Home / తెలుగు / ఇంటింటి సర్వేపై సందేహాలు-సమాధానాలు

ఇంటింటి సర్వేపై సందేహాలు-సమాధానాలు

సర్వే జరుగనున్న 19వ తేదీన ప్రైవేటు సంస్థలు సెలవు ప్రకటించకుంటే పరిస్థితి ఏమిటి?
సమాధానం: తెలంగాణ పది జిల్లాల్లో ప్రైవేటు సంస్థలు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాల్సిందే. ఈ మేరకు కార్మిక ఉపాధి శాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు జారీ అవుతాయి. 
సందేహం: గిరిజనులు ఉపాధి కోసం అడవుల్లో సంచరిస్తుంటారు.. వారి నమోదు ప్రక్రియ ఎలా ఉంటుంది ?
సమాధానం: నివాస స్థలాలు(హాబిటేషన్స్) ఎక్కడ ఉంటే అక్కడికి సర్వే సిబ్బంది తప్పనిసరిగా వెళతారు. సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండి ప్రతి కుటుంబంలోని వ్యక్తుల పేర్లను నమోదు చేస్తారు. 
సందేహం: సంచార జాతులు ఒక చోట స్థిరనివాసం ఉండరు.. అలాంటి వారిని ఏవిధంగా పరిగణలోకి తీసుకుంటారు ?
సమాధానం: సర్వే జరిగే రోజున వారు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే వారి వివరాలను నమోదుకు చర్యలు తీసుకోవాలని సర్వే యంత్రాంగానికి కచ్చితమైన ఆదేశాలు జారీచేస్తున్నాం. 

సందేహం: అత్యవస సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు ఇంటిలో ఉండలేరు కదా ? 
సమాధానం: ఇలాంటి ఉద్యోగులకు సంబంధించిన వివరాలు వారి కుటుంబసభ్యులు తగిన ఆధారాలతో చూపిస్తే సరిపోతుంది. సర్వే సిబ్బంది కూడా అంగీకరిస్తారు. 
సందేహం: ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నరోగుల నమోదు చేసుకుంటారా ?
సమాధానం: ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నట్లుగా ఆధారాలను కుటుంబసభ్యులు చూపిస్తే సరిపోతుంది. 
సందేహం: కుటుంబసభ్యులందరూ ఉండాల్సిందేనా ?
సమాధానం: అనివార్య కారణాల వల్ల కుటుంబసభ్యులు అందుబాటులో లేనిపక్షంలో అందుకు గల కారణాలు, వాటికి సంబంధించిన ఆధారాలను చూపించి కుటుంబసభ్యుల్లో ఒకరు పూర్తి వివరాలను వెల్లడిస్తే సరిపోతుంది. 

సందేహం: ఇంటికి తాళం వేసి ఊరికెళ్లిన వారి సంగతేంటి ?
సమాధానం: సర్వే రోజున ఇంటికి తాళం వేసినట్లుగా ఎన్యుమరేటర్ గుర్తించి నమోదు చేస్తారు. ఆ తర్వాత ఇంటి కుటుంబ సభ్యులు సర్వే రోజున ఎందుకు అందుబాటులో లేరు.. ఎక్కడికి వెళ్ళారు ..అనే వివరాలను ఆధారాలతో పాటు నిర్ధారించాల్సి ఉంటుంది. 
సందేహం: మానసిక వికలాంగులు, మతి స్థిమితం లేని వారి పేర్లను కూడా నమోదు చేసుకుంటారా ?
సమాధానం: పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా అందరి వివరాలు, అన్ని వివరాలు నమోదు అవుతాయి.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

One comment

  1. I am basically from Hyderabad and Woking in chennai I as software professional, so I cannot come to Hyderabad on survey day, so IHOP can I submit my details to the servey team in future .
    It would be really appreciated if you can respond and suggest for my clarification.
    regards, raja

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,260 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>