Home / Tag Archives: Prof Jayashankar birth anniversary

Tag Archives: Prof Jayashankar birth anniversary

పాఠ్యాంశంగా సార్ జీవితచరిత్ర

  తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ హోమ్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సార్ చేసిన సేవలను కొనియాడారు. నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం వరకు ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. సార్ జీవిత విశేషాలు భావితరాలకు తెలిసేలా ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని అన్నారు. ఈ సందర్భంగా నాన్ టీచింగ్ ఉద్యోగుల భవనానికి జయశంకర్ భవన్‌గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సం ఘాల నాయకులు మాట్లాడుతూ అన్ని రకాల విద్యాసంస్థల్లో జయశంకర్ ...

Read More »

AP Criticizes Renaming & Claims Ownership Of NG Ranga University!

A delegation of Andhra Pradesh ministers called on Governor E S L Narasimhan on the issue of changing the name of N G Ranga Agricultural University and Sri Venkateswara Veterinary University (SVVU) and lodged a protest against the decision of the Telangana government to bifurcate and rename the universities. It may be mentioned here that Telangana government has recently announced changing the name of the N G Ranga Agricultural University and named the university after late Prof. Jayashankar and similarly named the other university after former PM PV Narasimha Rao. AP deputy chief minister K E Krishnamurthy, ministers Yanamala Ramakrishnudu, Pattipati Pullarao, Narayana, Kamineni  Srinivas and media advisor Parakala Prabhakar met the Governor and raised objection for changing the name of the decades’ old universities. Andhra Pradesh deputy chief minister ...

Read More »

అంతం కాదిది..ఆరంభమే, ఇంకా మార్చాల్సినవి చాలా ఉన్నాయి!

CM KCR Paying tribute to Acharya Jayashankar
Pic: NT

ఆంధ్ర నేతలూ.. పిచ్చిపనులు ఆపండి.. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి లక్ష కోట్లతో రాజధాని కట్టుకునేవారు.. పిల్లల ఫీజులు కట్టుకోలేరా?మా పిల్లలకే ఫీజులు చెల్లిస్తాం. సీఎం కేసీఆర్ - వర్సిటీ పేరు మార్చితే ఎందుకంత కుళ్లు? - ఇంకా మార్చాల్సినవి చాలా ఉన్నాయి .. - మా బతుకు మాది.. మీ బతుకు మీది - ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీని ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్ - ప్రొఫెసర్ విగ్రహం, పైలాన్ ఆవిష్కరణ హైదరాబాద్, ఆగస్టు 6 (టీ మీడియా):తెలంగాణలో పేర్లు మార్చాల్సిన సంస్థలు ఇంకా చాలా ఉన్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ పేరును ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీగా మార్చడంపై ఆంధ్ర ప్రాంత నాయకులు ఎందుకు కుళ్లుకుంటున్నారని ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చిపనులు మానుకొని, దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలని ఆంధ్ర నేతలకు పిలుపునిచ్చారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ 81వ జయంతిని పురస్కరించుకుని జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటుచేసిన జయశంకర్ విగ్రహాన్ని, వర్సిటీ పేరును జయశంకర్‌సార్ పేరిట మార్పుచేస్తూ ...

Read More »

మార్గదర్శి జయశంకర్ సార్

నేడే ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి.ఒక లక్ష్యం కోసం సుదీర్ఘకాలం, అలుపు లేకుండా పోరాటం చేసిన అతికొద్ది మంది యోధుల్లో ప్రొఫెసర్ జయ శంకర్ గారి పేరు చేర్చ క తప్పదు. ఆయన జీవితం తెలంగాణ ఉద్యమంతో పెనువేసుకుని పోయింది. తెలంగాణ కోసం పోరాడిన మూడు తరాలకు వారధి ప్రొఫెసర్ జయశంకర్. 1952 ముల్కీ ఉద్యమంలో జయశంకర్ గారు కార్యకర్త. 1968లో ప్రత్యే క రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో భావవ్యాప్తికి కృషి చేయగా, 1996లో మొదలైన మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిర్దేశకుడయ్యాడు.వ్యక్తిగత అనుభవం ఆధారంగానే ఎవరైనా జీవిత లక్ష్యాలను నిర్ణయించుకుంటారు. అయితే మనలో చాలామంది జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారమైతే చాలునని అనుకుంటాం. మన సమస్య పరిష్కారమైతే సంతృప్తిచెందుతాం. కానీ జయశంక ర్ లాంటివారు తాము ఎదుర్కొన్న సమస్యలు తమ కే కాదు మరెవ్వరికీ రాకూడదని భావిస్తారు. అందుకనే సమస్యలకు మూలాలను వెతికి వాటిని సమూలంగా రూపుమాపాలని ప్రయత్నిస్తారు. అంబేద్కర్ అంటరానితనాన్ని వ్యక్తిగత సమస్యగా చూడలేదు. అంటరానితనం కులవ్యవస్థలో భాగమని గుర్తించి, కులవ్యవస్థ నిర్మూలనకు పోరాటం చేశారు. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆంధ్ర పాలకు లు ...

Read More »