Home / TG History / Arts & Literature (page 3)

Arts & Literature

వలసంటే? – అభినయ్ కశ్యప్

1002627_10200754980371032_2108133960_n

ఒక 15 ఏండ్ల కిందటి మాట: వేసవి సెల్వులు వస్తే మా దోస్తులందరూ తిరుపతి వోతం, ఊరికి వోతం, ఊటీ వోతం అనేటోళ్ళు. నాకు మాత్రం మనసంతా మా ఊరిమీననే. “మా పల్లె యందు ప్రకృతి పరవశించెను, ఎటు చూసినా పచ్చని పొలాలతో, పారే కాలువలతో, వాగులతో, వంకలతో, పల్లె అందము వర్ణనాతీతము” అని పుస్తకాలల్ల సదువుకునేటిది. అది సదివి ఊరికి పోవాలెనని ఉబలాటం ఇంగా ఎక్కువయ్యేటిది. అప్పట్ల చిన్న చిన్న పోరల్లం ఒక పది మంది దంక ఐతుంటిమి. సెల్వులొస్తే సాలు, ఊరికోవాలె, ఆడ అందరితోని ఆడుకునాలె, శామకూరోళ్ళ సందీపు, భారతీషు, పద్మనాభాచర్య, ఐద్రవాదు సంపతు, మా ముగ్గురక్కలు, పెదనాయిన, పెద్దమ్మ ఇంగ మా కాక. ఎప్పుడైతె కలుస్తనా ఈళ్ళనందరినీ అని పానం ఒకటే గుంజుడు. ” ఎండాకాలం రా బిడ్డా ఆడ ఓళ్ళకే మస్తు కష్టము, అసలే ఊర్ల నీళ్ళు లేవు, నీడ పట్టున ఈడనే ఉండు రా ఇంటి కాడ” అని అమ్మా, నాయిన మస్తు జెప్పేటోల్లు. మనం ఇంటమా, ఆ దోస్తులు, ఆ మామిడిపండ్లు, మా కాక. మనసు వశమయ్యేటిది కాదు. రెండు మూడు ...

Read More »