Home / తెలుగు (page 2)

తెలుగు

భూపంపిణీపై పలు రాష్ర్టాల ఆసక్తి!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబం పథకం పలు రాష్ర్టాలను ఆకర్షిస్తున్నది. ఈ పథకం తీరుతెన్నులపై పలు రాష్ర్టాలు ఆసక్తిగా వాకబు చేస్తున్నాయి. రాష్ట్రంలోని భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల వ్యవసాయ సాగుయోగ్యమైన భూమిని ఇస్తామని టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది.ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోపే ఈ హామీని అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేసి శుక్రవారం (ఆగస్టు 15న) ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. భూమి ఇవ్వడం మాత్రమే కాకుండా నీటి వనరుల కల్పన, ఏడాదిపాటు ఖర్చులన్నీ భరించడంవంటి అంశాలు వివిధ రాష్ర్టాల రాజకీయ వర్గాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పథకాన్ని ఎవరికి వర్తింపచేయాలి? ఎలా వర్తింపచేయాలి? సాధ్యాసాధ్యాలు ఏ మేరకున్నాయి? అన్న విషయాలన్నీ ముందే సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.ఆ క్రమంలో ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ జీవో నెంబర్ 1, మార్గదర్శకాల జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో ఉన్న అంశాలను గతంలో ఏ రాష్ట్రంలోనూ వర్తింపచేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జరుగుతున్న భూ పంపిణీపై ...

Read More »

శరత్ కల సాకారం చేసిన సీఎం కేసీఆర్‌

  హృద్రోగంతో బాధపడుతూ అపోలో దవాఖానాలో చికిత్స పొందుతున్న వరంగల్ జిల్లా నర్మెట్టకి చెందిన 11ఏళ్ల కొండా శరత్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. శరత్‌ను చూసి ఎలా ఉన్నావ్ శరత్ బాగున్నావా? అని ఆత్మీయంగా పలుకరించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే వచ్చి తమ బిడ్డను పలుకరించడతో పక్కనే ఉన్న శరత్ తల్లిదండ్రులు ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆనందంతో నోట మాటలు రాలేదు. ఆనందంతో శరత్ చేతులు జోడించి సీఎం కేసీఆర్‌కు నమస్కరించాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది. శరత్: నమస్కారం సార్.. బాగున్నాను. సీఎం : పెద్దయ్యాక నువ్వు ఏం కావాలనుకుంటున్నావు?శరత్: డాక్టర్ కావాలని ఉంది సార్.సీఎం: నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావ్.. నీకేం భయం లేదు.. నేనున్నా. ఎంత ఖర్చయినా సరే భరించి నేను చదివిస్తాను. శరత్: ఊళ్లో మాకు ఇల్లు కూడా లేదు సార్.సీఎం: ఒక్క ఇంటి స్థలమే కాదు. ఇల్లు కూడా కట్టిస్తాను. నువ్వు త్వరగా కోలుకొని దవాఖాన నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఖర్చుల కోసం పార్టీ తరుపున రూ.5లక్షలు ఆర్థిక సహాయం కూడా అందజేస్తా. సరేనా శరత్ నేను వెళ్లొచ్చా?శరత్: సార్ ...

Read More »

విభజనకు అడ్డం పడుతున్న ఆంధ్ర సర్కార్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సంఖ్యను, క్యాడర్‌స్ట్రెంత్‌ను నిర్ధారించిన తర్వాతనే ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను వెలువరిస్తామని ఉద్యోగుల విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్ పేర్కొన్నారు. క్యాడర్‌స్ట్రెంత్‌ను 13 ః10 నిష్పత్తిలోనే విభజిస్తామని స్పష్టం చేశారు. రెండు రోజులలో ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం విభజన కమిటీ సమావేశం తర్వాత ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. మార్చి 2015 నాటికి ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. అనేక విషయాలలో స్పష్టత లేనందున ఆలస్యం సహజమేనని అన్నారు. పొరపాట్లు జరుగకుండా ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకొని ఎవరికీ నష్టం జరుగకూడని పద్ధతిలో, సామరస్యంగా, సానుకూలంగా విభజన జరగాలని కమిటీ భావిస్తున్నదని పేర్కొన్నారు. ఆ కోరిక న్యాయమైనదే: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో క్షేత్రస్థాయినుంచి సెక్రటేరియట్ వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలని కోరుతున్నదని, ఈ కోరిక న్యాయమేనదని కమలనాథన్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల క్యాడర్‌స్ట్రెంత్‌ను నిర్ధారించిన తర్వాతనే తెలంగాణ నాలుగోతరగతి ఉద్యోగులను తెలంగాణకు బట్వాడా చేయగలుగుతామని పేర్కొన్నారు. చాలా విషయాలలో ఏకాభిప్రాయం కుదరలేదని అంగీకరిస్తూనే అతిత్వరలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. ఉద్యోగుల స్థానికతపై తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకులు వెరిఫికేషన్ కోరుతున్నారని, ...

