Home / తెలుగు (page 3)

తెలుగు

గోల్కొండకోటలో పంద్రాగస్టు ఏర్పాట్లు పూర్తి

గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌శర్మ, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ప్రొటోకాల్ డిప్యూటీ కమిషనర్ హర్మిందర్‌సింగ్ మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. తారామతి మసీదు వద్ద వేదిక ఏర్పాటు, దాని పక్కనే జాతీయ జెండా ఆవిష్కరణ, ముఖ్యమంత్రి ప్రసంగ వేదిక ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. పోలీసులు పరేడ్ రిహార్సల్స్‌ను నిర్వహించారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా గోల్కొండ ప్రాంతంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. వేడుకల రోజు పాసులు ఉన్నవారినే అనుమతిస్తామని తెలిపారు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాలను కోటలోకి అనుమతింబోమన్నారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రూట్ మ్యాప్‌ను రూపొందించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. కాగా, గోల్కొండ కోటలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చిన రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ వాహనానికి రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ వరకు పోలీసులు బైక్‌పై పైలెటింగ్ నిర్వహించారు. గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు చెందిన రక్షక్ వాహనం మొరాయించడంతో స్థానిక ఎస్‌ఐ బైక్‌పై పైలెటింగ్ నిర్వహించారు. ...

Read More »

దుష్ప్రచారాలు నమ్మొద్దు ..సమగ్ర సర్వే సకల జన హితం కోసమే

- సందీప్ రెడ్డి కొతపల్లి ఎన్యూమరేటర్ మీ ఇంటి కొస్తాడు ..మీ నట్టింటి కొస్తాడు ..మీ బెడ్ రూమ్ కొస్తాడు .మీ వంట రూమ్ కు వస్తాడు ..మీ రేషన్ కార్డు ఆపేస్తారు ..మీ ఫించను లాగేస్తారు.. మీ ఆస్తులు గుంజుకుంటారు అంటూ సీమాంధ్ర మీడియా ..తెలంగాణలో ఉన్న సీమాంధ్ర పార్టీల తొత్తు నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఏ మాత్రం నమ్మవద్దు. ఇది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఓ బృహత్తర కార్యక్రమం. అక్రమార్కులను దూరం పెట్టి నిజమయిన లబ్దిదారుడు ప్రభుత్వ అండతో పైకి రావాలన్న ఆకాంక్షతో చేస్తున్న నిఖార్సయిన కార్యక్రమం. అయితే ప్రజల్లో ఈ సర్వే విషయంలో నెలకొన్న సందేహాలు కూడా చాలానే ఉన్నాయి. 60 ఏళ్ల నుండి నెలకు ఓసారి ఇచ్చే రేషన్ కార్డు కోసమో, ఫించను కోసమో ..ఆరోగ్యశ్రీ కార్డు కోసమో ..లీటరు కిరసనాయిలు ..అద్దకిల చక్కెర, పావుకిల పప్పు ..కిల ఉప్పు ..అద్దకిల చింతపండు ..వంటి తాత్కాలిక అవసరాలకు మనల్ని బానిసలను చేసి ..మన కాళ్ల మీద మనం నిలబడే అవకాశం ఇవ్వకుండా ..కేవలం ఓట్లేసే యంత్రాలుగా ...

Read More »

గవర్నర్‌కు శాంతిభద్రతలను లోక్‌సభ నాడే తిరస్కరించింది

AP Reorganisation Bill law & order

హైదరాబాద్ నగర శాంతిభద్రతలు గవర్నర్‌కు అప్పగించే అంశంలో కేంద్ర హోంశాఖ తప్పులో కాలేసిందా?.. అవును. నిజంగా నిజం. గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించే అంశాన్ని లోక్‌సభ ఎప్పుడో తిరస్కరించింది. హోంశాఖ తానే రూపొందించి పార్లమెంటుతో ఆమోదింప చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు – 2014 పై లోక్‌సభ ఆమోదం సందర్భంగా ఇది చోటు చేసుకుంది.వివరాలివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర హోంశాఖ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హోంశాఖ రూపొందించిన చిత్తుప్రతికి నాటి యూపీఏ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసి రాష్ట్రపతికి పంపించింది. అక్కడినుంచి అసెంబ్లీ చర్చ అనంతరం కొద్దిపాటి మార్పులతో లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లులోని వివిధ అంశాలపై అన్ని పార్టీల నాయకులు రోజంతా సమగ్రంగా చర్చించారు. అయితే అంతకు ముందు పార్లమెంటులో పెప్పర్ స్ప్రే ఘటన కారణంగా పార్లమెంటు ప్రసారాలు నిలిపివేసి చర్చ నిర్వహించడంతో నాటి చర్చ వివరాలు ప్రముఖంగా ప్రచారంలోకి రాలేదు. ఆ రోజు ఏమైందంటే… లోక్‌సభలో కొద్ది పాటి ప్రతిఘటనల మధ్య కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ...

