపోయింది. స్వాతంత్య్రానంతరం మన ప్రభుత్వా లు విద్యావ్యాప్తికి చర్యలు ప్రారంభించీ ప్రారంభించక ముందే ఉమ్మడి రాష్ట్రం పేరిట మరో దాస్యప్రపంచంలోకి తెలంగాణ నెట్టివేయబడింది. విద్యారంగం మీద మళ్లీ అమావాస్య కమ్మింది. ఆరు దశాబ్దాల కాలంలో ఈ రంగంలో జరిగిన అన్యాయం వల్లించడం చర్విత చరణమే అవుతుంది. ఇపుడు గ్రహణం విడిచింది కాబట్టి విద్యను సార్వజనీనం చేయడం ఆ రంగంలో దశాబ్దాల పాటు జరిగిన లోటు పాట్లను వేగంగా పూడ్చుకోవడం మన ముందున్న కర్తవ్యం. ఇన్నాళ్లూ నష్టపడ్డాం కనుక మనకే వందకు వంద శాతం ఫలాలు దక్కడం న్యాయం. అందుకు ఉమ్మడి రాష్ట్రం అంటించిన మరకలన్నీ తుడిచేయక తప్పదు. మా పిల్లలు ఇక్కడే పుట్టారు అంటూ లాజిక్కులు మాట్లాడే ప్రతివాడూ ఒకనాటి చొరబాటుదారుడే. అందుకే 1956 కటాఫ్ శాసనం! 1956 ప్రాతిపదికగా స్థానికతను నిర్ధారించడం మీద వివిధ వర్గాల్లో తీవ్ర స్థాయి చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మరీ కఠినంగా వ్యవహరిస్తున్నదని కొందరు అభిప్రాయపడుతుంటే కొంతమంది తెలంగాణవాదులు కూడా మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉద్యమంలో జీవన్మరణ సమస్యగా ...

Read More »