Read More »

చంద్రబాబు తెలంగాణకు ప్రతిపక్ష నేతనా?

చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా..? లేక తెలంగాణకు ప్రతిపక్ష నేతనా? అని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నాయకులు స్థాయి మరిచి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఇది మంచిపద్ధతి కాదని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి కోసం సద్విమర్శలు చేసినా స్వీకరిస్తామని.. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. హెరిటేజ్ పాలు తాగే నీ పద్ధతి మార్చుకో.. లేకుంటే నీబండారం బయట పెడతామని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే సహించేది లేదని ఎర్రబెల్లి దయాకర్‌రావుపై మండిపడ్డారు. గవర్నర్‌కు అధికారాలు అప్పగించాలని రాష్ర్టానికి కేంద్రం రాసిన లేఖపై పార్లమెంటులో టీఆర్‌ఎస్ ఎంపీలమంతా ఆందోళన చేశామన్నారు. తమ ఆందోళనకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, దీంతో హోంశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ ఎంపీలతో ప్రత్యేకంగా మాట్లాడారన్నారు. పొన్నాల లేఖ రాయడంపై స్పం దిస్తూ.. పొన్నాలా.. 21 అంశాలపై లేఖ రాశావు. 101 అంశాలపై నీబండారం బయటపెడతా అని హెచ్చరించారు. సీమాంధ్ర నాయకులు రాష్ట్రం ఏర్పడకముందు అనేక అపోహలు సృష్టించారని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. రాష్ట్రం ...

Read More »

గుంత చూపిస్తే…1000 బహుమానం! – GHMC ప్రణాళిక

-గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ప్రణాళిక-అత్యాధునిక యంత్రంతో పూడ్చివేత పనులు-ఆగస్టు 15 నుంచి -3నెలలు పైలెట్ ప్రాజెక్టు-ఆ తర్వాత గుంతలు -గుర్తిస్తే మనీ ప్రైజ్-జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్  రోడ్డుపై గుంతను గుర్తించండి.. వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తాం.. ఈ మాటలన్నది ఎవరో కాదు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్.. నగరంలోని ప్రధాన రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గుంతలు పూడ్చే అత్యాధునిక యంత్రాన్ని ఉపయోగించబోతున్నారు. గుంతల డేటాబేస్‌ను రూపొందించేందుకు మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగించనున్నారు. సెంట్రల్‌జోన్ పరిధిలో ముందుగా కొన్ని రోడ్లను ఎంపిక చేసి ఆగస్టు 15న పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.గుంతలు గుర్తించిన అనంతరం ఇన్ఫ్రారిడ్ హీటింగ్ సిస్టంతో కూడిన యంత్రం సహాయంతో వాటిని అక్కడికక్కడే పూడ్చివేస్తారు. బీటీని నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడిచేసి కంకరలో కలుపుకుని గుంతలను పూడ్చడం ఈ యంత్రం ప్రత్యేకత. ప్రతి చదరపు మీటరుకు యంత్రానికి నిర్ణీత ధరను చెల్లిస్తారు. ఇదే విషయమై కమిషనర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు కింద మూడునెలల పాటు ప్రధాన రోడ్లపై అమలు చేస్తామని, ఆ తర్వాత గుంతలు గుర్తిస్తే రూ. 1000 బహుమానంగా ఇస్తామని తెలిపారు. సిటీబ్యూరో, టీ ...

Read More »