Read More »

ఆంధ్రజ్యోతి చెత్త పలుకులు!

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత గొప్ప ఫిక్షన్ రైటర్ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. కలలు కనడం, ఆ కలలకు అక్షరరూపం ఇవ్వడం, అవి చెదరిపోగానే మళ్లీ కొత్త కలలు కనడం రాధాకృష్ణకు అలవాటయింది. రాధాకృష్ణ కలల ప్రపంచం నానాటికీ విస్తరిస్తున్నది. ఇప్పుడది అనంతంగా గోచరిస్తున్నది. ఆంగ్లంలో విష్‌ఫుల్ థింకింగ్ అంటారు.. రాధాకృష్ణను అది ఆవహించినట్టు కనిపిస్తున్నది. గవర్నర్‌కున్న అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించినట్టు, దానిపై కేంద్రం సీరియస్ అయినట్టు, రాజ్యాంగాన్ని అవమానించడంగా భావించినట్టు, అవసరమయితే చివరి ఆయుధంగా కేంద్ర పాలన విధించే అవకాశం ఉన్నట్టు… అక్కసు, అజీర్తీ, ఉక్రోషమూ కలబోసి కలనేసి రాధాకృష్ణ అల్లిన కల్లబొల్లి కథనాన్ని చూసి తెలంగాణవాదులు విస్తుపోతున్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మనసులో ఎంత కుట్ర ఉన్నదో ఆయన ఈ రకంగానయినా బయటపెట్టుకున్నందుకు సంతోషం. ఆంధ్రజ్యోతి పత్రిక రాసిందంతా కేంద్రం బాధ అని ఎవరూ అనుకోవడం లేదు. అదంతా కేవలం రాధాకృష్ణ బాధ.. రాధాకృష్ణ గోస. రాధాకృష్ణ తన రెండు ముఖాలను ఎప్పుడూ దాచుకోలేదు. ఒకటి- నేను తెలంగాణవాడినంటాడు. తెలంగాణవాదినంటాడు. రెండు – మనసావాచా కర్మణా సమైక్యవాదిలా, చంద్రబాబు మనిషిలా మాట్లాడతాడు, రాస్తాడు. కేంద్రం మిథ్య, ...

Read More »

కుట్రల పై వివరణ ఇవ్వాలని 10 ప్రశ్నలతో బాబుకి హరీష్ రావు బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంచేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.రాష్ట్రంతో కయ్యంపెట్టుకుంటూ తిరిగి ముఖ్యమంత్రి కేసీఆరే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించడం సరికాదన్నారు. చంద్రబాబు వైఖరి దొంగే దొంగా దొంగా అన్నట్టుగా ఉందని మండిపడ్డారు. వెన్నుపోటు, మోసానికి పర్యాపదం బాబు అని, ఈ విషయాన్ని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆరే చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌లను భారత్-పాకిస్థాన్‌తో పోలుస్తూ విద్వేషాలు రేపుతున్నది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు బాధ్యతలు తీసుకున్న తరువాత ఏపీ అభివృద్ధి కోసం కాకుండా, ప్రతిరోజు తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు పనుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రశ్నిస్తూ రాసిన బహిరంగలేఖను సిద్దిపేటలోని తన నివాసంలో ఆదివారం మీడియాకు విడుదలచేశారు. ఆ ప్రశ్నలివి..1. తెలంగాణ అంతర్భాగమైన భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడానికి కేంద్రంపై ఒత్తిడితెచ్చారు. మీరు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణకు చేసిన మొదటిద్రోహం ఇది. మరి పోలవరం ముంపు ప్రాంతాల విషయం పునర్విభజనచట్టంలో ఉందా? పోలవరం బిల్లు కుట్ర నీది కాదా?  2. తెలంగాణలో కరెంట్ కష్టాలున్నాయని తెలుసు. రెండురాష్ర్టాల్లో ...

Read More »