Home / Movies (page 7)

Movies

మాయ తెర By: – దేశపతి శ్రీనివాస్

ఉహ తెలిసిన నాటి నుంచి మనసును పట్టి ఊపుతున్న కాల్పనిక ప్రపంచం సినిమా. ఆలోచన, భావన సృజన అన్నింటినీ సినిమా తన్మయం చేసింది. జీవితం సినిమా అయిపోయినట్లు విషాదంలోనూ, వినోదంలోనూ ఒక బ్యాక్‌గ్రౌన్డ్ మ్యూజిక్ మోగుతున్నట్లే భ్రమ. చిన్నప్పుడు కొట్లాడుకుంటుంటే కూడా డిష్షుం డిష్షుం అనే చప్పుడు నోటి అప్రయత్నంగా వెలువడేది. జానపదాలు చూసిన ప్రభావం చిన్నప్పుడు ఎంత వెంటాడేదంటే..చేతుల కళ్ళాన్ని పట్టుకొని నోటితోని గుర్రం గిట్టల ధ్వనిని చేసుకుంటు కాలొకటి ఎగరేసుకుంటు పంచకళ్యాణి మీద దూసుకపోవుడే కని మామూలుగా నడిచేదా? ఎలితెబద్దలకు సుతిలి దారాలుగట్టి బాణాలు తయారు చేసుకొని నుదుటికి ఆనించుకుని అచ్చం ఎన్టీ రామారావు వలనె మంత్రించి అస్త్రాలు వదిలితే రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫీలో దూసుకపోతున్నట్టు అబ్బ చెప్పరాని సంబురం. వంకరటింకర కట్టె ఒకటి కనబడితె అదే చేతుల మంత్రదండంగా మారిపోయేది. రాజనాలంత భీకరంగా ‘సర్పకేశీ’ అని భూతాలను ఆవాహన చేసుడు. జ్వాలాదీప రహస్యాలను కనుక్కొని మంత్రగాని ప్రాణమున్న భరిణెను దొరికించుకొని చిత్రవధ చేసి వధించేంది. దీపావళి తుపాకులు తీసుకొని గోడచాటుకు దాక్కుంటు నడుమ నడుమ తల బయటకు పెట్టుకుంట అచ్చం డిటెక్టివ్ సినిమాల వలనె ...

Read More »

“కోస్తాంధ్ర విముక్తి చేసిన హైదరాబాద్” అనే ఒక సినిమా కథ!

“కోస్తాంధ్ర విముక్తి చేసిన హైదరాబాద్” అనే ఒక సినిమా కథ: ఒక అత్తిలి నుండో, ఒక కొండవీడు నుండో, లేదూ గొడావరి డిస్ట్రిక్ట్ లలో ఒక పల్లెటూరి నుండో మన హీరో హైదరాబాద్ వస్తాడు! హైదరాబాద్ కి రాక ముందు ఆయన గారు తన వూళ్ళో పరమ అల్లరి చిల్లరిగా తిరిగే ఒక ఉత్త సోమరిపోతు, ఆవారా, లఫంగ, తిరుగుబోతు అయిఉంటాడు. హీరోయిన్ బొడ్డు మీద బత్తాయిలో జాంపండ్లో (మరీ కొబ్బరి బోండాలు విసిరితే పిల్ల చచ్చి ఊరుకుంటుంది కనక) విసిరి ఒక రెండు పాటలు కూడా పాడి ఉంటాడు. ఈయన గారి చేష్టలకు విసిగి వాళ్ళ నాన్న “ఒరే వెధవా ఇక్కడ మనకు ఇంత పొలమున్నా నీకు యే పని చేత కాక పోయే! హైదరాబాద్ లో మనకు చాల దగ్గరి చుట్టం ఒకాయన పెద్ద ఫాక్టరీ యజమాని ఉన్నాడురా! ఆయన దగ్గర్కి పోతే మాంచి జాబ్ ఇప్పిస్తాడురా! కాలు మీద కాలేసుకుని కనేసం అది అయినా కుదురుగా చేసుకోపోరా ” అని హైద్రాబాద్ పంపిస్తాడు! మన హీరో గారు గొడావరి యాసలో రైలు లో బోల్డు జోకులతో ...

Read More »